Karthika Deepam January 18th Episode: జ్యోత్స్నను నిలదీసిన పారు.. కాశీ కంగారు, పోలీస్ కంప్లైంట్.. దశరథ్ మాటలతో భయపడిన జో

Best Web Hosting Provider In India 2024

Karthika Deepam January 18th Episode: జ్యోత్స్నను నిలదీసిన పారు.. కాశీ కంగారు, పోలీస్ కంప్లైంట్.. దశరథ్ మాటలతో భయపడిన జో

 

Karthika Deepam 2 Today Episode January 18: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. శౌర్యకు చికిత్స కోసం కాశీ దగ్గర డబ్బు తీసుకునేందుకు కార్తీక్ అంగీకరిస్తాడు. దాసు గురించి జ్యోత్స్నను పారిజాతం నిలదీస్తుంది. శివన్నారాయణ ఇంటికి వస్తాడు కాశీ. దశరథ్ మాటలతో జో వణికిపోతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

 
Karthika Deepam January 18th Episode: జ్యోత్స్నను నిలదీసిన పారు.. కాశీ కంగారు, పోలీస్ కంప్లైంట్.. దశరథ్ మాటలతో జో వణుకు
Karthika Deepam January 18th Episode: జ్యోత్స్నను నిలదీసిన పారు.. కాశీ కంగారు, పోలీస్ కంప్లైంట్.. దశరథ్ మాటలతో జో వణుకు
 

కార్తీక దీపం 2 నేటి (జనవరి 18) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. శౌర్యకు సర్జరీ చేయించేందుకు డబ్బు కోసం కార్తీక్ ప్రయత్నిస్తుంటాడు. తన స్నేహితుడిని అప్పు అడిగానని కాశీతో చెబుతాడు. ఇది చూసి తాను డబ్బు ఇస్తానంటాడు కాశీ. అయితే, పరిస్థితులను చూసి నిన్ను అడగలేకున్నానని కార్తీక్ అంటాడు. తాను బాగానే ఉన్నానని కాశీ అంటే.. నీ అవసరాలు ఉన్నాయని కార్తీక్ గుర్తుచేస్తాడు. డబ్బులు ఎలా అడుగుతానని అంటాడు. నువ్వు మరీ ఇంత మంచోడివి ఏంటి బావా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు కాశీ.

అంగీకరించిన కార్తీక్

తాను ఇల్లు తర్వాత కట్టుకుంటానని, తాను డబ్బు ఇస్తానని కాశీ అంటాడు. ముందు శౌర్యను ఆసుపత్రిలో జాయిన్ చెయ్ అని కార్తీక్‍తో చెబుతాడు. “నా ఆత్మాభిమానం తీసుకోవద్దని అంటుంటే.. నా అవసరం నా మనసు మాట వినొద్దు అంటుంది. తీసుకుంటాను కాశీ. అప్పుగా తీసుకుంటా” అని కార్తీక్ అంటాడు. ఈ విషయాలు మీ అక్క దీపకు తెలియకూడదని కార్తీక్ చెబుతాడు. తాను అక్క వద్ద దాచలేనని కాశీ అంటే.. అయితే డబ్బు వద్దంటాడు కార్తీక్. శౌర్య గురించి తెలిస్తే దీప తట్టుకోలేదని, దాచేయాలని అంటాడు కాశీ కూడా సరేనంటాడు. రూ.50లక్షలు గతంలో లెక్కకాదని, ఇప్పుడు పరిస్థితులు బాగోలేవని కన్నీరు పెట్టుకుంటాడు కార్తీక్. శౌర్య అంటే ఒక ప్రమాణం కాదని.. తనది, దీపది కూడా అని బాధపడతాడు. ముందు ఈ డబ్బు కట్టి శౌర్యను ఆసుపత్రిలో జాయిన్ చేస్తానంటాడు. మిగిలిన డబ్బు కోసం ఏదో ఒకటి చేస్తానని చెబుతాడు.

