NNS 16th January Episode: నాన్నా అని పిలిచిన ఆరు.. రామ్మూర్తి షాక్​.. అమర్​లో అనుమానం.. చీర కొనేందుకు అంజు షాపింగ్​​!

Best Web Hosting Provider In India 2024

NNS 16th January Episode: నాన్నా అని పిలిచిన ఆరు.. రామ్మూర్తి షాక్​.. అమర్​లో అనుమానం.. చీర కొనేందుకు అంజు షాపింగ్​​!

Hari Prasad S HT Telugu
Jan 15, 2025 08:10 PM IST

NNS 16th January Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ గురువారం (జనవరి 16) ఎపిసోడ్లో రామ్మూర్తిని నాన్నా అని పిలుస్తుంది అంజులోని ఆరు. అతడు షాక్ తింటాడు. మరోవైపు తన తల్లికి చీర కోసం షాపింగ్ కు వెళ్లిన అంజుని కిడ్నాప్ చేయడానికి ఘోర సిద్ధంగా ఉంటాడు.

నాన్నా అని పిలిచిన ఆరు.. రామ్మూర్తి షాక్​.. అమర్​లో అనుమానం.. చీర కొనేందుకు అంజు షాపింగ్​​!
నాన్నా అని పిలిచిన ఆరు.. రామ్మూర్తి షాక్​.. అమర్​లో అనుమానం.. చీర కొనేందుకు అంజు షాపింగ్​​!

NNS 16th January Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (జనవరి 16) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. రామ్మూర్తి, ఆరు ఫోటో చూస్తూ బాధపడుతుంటాడు. ఎందుకమ్మా ఆ భగవంతుడు నాకు ఇంత పెద్ద శిక్ష వేశాడు అయినా తప్పంతా నాదేనమ్మా.. ఆరోజు నేను మీ నాన్నమ్మ మాట వినకుంటే ఇప్పుడు ఈ బాధ ఉండేది కాదు అంటూ ఏడుస్తుంటాడు. భగవంతుడా ఎందుకయ్యా నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు.. బతికి ఉండగానే చంపేశావు కదయ్యా అంటూ నిట్టూరుస్తాడు.

yearly horoscope entry point

రామ్మూర్తి నాన్నా అని పిలిచిన అంజు

ఇంతలో అంజులో ఉన్న ఆరు అక్కడకు వచ్చి.. తాతయ్యా అని పిలుస్తుంది. అంజును చూసి రామ్మూర్తి షాక్‌ అవుతాడు. వెంటనే ఫోటో దాచేస్తాడు. అంజు పాప నువ్వు ఎప్పుడు వచ్చావమ్మా అని అడుగుతాడు. ఇందాక డాడీతో వచ్చాను అని చెప్తుంది అంజు. మరి నువ్వు డాడీతో వెళ్లలేదా అంటాడు రామ్మూర్తి. లేదు నీతో ఉండాలని వెళ్లలేదు.. అంటూ రామ్మూర్తిని హగ్‌ చేసుకుంటుంది అంజు. రామ్మూర్తి షాక్ అవుతాడు. ఆరునే హగ్‌ చేసుకున్నట్టు ఫీల్‌ అవుతాడు.

ఇప్పటికే చాలా ఏడ్చారు.. ఇంక ఏడ్వకండి.. నేను ఎక్కడికి వెళ్తాను.. మీ పక్కనే ఉన్నాను నాన్నా అంటుంది అంజు. ఆ మాటకు రామ్మూర్తి షాక్‌ అవుతాడు. ఇంతలో అంజు ఏమైంది తాతయ్యా ఏంటలా చూస్తున్నారు అని అడుగుతుంది. మీ అమ్మలా అనిపిస్తే చూస్తున్నాను అంటాడు. ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే.. చెప్పాలని ఉంది తాతయ్య అనగానే ఇదే మాట నా పెద్దకూతురు నోట వినాలని ఉంది అమ్మా కానీ ఎలా అని మనసులో అనుకుంటాడు రామ్మూర్తి.

చీర షాపింగ్‌కు అంజు

ఇంతలో అంజు మీరు మైండ్‌ లో ఉన్నదంతా పక్కన పెట్టి ఇవాళంతా నేను చెప్పేది వినాలి అంటుంది అంజు. దీంతో సరేలే అమ్మా ముందు ఇంటికి వెళ్దాం పద అని రామ్మూర్తి అనగానే నేను చెప్పినట్టు వినాలని చెబుతూ.. రేపు కాశీకి వెళ్తున్నాం కాబట్టి మీరు కూడా ఫాదర్‌ లాంటి వాళ్లు కాబట్టి మా అమ్మకు ఒక చీర కొని ఫోటో దగ్గర పెడతారా..?

