Best Web Hosting Provider In India 2024
OTT Telugu: పవన్, విజయ్ దేవరకొండ, నాని, చైతూ, సిద్ధు, నవీన్ నెక్స్ట్ సినిమాలకు ఓటీటీ ఖరారు.. మరిన్ని చిత్రాలు కూడా..
OTT: ఈ ఏడాది రానున్న కొన్ని తెలుగు సినిమాల ఓటీటీ ప్లాట్‍ఫామ్‍పై అప్‍డేట్ వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ విషయాన్ని ఆ ఓటీటీ వెల్లడించింది. పవన్ కల్యాణ్, విజయ్ దేవరకొండ, నాగచైతన్య సహా మరికొందరు హీరోల చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.
తెలుగులో ఈ ఏడాది చాలా ఇంట్రెస్టింగ్ చిత్రాలు రానున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ ఓజీపై అంచనాలు భారీగా ఉన్నాయి. వరుస ప్లాఫ్‍లను ఎదుర్కొన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వీడీ12గా పిలుస్తున్న ఈ మూవీకి త్వరలోనే టైటిల్ ఖరారు కానుందని తెలుస్తోంది. కొన్నేళ్లుగా హిట్ కోసం చూస్తున్న నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ చిత్రం చేస్తున్నారు. సిద్ధు జొన్నలడ్డ ‘జాక్’ మూవీతో త్వరలో రానున్నారు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఏదో వెల్లడైంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఏ ఓటీటీలోకి వస్తాయో తెలిసిపోయింది.
ఈ ఓటీటీలోనే..
ఓటీటీ డీల్స్ చేసుకున్న కొన్ని తెలుగు సినిమాల వివరాలను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు (జనవరి 14) వెల్లడించింది. సంక్రాంతి సందర్భంగా ఈ అప్‍డేట్ ఇచ్చింది. నెట్‍ఫ్లిక్స్ పండుగ పేరుతో వరుసగా సినిమాలను రివీల్ చేస్తూ వచ్చింది. థియేట్రికల్ రన్ తర్వాత తమ ప్లాట్‍ఫామ్‍లో ఈ సినిమాలు స్ట్రీమింగ్‍కు వస్తాయని వెల్లడించింది.
తొమ్మిది సినిమాలపై..
ఓజీ, వీడీ12, జాక్, హిట్ 3, తండేల్, మ్యాడ్ స్క్వేర్, అనగనగా ఒక రాజు, మాస్ జాతర, కోర్ట్ సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్టు నెట్‍ఫ్లిక్ నేడు కన్పర్మ్ చేసింది. తెలుగులో రూపొందే ఈ చిత్రాలను హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ స్ట్రీమింగ్‍కు తేనున్నట్టు వెల్లడించింది. మొత్తంగా క్రేజీ చిత్రాలను నెట్‍ఫ్లిక్స్ పట్టేసింది. థియేటర్లలో రిలీజ్ అయి రన్ పూర్తయ్యాక ఈ చిత్రాలు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో రానున్నాయి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ఓజీ చిత్రం ఈ ఏడాదిలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు. మాస్ జాతర చిత్రంలో రవితేజ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీకి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా హిట్ 3 చిత్రం రూపొందుతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు.
తండేల్ మూవీలో నాగ చైతన్యకు జోడీగా సాయిపల్లవి నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలోకి రానుంది. జాక్ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా చేస్తున్నారు. కోర్ట్ చిత్రంలో ప్రియదర్శి లీడ్ రోల్ చేస్తుండగా.. నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్నారు.
నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా అనగనగా ఒక రాజు చిత్రం రానుంది. ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహిస్తుండగా.. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వీడి 12 చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన శ్రీలీల నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నారు. మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మ్యాడ్ చిత్రానికి సీక్వెల్‍గా రూపొందుతోంది. థియేటర్లలో రిలీజైన తర్వాత ఈ చిత్రాలు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానున్నాయి.
సంబంధిత కథనం