దాసు గురించి కార్తీక్‍తో..

తన తండ్రి దాసు కనిపించడం లేదని కార్తీక్‍తో చెబుతాడు కాశీ. కథను మలుపు తిప్పే మనిషి అంటూ ఎవరినో వెతికేవాడని, అతడు దొరికాడని ఇటీవలే చెప్పాడని అంటాడు. ఎవరా మనిషి అని కార్తీక్ అంటే.. తెలియదని కాశీ చెబుతాడు. నాన్న ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని, ఇప్పటి వరకు రాలేదని, భయంగా ఉందని కాశీ అంటాడు. పోలీస్ కంప్లైట్ ఇద్దామని కార్తీక్ అంటాడు.

 

జ్యోత్స్నకు పారిజాతం ప్రశ్నలు.. చాటుగా విన్న దశరథ్

“దాసు ఏమయ్యాడో ఇంత వరకు కాశీ ఇంటి నుంచి ఫోన్ రాలేదు.. లోకల్ ఛానెల్‍లో కూడా ఏ అనాథ శవం దొరికినట్టు రాలేదు. దాసును ఎవరైనా కాపాడారా. నేను కొట్టి దెబ్బకు అయితే గ్రానీ కొడుకు బతకడం కష్టం” అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. నా కొడుకును ఏం చేశావే అని ఎంట్రీ ఇస్తుంది పారిజాతం. నిన్నే అడిగేది.. నా కొడుకును ఏం చేశావ్ జ్యోత్స్నను నిలదీస్తుంది. దాసు ఫోన్ కలవలేదని. స్విచ్చాఫ్ వస్తోందని చెబుతుంది. వీరి మాటలను చాటుగా వింటాడు దశరథ్. దాసు కాళ్లు పట్టుకొని ఎందుకు బతిమాలావని జ్యోత్స్నను పారిజాతం ప్రశ్నిస్తుంది. ఎందుకు అని అడిగితే ఏవేవో సమాధానాలు చెప్పావని అంటుంది. దీంతో దశరథ్‍లో అనుమానం మరింత ఎక్కువవుతుంది.

నీకేదైనా డౌట్ ఉంటే నీ కొడుకు దాసును అడుగు.. అతడే నిజాలు చెబుతాడని జో (జ్యోత్స్న) అంటుంది. నిజాలా అని అనుమానంగా అంటుంది పారిజాతం. అడుగుదామంటేనే ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని చెబుతుంది. దాసు ఇంకోసారి ఇంటికి వచ్చాడా.. జ్యోత్స్న ఎందుకు బతిమాలింది.. దాసు చెప్పాలనుకున్న విషయం ఏంటి అని మనసులో అనుకుంటాడు దశరథ్. వీటన్నింటికీ ఏదో సంబంధం ఉందని, ఏదో నిజాన్ని దాచేందుకే దాసుపై జ్యోత్స్న దాడి చేసి ఉంటుందని దశరథ్ తనలో తానే అనుకుంటాడు. ఈ విషయాలు ఏంటో తెలియాలంటే దాసు స్పృహలోకి రావాలని అనుకుంటాడు. నువ్వు చెప్పకపోయినా నిజాలు బయటపడతాయని పారిజాతం అంటుంది. “నిజాలు బయటపడతాయనే కదా దాసును చంపాలనుకుంది.. కానీ ఆ పని సగమే చేశా.. దాసు చచ్చాడు ఫలానా చోట శవం దొరికిందని తెలిసే వరకు నాకు ఈ టెన్షన్ తప్పదు” అని జ్యోత్స్న అనుకుంటుంది.

