Best Web Hosting Provider In India 2024
Ramnagar Bunny OTT: మూడు నెలల తర్వాత ఓటీటీలోకి యూటిట్యూడ్ స్టార్ రొమాంటిక్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Ramnagar Bunny OTT Release Date: రామ్‍నగర్ బన్నీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. యాటిట్యూడ్ స్టార్‌గా పాపులర్ అయిన చంద్రహాస్ హీరోగా నటించిన ఈ చిత్రం మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్‍కు వస్తోంది. డేట్ ఖరారైంది.
బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ సినీ హీరోగా గతేడాది పరిచయం అయ్యారు. చంద్రహాస్ హీరోగా రామ్‍నగర్ నగర్ బన్నీ చిత్రం వచ్చింది. గతేడాది అక్టోబర్ 4వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, ఈ మూవీ రిలీజ్‍కు ముందే ప్రమోషనల్ ఈవెంట్లలో చంద్రహాస్ వ్యవహారం చూసి అతడికి యాటిట్యూడ్ స్టార్ అంటూ బిరుదు ఇచ్చేశారు నెటిజన్లు. అతడు యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా గట్టిగానే నడిచింది. దీంతో రామ్‍నగర్ బన్నీ మూవీపై కూడా బజ్ వచ్చింది. అయితే, ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు ఈ సినిమా రెడీ అయింది.
స్ట్రీమింగ్ వివరాలివే
రామ్‍నగర్ బన్నీ సినిమా జనవరి 17వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది. అంటే మరో మూడు రోజుల్లో ఈ చిత్రం ఓటీటీలో అడుగుపెట్టనుంది. స్ట్రీమింగ్ డేట్‍ను ఆహా అధికారికంగా ప్రకటించింది. యాటిట్యూడ్ స్టార్ ఎమోషనల్ రోలర్‌కోస్టర్ జనవరి 17న మొదలుకానుందంటూ ట్వీట్ చేసింది.
మూడు నెలల తర్వాత..
రామ్‍నగర్ బన్నీ సినిమా థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ మూవీ ఓటీటీ డీల్ ముందుగా జరగలేదు. ఓ ప్లాట్‍ఫామ్ కూడా హక్కులను తీసుకోలేదు. అయితే, ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఇటీవలే సొంతం చేసుకుంది. దీంతో జనవరి 17న రామ్‍నగర్ బన్నీ మూవీని స్ట్రీమింగ్‍కు తీసుకొస్తోంది ఆహా.
రామ్ నగర్ బన్నీ చిత్రంలో చంద్రహాస్ సరసన విస్మయ శ్రీ హీరోయిన్‍గా నటించారు. ఈ మూవీలో రిచా జోషి, అంబికా వాణి, మరళీధర్ గౌడ్, రితూ మంత్ర, సుజాత, మధునందన్, సమీర్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు. బన్నీ పాత్రలో చంద్రహాస్ నటన ఓకే అనిపించారు.
రామ్‍నగర్ బన్నీ సినిమాను ప్రభాకర్ నిర్మించారు. ఈ చిత్రం కోసం ప్రమోషన్లను గట్టిగానే చేశారు. ప్రెస్‍మీట్లలో, ఈవెంట్లలో సుహాస్ యూటిట్యూడ్ బాగానే చూపించారు. దీంతో నెటిజన్ల నుంచి ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. అతడి ట్రోల్స్ విపరీతంగా వచ్చేశాయి. యాటిట్యూడ్ స్టార్ అంటూ అతడికి నెటిజన్లు పేరు పెట్టేశారు. దాన్ని చంద్రహాస్ కూడా స్వీకరించారు. అందులోనూ రామ్‍నగర్ బన్నీ చిత్రంలో అతడు పాత్ర కూడా అలానే ఉంటుంది.
రామ్‍నగర్ బన్నీ చిత్రానికి అశ్విన్ హేమంత్ సంగీతం అందించారు. అష్కర్ అలీ సినిమాటోగ్రఫీ చేసిన ఈ మూవీకి మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటింగ్ చేశారు. ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా కలెక్షన్లను రాబట్టలేదు. మొత్తంగా రామ్‍నగర్ బన్నీ కమర్షియల్‍గా సక్సెస్ కాకపోయినా.. చంద్రహాస్ మాత్రం బాగా పాపులర్ అయ్యారు.
ఆహా ఓటీటీలో నేడు (జనవరి 14).. మోక్ష పటం చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ చిత్రంలో తిరువీర్ ప్రధాన పాత్ర పోషించారు.
సంబంధిత కథనం