Best Web Hosting Provider In India 2024
Chicken Omelette: కనుమ స్పెషల్ చికెన్ ఆమ్లెట్ చేశారంటే దాని రుచి మర్చిపోలేరు, బ్రేక్‌ఫాస్ట్ లో అదిరిపోతుంది
Chicken Omelette: కనుమ పండుగ రోజు ఓసారి చికెన్ ఆమ్లెట్ చేసుకొని చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది. ఈ చికెన్ ఆమ్లెట్ రెసిపీ తెలుసుకోండి.
ఆమ్లెట్ అంటే రెండు గుడ్లు కొట్టి వేసే ఒక అట్టుగానే అనుకుంటారు. నిజానికి ఆమ్లెట్ తో ఎన్నో ప్రయోగాలు చేయొచ్చు. వెజ్ ఆమ్లెట్‌లాగే చికెన్ ఆమ్లెట్ కూడా ఉంది. ఈ చికెన్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. కనుమ రోజు ఈ చికెన్ ఆమ్లెట్ తయారుచేసుకొని తినేందుకు ప్రయత్నించండి. ఇది ప్రోటీన్ నిండిన ఆహారం. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ లో తినడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
చికెన్ ఆమ్లెట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బోన్ లెస్ చికెన్ ముక్కలు – పావు కప్పు
నూనె – సరిపడినంత
కోడిగుడ్లు – రెండు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
మిరియాల పొడి – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – అర స్పూను
కారం – ఒక స్పూను
ఉల్లిపాయల తరుగు – మూడు స్పూన్లు
చికెన్ ఆమ్లెట్ రెసిపీ
1. బోన్ లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
2. ఆ గిన్నెలో అర స్పూను ఉప్పు, పావు స్పూను పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కొంచెం నూనె వేయాలి.
4. నా నూనెలో ఈ చికెన్ ముక్కలను వేసి ఉడికించుకోవాలి.
5. చికెన్ లోంచి నీరు దిగి అది మొత్తం డ్రై అయ్యేదాకా చిన్న మంట మీదే ఉంచి తర్వాత ఆఫ్ చేయాలి.
6. ఇప్పుడు చికెన్ బాగా ఉడికిపోయినట్టు ఈ చికెన్ ముక్కలను చల్లార్చి సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.
7. ఉల్లిపాయలను ఎలా తరుగుతామో అలా చికెన్ ముక్కలను కూడా తరిగి ఒక గిన్నెలో వేయాలి.
8. ఇప్పుడు అదే గిన్నెలో రెండు కోడిగుడ్లను కొట్టి వేయాలి.
9. అలాగే కొంచెం కారం, మిరియాల పొడి అర స్పూన్, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
10. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగును కూడా వేసి బాగా కలపాలి.
11. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఒక స్పూను నూనె వేయాలి.
12. దానిపై ఈ చికెన్ కోడిగుడ్ల మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి.
13. పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి. రెండు వైపులా దీన్ని కాల్చి తీసి పక్కన పెట్టుకోవాలి.
14. అంతే టేస్టీ చికెన్ ఆమ్లెట్ తినడానికి సిద్ధమైపోయింది. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు చేసి చూడండి.
వారానికి ఒక్కసారైనా ఈ పద్ధతిలో చికెన్ ఆమ్లెట్ చేసి చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది. పైగా ఇది ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఆ రోజంతా మీకు శక్తి అందుతూనే ఉంటుంది. రెండు కోడిగుడ్లు, కొంత చికెన్ బ్రేక్ ఫాస్ట్ లో తినడం వల్ల మీకు ఆకలి కూడా త్వరగా వేయదు. దీన్ని మీరు స్పైసీగా కూడా చేసుకోవచ్చు. ఒక్కసారి చేసుకున్నారంటే దీని రుచి మరచిపోలేరు.