Chaganti Koteswara Rao : తిరుమలలో చాగంటి కోటేశ్వరరావుకు అవమానమంటూ వీడియో వైరల్, అవాస్తవ ప్రచారమని టీటీడీ క్లారిటీ

Best Web Hosting Provider In India 2024

Chaganti Koteswara Rao : తిరుమలలో చాగంటి కోటేశ్వరరావుకు అవమానమంటూ వీడియో వైరల్, అవాస్తవ ప్రచారమని టీటీడీ క్లారిటీ

Bandaru Satyaprasad HT Telugu Jan 17, 2025 10:17 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Jan 17, 2025 10:17 PM IST

Chaganti Koteswara Rao : తిరుమలలో ఆథ్యాత్మిక ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావుకు అవమానం జరిగిందని, ఆయన ప్రవచనాలు రద్దు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై టీటీడీ స్పందించింది. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చింది.

 తిరుమలలో చాగంటి కోటేశ్వరరావుకు అవమానమంటూ వీడియో వైరల్, అవాస్తవ ప్రచారమని టీటీడీ క్లారిటీ
తిరుమలలో చాగంటి కోటేశ్వరరావుకు అవమానమంటూ వీడియో వైరల్, అవాస్తవ ప్రచారమని టీటీడీ క్లారిటీ
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

Chaganti Koteswara Rao : ప్రముఖ ఆథ్యాత్మిక ప్రవచన కర్త బ్రహ్మర్షి డా. చాగంటి కోటేశ్వర రావుకు తిరుమలలో అవమానించారని, టీటీడీ ఆయన ప్రవచనాలను రద్దు చేసిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై టీటీడీ స్పందించింది. ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రతి ఏడాది జనవరి నెలలో తిరుమల శ్రీవారిని సందర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా జనవరి 14న శ్రీవారి దర్శనం, జనవరి 16వ తేదీ సాయంత్రం తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు డిసెంబర్ 20న టీటీడీ ప్రొసిడింగ్స్ ఇచ్చింది. డా. చాగంటి కోటేశ్వరరావు కేబినేట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం టీటీడీ జనవరి 14న శ్రీవారి దర్శనం ఏర్పాట్లను చేసింది. అందులో భాగంగా, రాంబగీఛ గెస్ట్ హౌస్ నుంచి శ్రీవారి ఆలయానికి వారిని తీసుకెళ్లేందుకు బగ్గీస్ ను, శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా అనుమతించేందుకు టీటీడీ ఏర్పాట్లను చేసింది.

yearly horoscope entry point

అయితే వయసు రీత్యా శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా వెళ్లే సదుపాయం ఉన్నా చాగంటి సున్నితంగా తిరస్కరించారు. పలువురు ప్రముఖులు, సాధారణ భక్తుల తరహాలోనే వైకుంఠం కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకుంటానని వారే స్వయంగా సూచించారు. వారి సూచనల మేరకు స్వయంగా వైకుంఠం కాంప్లెక్స్ నుంచి ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు.

అదేవిధంగా జనవరి 8వ తేదీన తిరుపతిలో జరిగిన తోపులాట ఘటన నేపథ్యంలో చాగంటి వారి ప్రవచన కార్యక్రమాన్ని మరొక తేదీకి వాయిదా వేస్తే బాగుంటుందని వారి దృష్టికి టీటీడీ అధికారులు తీసుకెళ్లగా, ఈ విన్నపాన్ని చాగంటి వారు అంగీకరించారు. తదుపరి వారి అపాయింట్మెంట్ తేదీలను మరోసారి తీసుకుని ప్రవచనాలు ఏర్పాటు చేసేందుకు టీటీడీ నిర్ణయించింది.

వాస్తవం ఇలా ఉండగా బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి అనుమతించారని, చివరి నిమిషంలో పరిపాలనా కారణాల రీత్యా చాగంటి వారి ప్రవచనాల కార్యక్రమాన్ని టీటీడీ రద్దు చేసినట్లు సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది. వాస్తవాలను వక్రీకరించి అసత్యపు వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ తెలియజేసింది.

శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల ఏప్రిల్‌ నెల కోటా విడుదల

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమ‌ల‌, అర్చన‌, అష్టదళ పాదపద్మారాధన సేవల ఏప్రిల్‌ నెల కోటాను జ‌న‌వ‌రి 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేష‌న్‌ కోసం జ‌న‌వ‌రి 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఈ టికెట్లు పొందిన వారు జ‌న‌వ‌రి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

జ‌న‌వ‌రి 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల ఆర్ధిత సేవా టికెట్లను జ‌న‌వ‌రి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

జ‌న‌వ‌రి 21న వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఏప్రిల్‌ నెల కోటాను జ‌న‌వ‌రి 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

జ‌న‌వ‌రి 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు

ఏప్రిల్‌ నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జ‌న‌వ‌రి 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఏప్రిల్‌ నెల ఆన్ లైన్ కోటాను జ‌న‌వ‌రి 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను జ‌న‌వ‌రి 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

జ‌న‌వ‌రి 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

ఏప్రిల్‌ నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జ‌న‌వ‌రి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌

తిరుమల, తిరుపతిల‌లో ఏప్రిల్‌ నెల గదుల కోటాను జ‌న‌వ‌రి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ భక్తులను కోరింది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

TirumalaTtdTirupatiAndhra Pradesh NewsTrending ApTelugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024