EPFO PF transfer : పాత రూల్​కి ఈపీఎఫ్​ఓ గుడ్​ బై! ఇక ప్రాసెస్​ మరింత సింపుల్​..

Best Web Hosting Provider In India 2024


EPFO PF transfer : పాత రూల్​కి ఈపీఎఫ్​ఓ గుడ్​ బై! ఇక ప్రాసెస్​ మరింత సింపుల్​..

Sharath Chitturi HT Telugu
Jan 18, 2025 11:09 AM IST

పీఎఫ్​ నిధులను బదిలీ ప్రక్రియను గత, ప్రస్తుత యజమానుల ద్వారా మళ్లించాలనే నిబంధనను ఈపీఎఫ్ఓ తొలగించింది. ఇది ఉద్యోగులు ఉద్యోగాలు మారడానికి సులభతరం చేసింది.

పాత రూల్​కి ఈపీఎఫ్​ఓ గుడ్​ బై
పాత రూల్​కి ఈపీఎఫ్​ఓ గుడ్​ బై

పీఎఫ్​ ప్రాసెస్​ని సరళతరం చేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్న ఈపీఎఫ్​ఓ (ఎంప్లాయీస్​ ప్రావిడెంట్​ ఫండ్​ ఆర్గనైజేషన్​).. మరో కొత్త నిర్ణయం తీసుకుంది. గతంలో పని చేసిన ఎంప్లాయర్​తో పాటు ప్రస్తుత కంపెనీకి ఉద్యోగి సమర్పించాల్సిన ఆన్​లైన్​ ట్రాన్స్​ఫర్​ క్లెయిమ్​ నిబంధనను తొలగించేసింది. ఈ మేరకు జనవరి 15న ఒక సర్క్యులర్​ని విడుదల చేసింది. ఉద్యోగులు ఉద్యోగాలు మారే సమయంలో ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? అన్న దానిపై ఈపీఎఫ్​ఓ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

yearly horoscope entry point

పాత రూల్​ ఎత్తివేస్తే ఎవరికి లాభం?

  • అక్టోబర్ 1, 2017న లేదా ఆ తర్వాత యూఏఎన్ కేటాయించిన అదే యూఏఎన్​తో లింక్ అయి, ఆధార్​తో లింక్ అయిన మెంబర్ ఐడీల మధ్య ఖాతా బదిలీలు.
  • 2017 అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత యూఏఎన్​లను కేటాయించిన వివిధ యూఏఎన్​లతో లింక్ చేసిన మెంబర్ ఐడీల (అదే ఆధార్​తో లింక్ అయిన ఉన్నవి) మధ్య బదిలీలు. 
  • 2017 అక్టోబర్​ 1కి ముందు ఆధార్​తో లింక్​ చేసి ఉన్న, పేరు, పుట్టిన తేదీ, జెండర్​ ఒకే విధంగా ఉన్న అన్ని మెంబర్​ ఐడీల (ఒకే యూఏఎన్​తో లింక్​ చేసి ఉన్న) మధ్య బదిలీ. 
  • 2017 అక్టోబర్​ 1కి ముందు ఆధార్​తో లింక్​ చేసి ఉన్న, పేరు, పుట్టిన తేదీ, జెండర్​ ఒకే విధంగా ఉన్న అన్ని మెంబర్​ ఐడీల (వేరువేరు యూఏఎన్​లు లింక్​ చేసి ఉన్న) మధ్య బదిలీ.

యూఏఎన్ అంటే ఏమిటి?

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)కు కంట్రిబ్యూషన్ చేసే ప్రతి ఉద్యోగికి కేటాయించిన 12 అంకెల సంఖ్యను యూనివర్సల్ అకౌంట్ నంబర్ లేదా యూఏఎన్ అంటారు. ఈ నంబర్​ని ఈపీఎఫ్​ఓ జారీ చేస్తుంది.

ఈపీఎఫ్ఓ పోర్టల్​లో యూఏఎన్​ని ఆధార్​తో లింక్ చేయడం ఎలా?

స్టెప్ 1: ఈ-సేవ వెబ్​సైట్​కి వెళ్లి మీ యూఏఎన్ వివరాలను ఉపయోగించి మీ ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి.

స్టెప్ 2: ‘మేనేజ్’ మెనూ కింద “నో యువర్ కస్టమర్ (కేవైసీ)” ఆప్షన్ ఎంచుకోండి.

స్టెప్ 4: ఆధార్ ఆప్షన్​ని ఎంచుకుని మీ ఆధార్ సమాచారాన్ని ఉంచండి.

స్టెప్ 5: అన్ని వివరాలను సేవ్ చేయండి.

స్టెప్ 6: యూఐడీఏఐ డేటా ద్వారా ఆధార్ వివరాలు వెరిఫై అవుతాయి.

స్టెప్ 7: కేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీ ఆధార్ కార్డు మీ ఈపీఎఫ్ ఖాతాకు లింక్ అవుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link