 

కాపాడిన దీప

శౌర్య ఆరోగ్యం గురించి కార్తీక్ బాబు ఏదో దాస్తున్నాడని దీప ఆలోచిస్తూ రోడ్డుపై నడుస్తూ ఉంటుంది. కార్తీక్ ఇటీవలి మాటలను, ప్రవర్తనను గుర్తు చేసుకుంటుంది. ఇంతలో ఓ భార్యభర్త నుంచి వారి పిల్లాడిని ఎత్తుకెళ్లేందుకు రౌడీలు ప్రయత్నిస్తారు. ఆ పిల్లాడిని తీసుకొని పారిపోతుంటారు. ఇది దీప చూస్తుంది. రౌడీ కళ్లలో కారం కొట్టి ఆ పిల్లాడిని కాపాడుతుంది దీప. వారి తల్లిదండ్రులకు అప్పగిస్తుంది. ఆస్తి కోసం తమ సొంతవాళ్లే ఈ వని చేస్తున్నారని, వీడు లేకపోతే బతకలేమంటూ ఆ పిల్లాడి తండ్రి చెబుతాడు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని దీపతో అంటారు. పిల్లాడిని కాపాడిన దీపకు ఏదైనా ఇవ్వండి అని ఆ పిల్లాడి తల్లి అంటుంది. అయితే, తనకు ఏమీ వద్దని దీప చెబుతుంది. బాబు జాగ్రత్త అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

కంగారుగా శివన్నారాయణ ఇంటికి కాశీ

దాసు కనిపించకపోవటంతో కంగారుగా శివన్నారాయణ ఇంటికి వస్తాడు కాశీ. అతడిని చూసి ఆగు అక్కడ అని శివన్నారాయణ అరుస్తాడు. కాశీ ఎందుకొచ్చాడని మనసులో అనుమానంగా అనుకుంటుంది జ్యోత్స్న. నానమ్మ పారిజాతంతో మాట్లాడాలని కాశీ అంటాడు. ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా అని శివన్నారాయణ విసుగ్గా అరుస్తాడు. దాసు కోసమే వచ్చి ఉంటాడని దశరథ్ కూడా అనుకుంటాడు. “నాన్నమ్మ నేను ఇప్పుడు వచ్చింది నాన్న గురించి మాట్లాడడానికి” అని పారిజాతంతో కాశీ అంటాడు. తాను అదే ఆలోచిస్తున్నానని, నీ మీద అలిగి వైజాగ్ వెళ్లాడా అని పారు ప్రశ్నిస్తుంది. నిన్నటి నుంచి నాన్న కనిపిచడం లేదని కంగారుగా అంటాడు కాశీ. దాసు కనిపించడం లేదా అని సుమిత్ర కూడా టెన్షన్‍తో అంటుంది. దాసు దేశదిమ్మరే కదా అని వెటకారంగా మాట్లాడతాడు శివన్నారాయణ. నీ మనవరాలే కొట్టి రోడ్డు పక్కన పడేసిందని, ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడని దశరథ్ మనసులో అనుకుంటాడు.

 

దశరథ్ మాటలతో జ్యోత్స్నలో భయం

దాసు ఏవరినీ ఏమీ అనడని, మంచోడని అతడికి ఏం జరిగి ఉంటుందని సుమిత్ర అంటుంది. “మనిషి మంచోడే.. కానీ రోజులే మంచిగా లేవు సుమిత్ర” అని దశరథ్ అంటాడు. దాసు ఫోన్ స్విచ్చాఫ్ వచ్చిన దగ్గరి నుంచి మనసు పీకుతూనే ఉందని, వాడికి ఏదో అయినట్టుంది రా అని పారు అంటుంది. దాసు సంచిలో డబ్బు ఉందా, నగలు ఉన్నాయని, ఏమీ అయి ఉండదని శివన్నారాయణ అంటాడు. ప్రతీసారి మనిషికి ప్రమాదం నగలు, డబ్బు వల్లే రాకపోవచ్చు నాన్న. ఇంకేదైనా కారణాలు ఉండొచ్చు కదా” అని జ్యోత్స్నను చూసి దశరథ్ అంటాడు. డాడీ ఏంటి తెలిసినట్టే మాట్లాడుతున్నాడు, అనుమానం వచ్చిందా అని భయపడుతుంది జ్యోత్స్న.

