Best Web Hosting Provider In India 2024
Saif Ali Khan attacked: ‘సైఫ్ అలీఖాన్ కేసులో ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు’: ముంబై పోలీస్
Saif Ali Khan attacked: బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ముంబై పోలీసులు స్పష్టం చేశారు. విచారణ కోసం బాంద్రా పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన వ్యక్తికి సైఫ్ అలీఖాన్ దాడి కేసుతో సంబంధం లేదని వివరించారు.
Saif Ali Khan attacked: విచారణ కోసం బాంద్రా పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన వ్యక్తికి సైఫ్ అలీఖాన్ దాడి కేసుతో సంబంధం లేదని ముంబై పోలీసులు ధృవీకరించారు. “సైఫ్ అలీ ఖాన్ ఎటాక్ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు” అని ముంబై పోలీసులు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ దాడి కేసుకు సంబంధించి ముంబై పోలీసులు శుక్రవారం ఒకరిని విచారణ కోసం బాంద్రా పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు.
పోలికలు ఉండడంతో..
సైఫ్ పై దాడి చేసిన వ్యక్తితో పోలికలు ఉండడంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ తరువాత వారికి ఈ దాడితో సంబంధం లేదని నిర్ధారించుకుని వదిలేశారు. ఒకరిని మాత్రం అదుపులోనే ఉంచుకున్నట్లు సమాచారం. గురువారం తెల్లవారుజామున బాంద్రాలోని తన హైరైజ్ అపార్ట్మెంట్లో సైఫ్ అలీఖాన్ పై ఒక చొరబాటుదారుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. వెన్నెముకలో కత్తితోనే సైఫ్ ఆసుపత్రికి వెళ్లారు.
పని పనిషితో ఘర్షణ
సైఫ్ ఇంట్లోకి జొరబడిన ఆ దుండగుడిని మొదట ఒక పని మనిషి చూశాడని, అతడితో ఘర్షణ సమయంలో సైఫ్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయగా, అది హింసాత్మకంగా మారిందని, దాంతో ఆ దుండగుడు కత్తితో సైఫ్ పై దాడి చేశాడని కథనాలు వస్తున్నాయి. అత్యవసర శస్త్రచికిత్స తర్వాత సైఫ్ అలీఖాన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని లీలావతి ఆసుపత్రి వైద్యులు గురువారం తెలిపారు.
కుమారుడితో ఆసుపత్రికి..
తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో చిన్న కుమారుడు జెహ్ గది బయట దాడి జరిగిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ (saif ali khan) ను అతని కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఖాన్ నివసిస్తున్న సద్గురు శరణ్ భవనంలోని ఆరో అంతస్తు నుంచి ఎర్ర కండువా ధరించి, బ్యాక్ ప్యాక్ తో దుండగుడు మెట్లు దిగుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.
Best Web Hosting Provider In India 2024
Source link