టీడీపీ ఎమ్మెల్యే ఆక్రోశం!

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ జ‌గ‌న్ బొమ్మ వేయించుకున్నాడ‌ని ఆటో డ్రైవ‌ర్‌పై దాడి

ఏలూరు:  అధికార పార్టీ నేత‌ల ఆగ‌డాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. అభిమాన నేత బొమ్మ‌ను ఆటోపై వేయించుకున్నాడ‌న్న ఆక్రోశంతో టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న త‌ణుకులో వెలుగు చూసింది. ఆటో డ్రైవ‌ర్‌పై ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దాడికి దిగారు. తణుకులో పంజా దుర్గారావు త‌న ఆటోపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బొమ్మ వేయించుకున్నాడు. ఆ ఫోటో చూసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ జీర్ణించుకోలేక‌పోయారు. న‌డిరోడ్డుపై ఆటోను ఆపేసి డ్రైవ‌ర్ దుర్గారావుపై దాడికి పాల్ప‌డ్డారు. అంత‌టితో వ‌ద‌ల‌కుండా బూతులు తిడుతూ దుర్భాష‌లాడారు.  పోలీసులను పిలిపించి స్టేషన్ కి తీసుకెళ్లి జ‌రిమానా విధించాల‌ని హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల‌తో ఆటోపై రూ.3,400 జరిమానా విధించారు. ఎమ్మెల్యే తీరును వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు తీవ్రంగా ఖండించారు. దుర్గారావుకి మద్దతుగా నిలిచి..అధికార పార్టీ తీరును ఎండ‌గ‌ట్టారు. 

Best Web Hosting Provider In India 2024