నీకు తెలుసా అంటూ నిలదీసిన దశరథ్

పోలీస్ కంప్లైట్ ఇవ్వాలని కాశీతో సుమిత్ర చెబుతుంది. చిన్న పిల్లాడు తప్పిపోయినట్టు పోలీస్ కంప్లైట్ ఇవ్వామంటావేంటి మమ్మ అని జ్యోత్స్న అడ్డు చెబుతుంది. దాసు ఎక్కడుంటాడో ఆయనకే తెలియదు అని కాశీతో జ్యోత్స్న అంటే.. నీకు తెలుసా.. నిన్నే అడిగేది అని గట్టిగా అడుగుతాడు దశరథ్. దీంతో డాడీ ఏంటి ఇలా అడుగుతున్నాడని వణికిపోతుంది జ్యోత్స్న. దానికి ఎలా తెలుస్తుంది రా అని శివన్నారాయణ అంటాడు. “దాసు ఏమయ్యాడో.. ఎక్కడికి వెళ్లాడో తెలిసినట్టే మాట్లాడుతోంది కదా. ఏమో తెలిసే మాట్లాడుతుందేమో” అని దశరథ్ అంటాడు. నో డౌట్ డాడీకి నా మీద అనుమానం వచ్చింది.. నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది.

 

ఏం జోత్స్న నిన్న కానీ.. ఈ రోజు కానీ దాసును ఏమైనా చూశావా అని దశరథ్ ప్రశ్నిస్తే.. లేదని అంటుంది జ్యోత్స్ను. ఈ మధ్య ఆఫీస్ పనుల్లో చాలా బిజీగా ఉంటున్నావు కదా అని దశరథ్ అంటాడు. కంప్లైట్ ఇచ్చుకుంటావో ఏం చేస్తావో చెయ్ ఇక నువ్వు వెళ్లు అని కాశీతో శివన్నారాయణ అంటాడు. తండ్రి కనిపింలేదని వాడు కంగారు వస్తే వెటకారంగా మాట్లాడతారేంటని పారిజాతం అంటుంది.

పోలీస్ కంప్లైట్.. షాకైన జ్యోత్స్న

ముందు పోలీస్ కంప్లైట్ ఇవ్వాలని కాశీతో పారిజాతం చెబుతుంది. తాను ఆల్రెడీ పోలీస్ కంప్లైట్ ఇచ్చానని కాశీ చెబుతాడు. దీంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. కార్తీక్ బావే దగ్గర ఉండి కంప్లైట్ ఇప్పించానని అంటాడు. అడగాల్సిన అవసరం వచ్చింది కాబట్టే అడుగుతున్నానని చెప్పాడు. దాసును పోలీసులే కనిపెడతారని సుమిత్ర అంటే.. అదే జరిగే ముందు అరెస్ట్ చేసేది నన్ను అంటూ జ్యోత్స్న కంగారు పడుతుంది.

దాసు ఆసుపత్రిలో ఉన్నాడని ఎవరికీ తెలియదు, తెలిస్తే పరిస్థితి ఏంటని దశరథ్‍ అనుకుంటాడు. నాన్నను చివరగా ఎప్పుడు చూశావని పారును కాశీ ప్రశ్నిస్తాడు. జ్యోత్స్న కోసం నిజం దాచేస్తుంది పారిజాతం. దాసు కాళ్లను జ్యోత్స్న పట్టుకున్న విషయాన్ని, ఇంటికి వచ్చిన విషయాన్ని పారిజాతం దాచేస్తుంది. దాసును చూసి చాలా రోజులు అయిందని అబద్ధం చెబుతుంది. తనకు భయంగా ఉందని, ఏదైనా సమాచారం తెలిస్తే చెప్పాలని కాశీ అంటాడు. కంగారు పడొద్దని ధైర్యం చెబుతుంది సుమిత్ర. ఈసారి చాలా భయంగా ఉంది పెద్దమ్మ అని కాశీ అంటాడు. కంగారు పడొద్దని, స్వప్న కూడా భయపడుతుందని సుమిత్ర అంటుంది. అక్కడి నుంచి కాశీ వెళ్లిపోతాడు. తన అయోమయం కొడుకు ఏమయ్యాడోనని పారు కూడా కంగారు పడుతుంది.

