Best Web Hosting Provider In India 2024
Sankranthiki Vasthunam: వెంకీ మామ టెర్రిఫిక్.. అసలైన పండగ సినిమా ఇది: సంక్రాంతికి వస్తున్నాం మూవీపై మహేష్ బాబు రివ్యూ
Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం మూవీపై సూపర్ స్టార్ మహేష్ బాబు రివ్యూ ఇచ్చాడు. వెంకీ మామ టెర్రిఫిక్ అంటూ అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సంక్రాంతి సందర్భంగా మంగళవారం (జనవరి 14) ఈ మూవీ రిలీజైన విషయం తెలిసిందే.
Sankranthiki Vasthunam: విక్టరీ వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీకి అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఓ ట్వీట్ లో మూవీ రివ్యూ ఇచ్చాడు. అసలుసిసలు పండగ సినిమా ఇదే అంటూ అతడు బుధవారం (జనవరి 15) ట్వీట్ చేశాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీ.. సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.
వెంకీ మామ టెర్రిఫిక్: మహేష్ బాబు
ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. చివరిగా మంగళవారం (జనవరి 14) పండగ రోజే నవ్వించడానికి వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా కూడా ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా ఈ సినిమా బాగా నచ్చినట్లుంది. తాజాగా ఓ ట్వీట్ ద్వారా రెండు ముక్కల్లో మూవీ రివ్యూ ఇచ్చాడు.
“సంక్రాంతికి వస్తున్నాం మూవీని చూసి బాగా ఎంజాయ్ చేశాను. అసలుసిసలు పండగ మూవీ. వెంకీ మామ సర్ టెర్రిఫిక్. వరుస బ్లాక్బస్టర్లు ఇస్తున్న మా డైరెక్టర్ అనిల్ రావిపూడిని చూసి గర్వంగా, సంతోషంగా ఉంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి వాళ్ల పాత్రల్లో బాగా నటించారు.
బుల్లి రాజు పిల్లాడు అదరగొట్టేశాడు. మొత్తం టీమ్ కు శుభాకాంక్షలు” అని మహేష్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. గతంలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సరిలేరు నీకెవ్వరు మూవీలో మహేష్ నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ కూడా మంచి హిట్ అయింది. ఇప్పుడు వెంకటేశ్ తో కలిసి ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాడు.
సంక్రాంతికి వస్తున్నాం ఎలా ఉందంటే?
సంక్రాంతికి వస్తున్నాం మూవీ మంగళవారం (జనవరి 14) సంక్రాంతి పండగ రోజే రిలీజైంది. వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించారు. దిల్ రాజు నిర్మించగా.. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశాడు. అతని గత సినిమాల్లాగే లాజిక్ లేకుండా మ్యాజిక్ మాత్రమే చూస్తే మంచి నవ్వులతో థియేటర్ నుంచి బయటకు వస్తారు. వెంకటేశ్, అనిల్ రావిపూడి కలిస్తే కామెడీ ఏ రేంజ్లో ఉంటుందో ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3 సినిమాల్లో ప్రూవ్ అయ్యింది. ఈ సారి కేవలం కామెడీకే పరిమితం కాకుండా క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడిస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం కథను రాసుకున్నాడు.
గత సినిమాల్లో మాదిరిగా సెఫరేట్ ట్రాక్‌లతో ఫన్ను పండించడం కాకుండా సిట్యూవేషనల్ కామెడీతో ఆడియెన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేశాడు అనిల్‌రావిపూడి. సింపుల్‌గా చెప్పాలంటే ఓ కిడ్నాప్ మిషన్‌ను ఛేదించేందుకు భార్య, ప్రేయసితో కలిసి వెళ్లిన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కథ ఇది. ఈ పాయింట్ నుంచి ఎన్ని విధాలుగా ఫన్ రాబట్టవచ్చో అన్ని వాడేశారు డైరెక్టర్. మూవీకి సాంగ్స్ పెద్ద అసెట్ గా నిలిచాయి. గోదారి గట్టు మీద సాంగ్ అయితే ఓ ఊపు ఊపేస్తోంది. మొత్తానికి సంక్రాంతి సందడిని ఈ మూవీ తీసుకొచ్చింది.