Best Web Hosting Provider In India 2024
Instant Vada Recipe: ముందు రోజు నానబెట్టకుండానే ఇనస్టంట్‌గా వడలు చేసుకోవడం ఎలాగో మీకు తెలుసా? ఇదిగో ఇలా ట్రై చేయండి
Instant Vada Recipe: మూమూలుగా మనం వడలు చేయాలంటే, ముందు రోజే పప్పు నానబెట్టాలి. కొన్ని గంటల ముందే వాటిని రుబ్బి పిండిగా మార్చాలి. ఇదంతా గంటల పాటు సాగే ప్రక్రియ. ఇటువంటి హంగామా ఏమీ లేకుండానే ఇన్‌స్టంట్‌గా వడలు తయారుచేసుకోవాలనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి.
ఇనస్టంట్‌గా వడలు చేసుకోవడం ఎలాగో మీకు తెలుసా
వడలంటే చాలా మందికి ఇష్టం. కానీ, ఇవి సిద్ధం చేయాలంటే పెద్ద ప్రొసెస్. సాధారణంగా వడలు తయారుచేసేందుకు, ముందు రోజు పప్పు నానబెట్టి, మిక్సీ పట్టి, అప్పుడు గానీ వడలు చేసుకోలేం. ఇదంతా గంటల పాటు సాగే ప్రక్రియ. అలా లేకుండానే మినపప్పు, బియ్యపు పిండి వినియోగించి కొద్ది నిమిషాల ముందే ప్రిపేర్ చేసుకుని క్రిస్పీగా ఉండే వడలు రెడీ చేసేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందామా..
కావాల్సిన పదార్థాలు:
- మినపపిండి – ఒక కప్పు
- బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్లు
- తరిగిన ఉల్లిపాయలు – పావు కప్పు
- పచ్చి మిరపకాయలు – 2 తరిగినవి
- అల్లం పేస్ట్ – టీ స్పూన్
- కరివేపాకు – తురిమినివి కొన్ని
- ఉప్పు – రుచికి తగినంత
- నీరు – సరిపడినంత
- నూనె – డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడ
ఇన్‌స్టంట్ వడలు తయారుచేసుకునే విధానం:
- ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులో మినపపిండి, బియ్యం పిండి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం పేస్ట్, కరివేపాకు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి.
- అందులో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండి చిక్కగా మారేలా చేసుకోండి. అలా చేసిన తర్వాత ఒక 10 నిమిషాల వరకూ వదిలేయండి.
- పిండి మరీ వదులుగానూ, లేదా మరీ టైట్ గానూ ఉండకుండా చూసుకోండి. మీకు వద్దనిపిస్తే పిండిని కలిపే సమయంలో కూరగాయ ముక్కలను (ఉల్లిపాయ ముక్కలు) కలపాల్సిన అవసరం లేదు.
- ఈలోపు కడాయి స్టవ్ మీద పెట్టుకుని అందులో ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనె పోయండి.
- చేతులను తడుపుకొని కొద్దిగా పిండిని ముద్దలుగా చేసుకుని ఒక గిన్నె మీద వేసుకోవడం లేదా కవర్ మీద వేసుకుని వత్తుకుంటూ రౌండ్ గా చేసుకోండి. దానికి మధ్యలో హోల్ పెట్టుకోండి.
- వేడెక్కిన నూనెలో మీరు హోల్ పెట్టి తయారుచేసుకున్న పిండిని నిదానంగా వదలండి. బంగారపు రంగులోకి మారి క్రిస్పీగా వేగిందని కన్ఫమ్ అయ్యేంత వరకూ అటూఇటు తిప్పుతూ ఉండండి.
- అలా వేయించుకున్న వడను తీసుకుని పేపర్ టవల్ లేదా టిష్యూ పేపర్ మీద వేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల వడలు పట్టుకున్న వెంటనే చేతికి నూనె తగలకుండా ఉంటుంది.
- ఇలా అన్ని వడలను చేసిన వెంటనే నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అంతే టేస్టీ అండ్ ఇన్‌స్టంట్ వడలు రెడీ అయినట్లే.
- వీటిని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. మీకు నచ్చినట్లుగా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లేదా సాంబార్ వంటి వాటితో కలిపి తింటే సూపర్‌గా ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్