ఏంటి తాతయ్యా మా అమ్మకు చీర కొనరా..? అని అడుగుతుంది. ఎందుకు కొననమ్మా కొంటాను.. మంచి చీర కొంటాను.. నా కష్టార్జితంతో కొంటాను అని రామ్మూర్తి చెప్పగానే.. సరే వెళ్దాం పదండి అని రామ్మూర్తిని తీసుకుని షాపింగ్​కి వెళ్తుంది.

ఘోరకు మనోహరి ఫోన్

రోడ్డు మీద ముసుగు వేసుకుని అంజులో ఉన్న ఆరు ఆత్మకోసం ఎదురు చూస్తుంటాడు ఘోర. ఆత్మను ఎలాగైనా పట్టుకోవాలని వెనకాల ఫాలో అవుతుంటాడు. మరోవైపు గుప్త భయంగా ఆరు గురించి ఆలోచిస్తుంటాడు. అటు మనోహరి.. ఘోరకు ఫోన్‌ చేసి అంజును నువ్వు కిడ్నాప్‌ చేశావా..? అని అడుగుతుంది. ఎందుకు అడుగుతున్నావు మనోహరి అంటాడు ఘోర. ఎందుకంటే అంజు ఇంట్లో లేదు.. కనిపించడం లేదు అని మనోహరి చెప్తుంది. అంతమంది ఉన్న ఇంట్లోకి అందరి కళ్లు కప్పి వచ్చి నేను తీసుకెళ్లగలను అనుకుంటావా..? అంటాడు ఘోర.

కరెక్టే అమర్‌ కూడా పొద్దుటి నుంచి ఇంట్లోనే ఉన్నాడు.. మరి అంజలి ఎక్కడుంది అంటుంది మను. ఎక్కడైనా ఉండొచ్చు.. ఇంట్లో ఉండొచ్చు.. బయట ఉండొచ్చు.. నా కళ్ల ముందు కూడా ఉండొచ్చు అంటాడు ఘోర.. దీంతో ఏం మాట్లాడుతున్నావు ఘోర నువ్వు అంజలిని కిడ్నాప్‌ చేశావు కదూ.. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుసా..? నువ్వు తన పిల్లలను ముట్టుకున్న ప్రతిసారి అమర్‌ నిన్ను ఎలా వెంటాడాడో మర్చిపోయావా.. అంటూ హెచ్చరిస్తుంది.

అంజు కోసం కాచుకొని కూర్చున్న ఘోర

నువ్వేం కంగారు పడిపోకు మనోహరి .. నేను ఇంకా అంజలిని కిడ్నాప్‌ చేయలేదు.. అలా అని సంబరపడిపోకు ఇంకాసేపట్లో అంజలిని కిడ్నాప్‌ చేయబోతున్నాను.. మూడడుగుల దూరంలో ముచ్చటగా ఉంది నా ఆత్మ టైం వేస్ట్‌ చేసేంత టైం లేదు మనోహరి అంటూ ఫోన్‌ కట్‌ చేస్తాడు. మనోహరి ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది. రామ్మూర్తి, అంజును తీసుకుని బేకరికీ వెళ్లి స్వీట్లు కొనిస్తాడు. తర్వాత బట్టల షాపుకు తీసుకెళ్లి చీర కొంటుంటాడు.

మరోవైపు ఇంట్లో అంతా వెతికి ఎక్కడా లేదని అందరూ టెన్షన్‌ పడుతుంటారు. అంజలి ఎక్కడికి వెళ్లలేదు. నేను అంజలిని జాగ్రత్తగా తీసుకుని వస్తాను అంటూ అమర్‌, రాథోడ్ బయటకు వెళ్తారు. మరోవైపు బట్టల షాపు బయట ఘోర కాచుకుని ఉంటాడు. గుప్త టెన్షన్‌ పడుతుంటాడు. మిస్సమ్మ.. రామ్మూర్తికి ఫోన్‌ చేసి అంజు కనిపించడం లేదని చెప్తుంది. నా దగ్గరే ఉందని రామ్మూర్తి చెప్తాడు. మేము ఇంటి దగ్గర లేమని బట్టల షాపులో ఉన్నామని చెప్తాడు.

అటు పొద్దునే నేను తిట్టాను అది మనసులో పెట్టుకుని అంటూ అమర్‌ డౌట్‌ పడుతుంటే.. మిస్సమ్మ ఫోన్‌ చేసి అంజు గురించి చెప్తుంది. అమర్‌ నేను షాపు దగ్గరకు వెళ్లి తీసుకొస్తాను అంటాడు. అంజులో ఉన్నది ఆరు ఆత్మ అని అందరికీ తెలిసిపోతుందా? ఘోరా ఆరు ఆత్మని బంధిస్తాడా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు జనవరి​ 16న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

 

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024