Sprouts Paneer Tikki: సాయంత్రం సరదాగా స్నాక్స్ తినాలని ఉందా…? మొలకలు, పనీర్‌తో హెల్తీగా ఇలా టిక్కీ చేసుకోండి

Best Web Hosting Provider In India 2024

Sprouts Paneer Tikki: సాయంత్రం సరదాగా స్నాక్స్ తినాలని ఉందా…? మొలకలు, పనీర్‌తో హెల్తీగా ఇలా టిక్కీ చేసుకోండి

Ramya Sri Marka HT Telugu
Jan 14, 2025 03:30 PM IST

Sprouts Paneer Tikki: పండుగ పూట అంతా కలిసి సరదాగా ఏవైనా స్నాక్స్ చేసుకుని తినాలనుకుంటున్నారా? టేస్ట్‌తో పాటు మీరు హెల్త్‌కి కూడా ప్రియారిటీ ఇస్తారా? అయితే ఈ హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ మీ కోసమే. మొలకలు, పనీర్‌తో తయారు చేసే ఈ టిక్కీ మీ సాయంత్రానికి సరదాతో పాటు ఆరోగ్యాన్ని కూడా జోడిస్తుంది.

మొలకలు, పనీర్‌తో హెల్తీగా ఇలా టిక్కీ చేసుకోండి
మొలకలు, పనీర్‌తో హెల్తీగా ఇలా టిక్కీ చేసుకోండి

కుటుంబ సభ్యులు, స్నేహితులు అంతా ఒక చోట చేరి సరదాగా కూర్చున్నప్పుడు తినడానికి ఏదైనా వెరైటీ స్నాక్ ఉండాల్సిందే. అది రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించేది అయితే మరీ మంచిది. మీరు ఇలానే ఆలోచిస్తుంటే ఈ రెసిపీ మీ కోసమే. మొలకలు, పనీర్ రెండింటినీ కలిపి తయారు చేసే టిక్కీ అద్భుతమైన రుచి కలిగి ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ స్ప్రౌట్స్ అండ్ పనీర్ టిక్కీని తయారు చేయడం కూడా సులువే. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం రండి.

yearly horoscope entry point

స్ప్రౌట్స్ అండ్ పనీర్ టిక్కీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

మొలకలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. దీన్ని తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. అలా ఇది ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గేవారికి ఇది ఉత్తమమైన అల్పాహారమని నిపుణులు కూడా చెబుతుంటారు. ఇక పనీర్ విషయానికొస్తే చాలా మంది ఇష్టంగా తినే ఆరోగ్యకరమైన పాల పదార్థం. ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది,. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. కీళ్ల నొప్పులను నివారించడంలో పనీర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రెండింటినీ మిక్స్ చేసి టేస్టీ టిక్కీ తయారు చేసుకుని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.

స్ప్రౌట్స్ పనీర్ టిక్కీ తయారీ కావలసిన పదార్థాలు:

1 కప్పు మొలకలు

½ కప్పు తురిమిన పనీర్

5-6 పచ్చిమిర్చి

1 చిన్న అల్లం ముక్క

2 వెల్లుల్లి రెబ్బలు

1 చిన్న సైజు ఉల్లిపాయ

1/2 టీస్పూన్ పసుపు

1/2 టీస్పూన్ జీలకర్ర పొడి

1 టీస్పూన్ కారం

1/2 టీస్పూన్ చాట్ మసాలా

1/2 టీస్పూన్ గరం మసాలా

1/2 టీస్పూన్ ఉప్పు

స్ప్రౌట్స్ పనీర్ టిక్కీ తయారీ విధానం:

స్ప్రౌట్స్ పనీర్ టిక్కీ తయారు చేయడానికి రాత్రంతా నానబెట్టి ఉంచిన మొలకలను తీసుకుని దాంట్లో పచ్చిమిర్చీ, వెల్లుల్లి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, అల్లం ముక్కలు వేసి బాగా కలపాలి.

వీటన్నింటినీ ఒక కచ్చా పచ్చాగా మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో ఉప్పు, కారం, మసాలాలు వేయాలి.

తరువాత దీంట్లోనే చిన్న చిన్నగా తురిమి పెట్టుకున్న పనీర్ ముక్కలను వేసి బాగా కలపాలి.

ఇప్పుడు ఈ మిశ్రమంలో కాస్త శనగపిండి వేసుకుని కలుపుకోవాలి. (శనగపిండి తప్పనిసరి ఏం కాదు) క్రిస్పీగా ఉండటానికి కావాలనుకున్న వాళ్లు వేసుకోవచ్చు.

ఇప్పుడు దీంట్లో నుంచి కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ టిక్కీలు తయారు చేసుకోవాలి.

తరువాత ఒక పాన్ తీసుకుని వేడి చేసి, దానిపై కొద్దిగా నూనె వేయండి.

నూనె వెడెక్కిన తర్వాత టిక్కీలను వేసి అటూ ఇటూ తిప్పుతూ బంగారు రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి.

అంతే టేస్టీ అండ్ హెల్తీ మొలకల పనీర్ టిక్కీ రెడీ, దీన్ని గ్రీన్ చట్నీ లేదా టమాటొ సాస్‌తో సర్వ్ చేసుకుని తినచ్చు. టీతో పాటు నంచుకుని కూడా తినచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024