Kidney Problems: నీళ్లు తాగిన వెంటనే ఈ 5 సంకేతాలు కనిపిస్తే మీ కిడ్నీ దెబ్బతింటోందని అర్థం

Best Web Hosting Provider In India 2024

Kidney Problems: నీళ్లు తాగిన వెంటనే ఈ 5 సంకేతాలు కనిపిస్తే మీ కిడ్నీ దెబ్బతింటోందని అర్థం

Haritha Chappa HT Telugu
Jan 17, 2025 04:30 PM IST

Kidney Problems: కిడ్నీల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మూత్రపిండాల్లో ఏదైనా సమస్య వస్తే కొన్ని ప్రాథమిక లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించి తగిన సమయంలో చికిత్స తీసుకోవాలి. నీళ్లు తాగిన వెంటనే కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.

కిడ్నీ ఆరోగ్యం
కిడ్నీ ఆరోగ్యం (Shutterstock)

మూత్రపిండాలు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. వీటి ప్రధానమైన పని రక్తాన్ని ఫిల్టర్ చేయడం, శరీరం నుండి వ్యర్థాలను విషాలను తొలగించడం. ఈ పని చేయకపోతే మొత్తం శరీరం అనారోగ్యం పాలవుతుంది. అంటుకే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఆధునిక కాలంలో కిడ్నీ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చెడు ఆహారం, చెడు జీవనశైలి కారణంగా మూత్రపిండాలు పాడవుతాయి.

yearly horoscope entry point

మూత్రపిండాలు పాడవుతున్న క్రమంలో ప్రాథమిక దశలోనే లక్షణాలను గుర్తిస్తే వాటిని కాపాడుకోవచ్చు. ప్రాణాంతక సమస్యలను అడ్డుకోవచ్చు. కొన్ని లక్షణాలను ప్రజలు సాధారణమైనవిగా భావించి విస్మరిస్తారు. ముఖ్యంగా మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు… నీరు తాగిన తర్వాత శరీరంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటిని విస్మరించకూడదు.

నీరు లేదా మరేదైనా ద్రవం తాగినప్పుడు, అది నేరుగా మీ మూత్రపిండాలను ప్రభావితం చేస్తుంది. అలాంటప్పుడు కిడ్నీలో ఏదైనా సమస్య వస్తే దాని ప్రభావం కూడా వెంటనే కనిపిస్తుంది. కొంతమందికి నీరు తాగిన కిడ్నీల్లో నొప్పి అనిపించినా, సూదితో గుచ్చినట్టు అనిపించినా తేలికగా తీసుకోకూడదు. నిజానికి మూత్రపిండాలు దెబ్బతినడం వల్ల అవి నీటిని సరిగా ప్రాసెస్ చేయలేక పోవడం వల్ల కిడ్నీలు నొప్పులు మొదలవుతాయి.

విపరీతమైన అలసట

రోజంతా అలసట లేదా బలహీనంగా అనిపించడం కూడా శరీరంలోని అనేక వ్యాధులకు సంకేతం కావచ్చు. కానీ సాధారణంగా ప్రజలు వాటిని విస్మరిస్తారు. ముఖ్యంగా నీరు తాగిన తర్వాత అకస్మాత్తుగా అలసట, నీరసంగా అనిపిస్తే అది మూత్రపిండాలు దెబ్బతినడానికి సంకేతం కావచ్చు. ఎందుకంటే దెబ్బతిన్న తర్వాత కిడ్నీ తన పనిని సక్రమంగా చేయలేక ఒత్తిడికి గురై ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో, నీరు తాగిన వెంటనే శరీరంలో అలసట కనిపిస్తుంది.

మూత్రపిండాల్లో ఏ సమస్య ఉన్నా… మూత్రాన్ని చూసి లోపాన్ని అంచనా వేయవచ్చు. రోజూ తగినంత నీరు తాగిన తర్వాత కూడా చాలా తక్కువ మూత్రం వస్తే తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించాలి. వాస్తవానికి, ఇది మూత్రపిండాలు సమస్యల బారిన పడినట్టు సూచిస్తాయి. మూత్రపిండాల సమస్య ఉన్నప్పుడు, మీరు తాగే నీటిని అది సరిగా ఫిల్టర్ చేయలేదు. ఈ పరిస్థితిలో, పాదాలపై వాపు కూడా కనిపిస్తుంది.

మీకు వికారం అనిపిస్తే లేదా నీరు తాగిన వెంటనే అసౌకర్యంగా అనిపిస్తే, మూత్రపిండాలు దెబ్బతిన్నాయని చెప్పే సంకేతాలు కావచ్చు. వాస్తవానికి, మూత్రపిండాలు సరిగ్గా పనిచేయలేనప్పుడు, అది శరీరంలోని ఎలక్ట్రోలైట్ స్థాయిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా నీరు తాగిన వెంటనే ఎలక్ట్రోలైట్ స్థాయి హెచ్చుతగ్గులకు లోనవుతుంది, ఇది వికారం వంటి సమస్యలను కలిగిస్తుంది.

నీరు తాగిన వెంటనే మూత్రవిసర్జన చేయాల్సి వచ్చినా దాన్ని తేలికగా తీసుకోకూడదు. సాధారణ పరిస్థితుల్లో నీరు తాగిన వెంటనే యూరిన్ ప్రెజర్ వస్తే అది మూత్రపిండాల్లో పెరుగుతున్న వ్యాధికి సంకేతం కూడా కావచ్చు. కాబట్టి నీరు తాగిన వెంటనే ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తే తేలికగా తీసుకోకండి. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్సలు తీసుకోవాలి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024