 

ఎలా తప్పించుకోవాలి

దాసు ఏమయ్యాడండి అని దశరథ్‍ను సుమిత్ర ఉంటుంది. నాకు కూడా ఏం తెలుసని నిజం దాచేస్తాడు దశరథ్. మన రెస్టారెంట్ గురించి సాయంత్రం మాట్లాడుకుందామని, దాసు గురించి ఎక్కువగా ఆలోచించవద్దని, అతడు మళ్లీ అడుగుపెట్టాకే సమస్యలు వచ్చాయని శివన్నారాయణ అంటాడు. దాసు కనిపించకుండా పోతే మనం ప్రశాంతంగా ఉండొచ్చని చెబుతాడు. నా కూతురు అదే చేసింది నాన్న అని దశరథ్ మనసులో అనుకుంటాడు. దాసు శవం దొరికితే.. దానీ మీద నా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా.. నేను ఎలా తప్పించుకోవాలి అని మనసులో భయంగా అనుకుంటుంది జ్యోత్స్న. “ఏంటి జోత్స్న ఆలోచిస్తున్నావ్. నువ్వైతే దాసును చూడలేదు కదా” అని దశరథ్ అడుగుతాడు. దీంతో ఏం తెలియదు అనుకుంటూ వెళ్లిపోతుంది జ్యోత్స్న.

అప్పటి వరకు నిజం ఎవరీ తెలియకూడదు

జ్యోత్స్న దాసును ఎందుకు చంపాలనుకుందో తెలియదని దశరథ్ ఆలోచిస్తాడు. “దాను నాతో చెప్పాలనుకున్న విషయం ఏంటో తెలియదు. కొట్టి పడేశానని జ్యోత్స్న అనుకుంటుంది. దాసు ఆసుపత్రిలో ఉన్నాడని నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు పోలీసులు కనిపెడితే నన్నే ఎంక్వైరీ చేస్తారు. తర్వాత విషయం మొత్తం బయటికి వస్తుంది. నాన్నకు ఈ విషయం బయటికి తెలియకూడదు” అని దశరథ్ నిర్ణయించుకుంటాడు. దాసు నోటి నుంచి నిజం తెలుసుకునే వారు.. దాసును జ్యోత్స్న చంపాలనుకుందన్న నిజం ఎవరికీ తెలియకూడదని అనుకుంటాడు. అప్పటి వరకు కాశీని ఆపడం కష్టమని, కాశీని ఎలా ఆపాలని ఆలోచిస్తాడు.

 

దాసు ఎక్కడ ఉంటే సేఫ్‍గా ఉంటాడు.. దాసును ఏం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడతాడనని మనసులోనే మదనపడతాడు దశరథ్. లేట్ చేస్తే పోలీసులు కనిపెడతారని, అప్పుడు పరిస్థితులు అదుపు తప్పుతాయని, జ్యోత్స్నను అరెస్ట్ చేస్తారని అనుకుంటాడు. “దీనంతటికి కారణమైన నిజాలను ముందుగా తెలుసుకోవాలి. ఇప్పుడు దాసును ఏం చేయాలి. కాశీని ఎలా ఆపాలి” అని దశరథ్ అనుకుంటాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (జనవరి 18) ఎపిసోడ్ ముగిసింది.

 
Whats_app_banner
 

సంబంధిత కథనం

టాపిక్

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024