Best Web Hosting Provider In India 2024
OTT Top Movies This Week: ఓటీటీల్లో ఈ వారం టాప్ 5 రిలీజ్‍లు.. కామెడీ నుంచి థ్రిల్లర్ల వరకు.. ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి!
OTT Top Movies This Week: ఈ వారం ఓటీటీల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ రిలీజ్‍లు ఉన్నాయి. ఓ తెలుగు చిత్రం నేరుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ మలయాళ సూపర్ హిట్ మూవీ కూడా రానుంది. ఓ ఫేమస్ సిరీస్‍కు రెండో సీజన్ అడుగుపెట్టనుంది.
సంక్రాంతి పండుగ ఉన్న ఈ జనవరి మూడో వారంలోనూ ఓటీటీల్లోకి కొత్త కంటెంట్ అడుగుపెట్టనుంది. నయా సినిమాలు, సిరీస్‍లు వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి రానున్నాయి. ఇందులో కొన్ని రిలీజ్‍లు ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి. పాపులర్ వెబ్ సిరీస్ పాతాళ్ లోక్‍కు సీక్వెల్ ఈ వారంలోనే వచ్చేస్తోంది. ఓ తెలుగు చిత్రం నేరుగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మలయాళ సినిమాలు కూడా రానున్నాయి. విజయ్ సేతుపతి చిత్రం కూడా స్ట్రీమింగ్‍కు వస్తుంది. ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఏవో ఇక్కడ చూడండి. ఈ వీకెండ్ చూసేందుకు ప్లాన్ చూసేందుకు ప్లాన్ చేసుకోండి.
మోక్ష పటం
మోక్ష పటం చిత్రం నేడు (జనవరి 14) ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేంది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రంలో తిరువీర్, పూజా కిరణ్, జెన్నిఫర్ ఇమ్మూన్యుయేల్, తరుణ్ పొనుగోటి, శాంతి రావు లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీకి రాహుల్ వనజ రాజేశ్వర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి కమ్రాన్ సంగీతం అందించారు. కామెడీ, క్రైమ్, మిస్టరీతో మోక్ష పటం మూవీ తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ఆహాలో చూసేయవచ్చు.
పాతాళ్ లోక్ 2
పాతాళ్ లోక్ 2 వెబ్ సిరీస్ ఈ వారంలోనే జనవరి 17వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. 2020లో వచ్చిన పాతాళ్ లోక్ తొలి సీజన్ చాలా పాపులర్ అయింది. భారీగా వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు సుమారు ఐదేళ్ల తర్వాత ఈ సిరీస్‍కు రెండో సీడన్ వస్తోంది. పాతాళ్ లోక్ రెండో సీజన్ జయదీప్ అహ్లావత్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍కు అవినాశ్ అరుణ్ దర్శకత్వం వహించారు. ఈ సీజన్‍లో అహ్లావత్‍తో పాటు ఇష్వాక్ సింగ్, గుల్ పనాగ్ కూడా కీలకపాత్రలు పోషించారు.
రైఫిల్ క్లబ్
రైఫిల్ క్లబ్ చిత్రం జనవరి 16వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో విజయరాఘవన్, దిలీశ్ పోతన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆషిక్ అబూ దర్శకత్వం వహించన ఈ చిత్రం డిసెంబర్ 19వ తేదీన థియేటర్లలో రిలీజై మంచి విజయం సాధించింది. రైఫిల్ క్లబ్ చిత్రాన్ని జనవరి 16 నుంచి నెట్‍ఫ్లిక్స్‌లో వీక్షించొచ్చు.
విడుదలై 2
తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన విడుదలై 2 కూడా ఈ వారంలోనే జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం. జనవరి 17వ తేదీన ఈ చిత్రం జీ5లో అడుగుపెడుతుందని తెలుస్తోంది. తెలుగు వెర్షన్ విడుదల 2 కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయంపై జీ5 నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే, జనవరి 17న రావడం పక్కా అంటూ బలమైన అంచనాలు ఉన్నాయి. విడుదలై 2 మూవీకి వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం గత నెల డిసెంబర్ 20న థియేటర్లలో రిలీజ్ కాగా మోస్తరుగా కలెక్షన్లు దక్కించుకుంది.
పని
మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పని.. జనవరి 16వ తేదీన సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన జోజూ జార్జే.. దర్శకత్వం కూడా వహించారు. పని మూవీ గతేడాది అక్టోబర్ 24వ తేదీన రిలీజై మంచి విజయం సాధించింది. ఇప్పుడు జనవరి 16న సోనీ లివ్ ఓటీటీలోకి రానుంది.
సంబంధిత కథనం