Best Web Hosting Provider In India 2024
Sankranti Special : గోదారోళ్ల ఆతిథ్యం అదుర్స్.. కొత్త అల్లుళ్లకి 470 రకాల వంటకాలతో మెగా విందు
Sankranti Special : సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేంది ఉభయ గోదావరి జిల్లాలే. అక్కడి కోడి పందేలు, ఆటలు, పాటలు, రంగు రంగుల వాతావరణం భలే అనిపిస్తోంది. అందులోనూ వారి మనసు, వారి ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా కొత్త అల్లుళ్లకు వారిచ్చే మర్యాద మరీ ప్రత్యేకం.
అల్లుళ్లను చూసుకోవడంలో గోదారోళ్ల తరువాతే మరెవ్వరైనా. అంతగా అల్లుళ్లకు ప్రాధాన్యత, గౌరవం ఇస్తారు. అందులోనూ కొత్త అల్లుళ్లంటే హడావుడి అంతా ఇంతా కాదు. అల్లుడు ఇంటికి వచ్చాడంటే, ఆతిథ్యంలో ఎక్కడా తక్కువ చేయరు. సంక్రాంతికి వచ్చిన కొత్త అల్లుళ్లకు గోదారోళ్లు ఇచ్చిన ఆతిథ్యం గుర్తిండిపోయేలా ఉంటుంది.
నందమూరి గరువులో..
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నందమూరి గరువు గ్రామాంలో.. ఆకుల శ్రీనివాస్ సోదరులు తమ ఇద్దరు కూతుళ్లు, అల్లుళ్లకు 365 రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లాల మధ్యలో ఉండే కేంద్ర పాలిత ప్రాంతం యానంలో మాజేటి సత్యభాస్కర్, వెంకటేశ్వరి దంపతుల కుమార్తె హరిణ్య, ఆమె భర్త సాకేత్‌కు 470 రకాల వంటలతో ఆతిథ్యం ఇచ్చారు. వందలాది వంటకాలతో మెగా విందును ఏర్పాటు చేసి అదరహో అనిపించారు.
వంద రకాలు..
వివిధ రకాల ఆహారం, స్వీట్స్, హాట్, ఫ్రూట్స్ ఇలా వంద రకాలు ఉన్నాయి. బిర్యానీ, పులిహార, పరమన్నం, లిమన్ రైస్, గ్రీన్ రైస్ వంటి ఆహారం పదార్థాలు పెట్టారు. అలాగే చేపలు, పీతలు, మటన్, చికెన్, రొయ్యలు వంటి నాన్ వెజ్ వెరైటీలు విందులో ఏర్పాటు చేశారు. గులాబ్ జాప్, మిఠాయి, రసగుళ్ల, లడ్డు, చలివిడి, జాంగ్రీ, కాజా, పూతరేకులు, కేకులు ఇలా అనేక రకాల స్వీట్స్, జంతికులు, చేగొడియాలు, చక్కిడాలు, కారపుబూందీ, మిక్చిర్ వంటి వివిధ రకాల హాట్ పదార్థాలు విందులో ఏర్పాటు చేశారు.
పండ్లు..
యాపిల్స్, దానిమ్మ, డ్రాగన్, బత్తాయి, ద్రాక్ష వంటి ఫ్రూట్స్ కూడా విందులో పెట్టారు. ఇలా విందు ఏర్పాటు చేయడం పట్ల అల్లుడు రవితేజ ఆనందం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్