Paatal Lok 2 Review: పాతాళ్ లోక్ 2 రివ్యూ.. ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Best Web Hosting Provider In India 2024

Paatal Lok 2 Review: పాతాళ్ లోక్ 2 రివ్యూ.. ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Jan 17, 2025 03:01 PM IST

Paatal Lok Season 2 Review In Telugu: ఓటీటీలోకి ఇవాళ స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పాతాళ్ లోక్ సీజన్ 2. భారీ అంచనాలతో అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన ఈ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందో నేటి పాతాళ్ లోక్ 2 రివ్యూలో చూద్దాం.

పాతాళ్ లోక్ 2 రివ్యూ.. ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
పాతాళ్ లోక్ 2 రివ్యూ.. ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Paatal Lok 2 Review In Telugu: ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్స్‌కు ఉండే క్రేజే వేరు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చే ఏ జోనర్ సినిమాలు, వెబ్ సిరీసులు అయిన ఓటీటీ ఆడియెన్స్ ఇష్టపడుతుంటారు. అలా 2020లో అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పాతాళ్ లోక్.

yearly horoscope entry point

జైదీప్ అహ్లావత్, అనిందిత బోస్, నిహారిక దత్, స్వస్తిక ముఖర్జీ, ఈశ్వక్ సింగ్, అభిషేక్ బెనర్జీ, అక్షయ్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించిన పాతాళ్ లోక్‌ సూపర్ హిట్ కావడంతో రావడంతో రెండో సీజన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో పాతాళ్ లోక్ సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్‌లో ఇవాళ (జనవరి 17) ఓటీటీ రిలీజ్ అయిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందో పాతాళ్ లోక్ 2 రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ఢిల్లీకి చెందిన ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ లీడర్ నాగాలాండ్ బిజినెస్ సమ్మిట్ మధ్యలో దారుణంగా హత్యకు గురి అవుతాడు. ఈ మర్డర్ కేస్ ఇన్వేస్టిగేషన్‌ను ఐపీఎస్ ఆఫీసర్ ఇమ్రాన్ అన్సారీ (ఈశ్వక్ సింగ్)కి అప్పగిస్తారు. మరోవైపు జమునా పార్ పోలీస్ స్టేషన్‌లో హథీరామ్ చౌదరి (జైదీప్ అహ్లావత్)కి ఓ మహిళ తన భర్త మిస్సింగ్ అంటూ వస్తుంది. దానిపై దర్యాప్తు చేస్తుంటాడు హథీరామ్ చౌదరి.

ఈ నేపథ్యంలోనే రాజకీయ నాయకుడి మర్డర్ కేసుకు, మహిళ భర్త మిస్సింగ్‌కు లింక్ ఉందని ఇమ్రాన్, హథీరామ్ తెలుసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ రెండు కేసులను ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు? అసలు హథీరామ్ చౌదరి దగ్గరికి వచ్చిన మహిళ ఎవరు? ఆమె భర్త ఏం చేస్తాడు? అతనికి పొలిటికల్ లీడర్‌కు ఉన్న సంబంధం ఏంటీ? అతన్ని ఎవరు చంపారు? అనేదే పాతాళ్ లోక్ సీజన్ 2 స్టోరీ.

విశ్లేషణ:

క్రైమ్ థ్రిల్లర్ జోనర్ సినిమాలు లేదా వెబ్ సిరీసుల్లో కథ చాలా వరకు కొత్తగా ఉండదు. కానీ, టేకింగ్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అందుకే పాతాళ్ లోక్ సీజన్ 1 అంతా బాగా హిట్ అయింది. మొదటి సీజన్‌లో హత్యకు గురి కాబోయే జర్నలిస్ట్‌పై చేసే దర్యాప్తుతో సాగితే.. రెండో సీజన్ పొలిటికల్ లీడర్ మర్డర్ తర్వాత ఇన్వెస్టిగేషన్‌తో ఉంటుంది.

మొదటి సీజన్ ఢిల్లీ ఉంటే.. రెండో సీజన్ నాగాలాండ్‌ నేపథ్యంలో సాగుతుంది. ఒక రాజకీయ వేత్త హత్య దానిచుట్టూ వచ్చే వివిధ క్రైమ్స్ యాడ్ చేసి తెరకెక్కించారు పాతాళ్ లోక్ సీజన్ 2ని. అయితే, మొదటి సీజన్ హిట్ అవడానికి ప్రధాన కారణాల్లో హథీరామ్ చౌదరి పాత్ర. అందుకే ఈ సీజన్‌లో ఈ క్యారెక్టర్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు అనిపిస్తుంది.

ఆకట్టుకునే డైలాగ్స్

స్టోరీ రొటీన్‌గా ఉన్నా కొన్ని చోట్ల ఇన్వెస్టిగేషన్ ఆకట్టుకుంటుంది. కొన్ని ట్విస్టులు బాగుంటాయి. అలాగే, జాబ్ కాపాడుకోవడమా, డ్యూటీ చేయడమా, ఇది పాతాళ లోకం అయితే ఇందులో నేను బతకడానికే వచ్చాను అని హథీరామ్ పాత్ర చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ పర్వాలేదు. ఇక బీజీఎమ్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. సన్నివేశాలకు తగిన మూడ్ సెట్ చేసేలా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ బాగున్నాయి.

అలాగే, కొన్ని ఎపిసోడ్స్ సాగదీతలా అనిపిస్తాయి. మరి 40 నుంచి 45 నిమిషాల రన్‌టైమ్‌తో ఎపిసోడ్స్ కాకుండా కాస్తా ట్రిమ్ చేస్తే బాగుండేదని అనిపించింది. జైదీప్ అహ్లావత్ మరోసారి తన పర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. ఆయనతోపాటు మిగతా నటీనటులు కూడా పాత్రలకు తగినవిధంగా అలరించారు.

ఫైనల్‌గా చెప్పాలంటే..!

ఫైనల్‌గా చెప్పాలంటే.. అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో హిందీతోపాటు తెలుగు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోన్న పాతాళ్ లోక్ సీజన్ 2ను ఫ్యామిలీతో కాకుండా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు చూసి ఎంజాయ్ చేయొచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024