Best Web Hosting Provider In India 2024
Rice Recipe: ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ఉల్లిపాయ రైస్ స్పైసీగా చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది
ఇంట్లో కూరగాయలు లేకపోతే పెద్దగా బెంగ పడాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు ఉల్లిపాయ రైస్ చేసుకొని తింటే రుచిగా ఉంటుంది. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
కొన్నిసార్లు ఇంట్లో కూరగాయలు లేకుండా అయిపోతాయి. అప్పటికప్పుడు మార్కెట్కు వెళ్లి తీసుకురాలేము. అలాంటి సమయంలో లంచ్ లేదా డిన్నర్ లోకి ఏం ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తారా? అయితే ఉల్లిపాయ రైస్ చేసుకోండి. దీనిలోకి ఎలాంటి కూరగాయలు అవసరం లేదు. ముఖ్యంగా ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది. ఇక ఇంట్లో ఉన్న మసాలా దినుసులతోనే ఈ ఉల్లిపాయ రైస్ ను టేస్ట్ గా వండకోవచ్చు. దీన్ని లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ఉపయోగించుకోవచ్చు. స్పైసీగా చేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
ఉల్లిపాయ రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
నూనె – రెండు స్పూన్లు
పచ్చిశనగపప్పు – రెండు స్పూన్లు
ఆవాలు – ఒక స్పూను
జీలకర్ర – ఒక స్పూను
వేరుశెనగ పలుకులు – పావు కప్పు
వెల్లుల్లి రెబ్బలు – పది
ఉల్లిపాయల తరుగు – ఒక కప్పు
పసుపు – చిటికెడు
కారం – ఒక స్పూను
ఇంగువ – పావు స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
పచ్చిమిర్చి – నాలుగు
కరివేపాకులు – గుప్పెడు
చింతపండు రసం – పావు కప్పు
వండిన అన్నం – రెండు కప్పులు
ఉల్లిపాయ రైస్ రెసిపీ
1. ఉల్లిపాయలను నిలువుగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
2. మిగిలిపోయిన అన్నంతో ఈ ఉల్లిపాయ రైస్ ను చేసుకోవచ్చు. లేదా ముందుగా అన్నాన్ని వండి అది పొడి పొడిగా వచ్చేలా ప్లేట్లో ఆరబెట్టుకొని పక్కన పెట్టుకున్నాక ఈ రైస్ చేయవచ్చు.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
4. ఆ నూనెలో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
5. తర్వాత వేరుశనగ పలుకులు కూడా వేసి వేయించుకోవాలి.
6. వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి వేసి వేయించుకోవాలి.
7. ఇప్పుడు ఉల్లిపాయల తరుగును కూడా వేసి బాగా వేయించాలి.
8. పచ్చిమిర్చిని కూడా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో పసుపు, కారం, ఇంగువ రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
9. ఇందులో చింతపండు రసాన్ని వేసి బాగా కలిపి ఇగురులాగా అయ్యేవరకు ఉడికించాలి.
10. పైన మూత పెట్టి అది ఇగురులాగా ఉంచి తర్వాత మూత తీసి అందులో ముందుగా వండుకున్న అన్నాన్ని పులిహార లాగా కలుపుకోవాలి.
11. పైన నిమ్మరసం చల్లుకొని సర్వ్ చేయాలి. అంతే టేస్టీ ఉల్లిపాయ రైస్ రెడీ అయినట్టే. దీని రుచి మామూలుగా ఉండదు.
ఉల్లిపాయ రూస్ తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. స్పైసీగా కావాలనుకుంటే కారం లేదా పచ్చిమిర్చిని అధికంగా వేసుకుంటే సరిపోతుంది. దీన్ని లంచ్ బాక్స్ రెసిపీ గా కూడా వినియోగించకపోవచ్చు. డిన్నర్ లో ఏం తినాలో అర్థం కాకపోతే ఈ ఉల్లిపాయ రైస్ ఒకసారి చేసుకుని తినండి. లేదా చికెన్ గ్రేవీతో ఈ ఉల్లిపాయ రైస్ పెట్టుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి మీకు కచ్చితంగా ఇది నచ్చుతుంది.
సంబంధిత కథనం
టాపిక్