Best Web Hosting Provider In India 2024
AP Nominated Posts : ఈ నెలాఖరుకు నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ..! తెలుగు తమ్ముళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన నారా లోకేశ్
ఈ నెలాఖరుకు నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటన చేశారు. త్వరలోనే బూత్ స్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణం చేస్తామని చెప్పారు. చంద్రగిరి ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఫీడ్ బ్యాక్ తీసుకొని కష్టపడిన వారికి గుర్తింపునిస్తామని స్పష్టం చేశారు.
త్వరలో బూత్ స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మాణం చేస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఫిబ్రవరి నుంచి పార్టీని బలోపేతం చేసే పని ప్రారంభిస్తామని… పార్టీకోసం అధిక సమయం కేటాయిస్తానని చెప్పారు.
చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెలో ముఖ్యనాయకులు, కార్యకర్తలతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…. పార్టీ కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటాం అని అన్నారు. క్లస్టర్, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో అందరిలో మూమెంట్ రావాలని అభిప్రాయపడ్డారు.
“నా చుట్టూ తిరగడం వల్ల పదవులు రావు. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పదవులు వస్తాయి. నాయకుల పనితీరుపై వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం. నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో బాధ్యతగా వ్యవహరించాలి. పార్టీలో సంస్కరణలు తేవాల్సి ఉంది. టర్మ్ లిమిట్స్ ఉండాలి, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను 3వసారి కొనసాగుతున్నాను. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీలో వ్యవస్థాగతంగా మార్పులు రావాలి. పాలిట్ బ్యూరోలో ప్రతి రెండేళ్లకు ఒకసారి 30శాతం కొత్తవారు రావాలి. అప్పుడే పార్టీలో మూమెంట్ వస్తుంది. అహర్నిశలు పాటుపడ్డవారికే గత ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చాం. ఫీల్డ్ లో ఏం జరుగుతుందో ఎప్పటిప్పుడు తెలుసుకుంటాం” అని లోకేశ్ స్పష్టం చేశారు.
“1994 తర్వాత టిడిపి గెలవని నియోజకవర్గం చంద్రగిరి. ఈసారి భారీ మెజారిటీతో గెలిచాం. గత ప్రభుత్వంలో ప్రజలు, కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. యువగళం, నిజం గెలవాలి కార్యక్రమాలను విజయవంతం చేశారు. ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమికి ఎన్నడూ లేనివిధంగా 164 సీట్లు ఇచ్చారు, మనం ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేయాలి.రెడ్ బుక్ ను నేను మర్చిపోలేదు. తనపని తాను చేసుకుపోతుంది. యువగళంలో పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టారో నాకు తెలుసు. తప్పుచేసిన ఎవరినీ వదలే ప్రసక్తిలేదు” అని లోకేశ్ తెలిపారు.
నెలాఖరుకు నామినేటెడ్ పోస్టులు
ఈ నెలాఖరుకు నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని మంత్రి లోకేశ్ క్లారిటీ ఇచ్చారు. ఎఎంసిలను కూడా త్వరలో నియమిస్తామని… సీనియర్లు, జూనియర్లను సమానంగా ప్రోత్సహిస్తామన్నారు. “పనిచేసేవాళ్లను గౌరవిస్తాం. గతంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ, సభత్వనమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న కేడర్ కు గుర్తింపునిస్తాం. పనితీరు ఆధారంగా పదవులు ఇస్తాం. అనేక మోడళ్లు తీసుకుని కార్యకర్తల బలోపేతానికి కృషిచేస్తాం” అని చెప్పారు.
“పంచాయితీ ఎన్నికలు రాబోతున్నాయి, అప్రమత్తంగా పనిచేయండి.పెన్షన్, గ్యాస్ వంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు తీసుకెళ్లండి. అభివృద్ధి నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. కార్పొరేషన్ లో విలీనం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని కొందరు చెబుతున్నారు, పాత పంచాయితీలను కొనసాగించేలా చర్యలు తీసుకుంటాం. రాజకీయాల్లో అతిగా మాట్లాడిన వారిని ప్రజలు క్షమించరు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. సమస్య తలెత్తినపుడు అలిగి ఇంట్లో కూర్చుంటే పార్టీకి ద్రోహం చేసిన వారవుతారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకొని ముందుకు సాగాలి” అని లోకేశ్ పేర్కొన్నారు.
సంబంధిత కథనం
టాపిక్