Best Web Hosting Provider In India 2024
Netflix Top Trending: నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. రెండు రోజుల్లోనే టాప్‌లోకి మలయాళం మూవీ
Netflix Top Trending: నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లేటెస్ట్ లిస్ట్ వచ్చేసింది. రెండు రోజుల కిందటే ఓటీటీలోకి అడుగుపెట్టిన మలయాళం బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నంబర్ వన్ గా నిలవడం విశేషం.
Netflix Top Trending: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ లో శనివారం (జనవరి 18) టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ జాబితా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ ఓటీటీలోకి గురువారమే (జనవరి 16) వచ్చిన మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ రైఫిల్ క్లబ్.. ప్రస్తుతం ఇండియాలో టాప్ ట్రెండింగ్ మూవీగా ఉంది. అటు వెబ్ సిరీస్ లలో బ్లాక్ వారెంట్ టాప్ లో కొనసాగుతోంది.
నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ మూవీ రైఫిల్ క్లబ్
నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ సినిమాల్లో మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ రైఫిల్ క్లబ్ తొలి స్థానంలో నిలిచింది. ఈ మూవీ గురువారమే ఈ ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో మిక్స్‌డ్ రివ్యూలు వచ్చిన ఈ సినిమాకు ఓటీటీలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
గతేడాది డిసెంబర్ 19న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదనిపించింది. ఈ రైఫిల్ క్లబ్ మూవీకి శ్యామ్ పుష్కరన్, దిలీష్ కరుణాకరణ్, సుహాస్ కథ అందించారు. అనురాగ్ కశ్యప్ తోపాటు విజయ రాఘవన్, దర్శన రాజేంద్రన్, దిలీష్ పోతన్, వాణి విశ్వనాథ్, సురేష్ కృష్ణ, వినీత్ కుమార్ లాంటి వాళ్లు నటించారు.
టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ ఇవే
రైఫిల్ క్లబ్
బ్యాక్ ఇన్ యాక్షన్
మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకనింగ్
లక్కీ భాస్కర్
భూల్ భులయ్యా 3
యాడ్ విటమ్
తంగలాన్
అమరన్
దేవర
విక్కీ విద్య కా వో వాలా వీడియో
నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ వెబ్ సిరీస్
ఇక నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే ఈ మధ్యే ఈ ఓటీటీలోకి వచ్చిన బ్లాక్ వారెంట్ తొలి స్థానానికి దూసుకొచ్చింది. ఇక ఆ తర్వాతి స్థానంలో కొరియన్ డ్రామా XO, Kitty రెండో సీజన్ ఉంది.
ఆ తర్వాత బాలీవుడ్ రోషన్స్ ఫ్యామిలీపై రూపొందిన డాక్యుమెంటరీ ది రోషన్స్ మూడో స్థానంలో, స్క్విడ్ గేమ్ సీజన్ 2 నాలుగో స్థానంలో, అలైస్ ఇన్ బోర్డర్‌లాండ్ ఐదో స్థానంలో, మిస్‌మ్యాచ్‌డ్ సీజన్ 3 ఆరో స్థానంలో, సింగిల్స్ ఇన్‌ఫెర్నో ఏడో స్థానంలో, బండిడోస్ ఎనిమిదో స్థానంలో, అమెరికన్ ప్రైమెవల్ తొమ్మిదో స్థానంలో, డాక్టర్ స్టోన్ నాలుగో సీజన్ పదో స్థానంలో ఉన్నాయి.