Best Web Hosting Provider In India 2024
Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యుషన్‌లో ఒకచోట 808 ఇరుక్కుని ఉంది, దాన్ని 10 సెకన్లలో కనిపెట్టి చెప్పండి
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లులో అంటే మీకు ఇష్టమా? మరొక ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ తో మీ ముందుకు వచ్చాము. దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించండి.
ఆప్టికల్ ఇల్యుషన్లు కళ్ళను, మెదడును కలిసి ఒకేసారి పరీక్షిస్తాయి. మీరు కూడా మీ మెదడు, కళ్లను పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఇక్కడ మేము ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. ఇది ఒక సరదా పజిల్ మాత్రమే కాదు, మీ మెదడు కంటి ఆరోగ్యాన్ని తేల్చే పజిల్ కూడా. మీ దృష్టిని, మీ మానసిక పదునూ అంచనా వేయడానికి ఆప్టికల్ ఇల్యూషన్లు అనేవి శక్తివంతమైన సాధనాల్లా పని చేస్తాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల్లో ఇచ్చే చిన్న తేడానే కనిపెట్టి చెబితే మీ మెదడు ఎలా పనిచేస్తుందో అంచనా వేయొచ్చు. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా చెప్పేస్తారు. కేవలం కొన్ని సెకన్లలో చెబితేనే మీ మెదడు, కళ్ళు కలిసి ఆరోగ్యంగా పనిచేస్తున్నట్టు లెక్.క ఈ ఆప్టికల్ ఇల్యూషన్ సమస్య ఏమిటో చూద్దాం.
ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్ లో SOS అనే మూడు అక్షరాలు ఉన్నాయి. ప్రతి చోట ఈ అక్షరాలే నిండి ఉన్నాయి. కానీ ఒకచోట మాత్రం 808 అనే అంకె దాగి ఉంది. అది ఎక్కడ ఉందో మీరు కనిపెట్టి చెప్పడమే మీకు మేము ఇస్తున్న సవాల్. 10 నిమిషాల సమయం ఇస్తే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. కేవలం 10 సెకన్లలోనే దాన్ని మీరు కనిపెట్టాలి. SOS గుంపులో దాగి ఉన్నా 808ని గుర్తిస్తే మీ చూపు, మెదడు రెండు చురుగ్గా పనిచేస్తున్నాయనే ఒప్పుకోవాలి. కేవలం 10 సెకన్లలోనే ఆ అంకె ఎక్కడుందో వెతికి చెప్పండి.
ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు
ఇప్పటికే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ జవాబుని కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఇక జవాబు విషయానికి వస్తే 808 అనే అంకె మీ ఎడమ వైపు నుంచి మూడో నిలువ వరుసలో ఉంది. అదే జవాబు మీరు 10 సెకన్లలోనే దీన్ని కనిపెట్టి ఉంటే మీరు అద్భుతమైన మానసిక పదును, దృష్టి కలవారని అర్థం చేసుకోవచ్చు.
ఆప్టికల్ ఇల్యూషన్లను అప్పుడప్పుడు చేధించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మెదడుకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగినట్టు అనిపిస్తుంది. మీ మనసుకు విరామంగా కూడా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ సమస్యను పరిష్కరించారో మీ మానసిక స్థితి ఉప్పొంగినట్టు అవుతుంది. అది ఆనంద హార్మోన్లను విడుదల అయ్యేలా చేస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లను చేధిస్తుందో ఉండండి. మైండ్ ఫుల్ నెస్ ప్రాక్టీస్ చేస్తే ఎంత ఫలితాలు దక్కుతాయో ఆప్టికల్ ఇల్యూషన్లను సాధనం చేయడం ద్వారా కూడా అంతే ఫలితాలు దక్కుతాయి. మీ సంపూర్ణ మానసిక స్పష్టతకు ఇలాంటి పజిల్స్ ఎంతో మేలు చేస్తాయి. మీలోని ఆందోళన భావాలను తగ్గిస్తాయి. ఇది మెదడుకు శరీరానికి కూడా వ్యాయామం చేయడంతో సమానం. ఇది ఒక మానసిక వ్యాయామంగా భావించండి. ఇలాంటి పజిల్స్ ను అప్పుడప్పుడు సాధించడం వల్ల మీ శరీరంలోని నాడీ కణాలలో మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. అభిజ్ఞా క్షీణత తగ్గుతుంది.