Hyderabad : పల్లె కళకళ.. పట్నం వెలవెల.. బోసిపోయిన భాగ్యనగరం వీధులు

Best Web Hosting Provider In India 2024

Hyderabad : పల్లె కళకళ.. పట్నం వెలవెల.. బోసిపోయిన భాగ్యనగరం వీధులు

Basani Shiva Kumar HT Telugu Jan 14, 2025 03:07 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Basani Shiva Kumar HT Telugu
Jan 14, 2025 03:07 PM IST

Hyderabad : హైదరాబాద్ వీధులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపారం కోసం భాగ్యనగరంలో నివాసం ఉంటున్నవారు సంక్రాంతి సందర్భాగా సొంతూళ్లకు వెళ్లారు. నిత్యం రద్దీగా ఉండే భాగ్యనగరం రోడ్లన్నీ ఖాళీగా మారాయి. సిటీ అంతా నిర్మానుష్యంగా మారింది. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి.

బోసిపోయిన భాగ్యనగరం వీధులు
బోసిపోయిన భాగ్యనగరం వీధులు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

హైదరాబాద్ వాసులు సొంతూళ్లు బాట పట్టారు. దీంతో నగరం నిర్మా నుష్యంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే హైటెక్‌సిటీ, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తెలియనవి కాదు. సంక్రాంతి పండుగ, వరుస సెలవుల నేపథ్యంలో ప్రజలంతా తమ సొంతూళ్ల బాట పట్టారు. ఫలితంగా రద్దీగా ఉండే నగరం బోసిపోయింది.

yearly horoscope entry point

విజయవాడ దారిలో..

శుక్ర, శని వారాల్లో ఒక మోస్తరుగా జనసంచారం కనిపించినా ఆదివారం కావడంతో మిగిలిన వారు కూడా పల్లె బాట పట్టారు. నగరంలో నిత్యం కనిపించే ట్రాఫిక్ కష్టాలు.. ప్రస్తుతం విజయవాడకు వెళ్లే దారిలో టోల్ ప్లాజాల వద్ద కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌- విజయవాడ 65వ జాతీయ రహదారిపై సంక్రాంతి వాహనాల రద్దీ కొనసాగుతోంది. పంతంగి, కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. రవాణా అధికారుల అంచనా ప్రకారం.. ఒక్కరోజే 5 లక్షల మంది హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు.

వాహనాల బారులు..

ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా దాదాపు 2లక్షల మంది, మరో 2లక్షల మంది తమ సొంత వాహనాలు, క్యాబ్‌ల్లో వెళ్లారు. విపరీతమైన రద్దీ నేపథ్యంలో చిల్లకల్లు, కీసర టోల్‌ప్లాజాల వద్ద భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. వరుస సెలవులు రావడంతో ఉద్యోగులు, పిల్లలు అందరూ పండుగ సంబురాలను సొంతూరులో జరుపుకోవడానికి పల్లె బాట పట్టారు.

కిక్కిరిసిపోయిన బస్టాండ్లు..

బారులు తీరిన బస్సులు, కిక్కిరిసిన ప్రయాణికులతో బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్లలో అడుగుతీసి అడుగుపెట్టలేని పరిస్థితి కనిపించింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఇక ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాల్లో పల్లెలకు పోయే ప్రయాణికులతో నగర శివార్లలోని రోడ్లన్నీ రద్దీగా మారాయి.

ప్రత్యేక బస్సులు..

ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బి, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద రోడ్డు ఇరుకుగా ఉండటంతో వాహనాలు నెమ్మదించాయి. ట్రాఫిక్ సాఫీగా సాగేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. చౌటుప్పల్, సూర్యాపేట పట్టణంలో ఎన్‌హెచ్-65పై ప్లైఓవర్లు నిర్మిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.

పెరిగిన వాహనాల రద్దీ..

గత ఏడాదితో పోల్చితే ఏపీ వైపు వెళ్లే వాహనాల సంఖ్య 30 శాతం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పండుగ సందర్భంగా సికింద్రాబాద్ పరిసరాల నుంచి చర్లపల్లి టెర్మినల్‌కు వెళ్లి వచ్చేందుకు ఆర్టీసీ 146 సీటీ బస్సులను నడుపుతోంది.

Whats_app_banner

టాపిక్

HyderabadSankrantiSankranti 2025Telangana News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024