Best Web Hosting Provider In India 2024
Crime Thriller Web Series: ఐశ్వర్య రాజేష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌కు సీక్వెల్ వస్తోంది – స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన సుడల్ వెబ్‌సిరీస్ సీజన్ 2 రిలీజ్ డేట్‌పై ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ సెకండ్ సీజన్ ఫిబ్రవరి మూడో వారంలో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన సుడల్ వెబ్‌సిరీస్‌కు సీక్వెల్ వస్తోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ సీజన్2 రిలీజ్ డేట్‌పై ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.సుడన్ సీజన్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఫిబ్రవరి నెలలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 21 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే సుడన్ సీజన్ 2 రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం.
పుష్కర్, గాయత్రి ద్వయం…
సుడన్ సీజన్ 2లో ఐశ్వర్య రాజేష్, కాథిర్, గౌరి జి కిషన్, మంజిమా మోహన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ వెబ్‌సిరీస్‌కు పుష్కర్, గాయత్రి క్రియేటర్స్‌గా వ్యవహరిస్తోండగా….సర్జున్, బ్రహ్మ దర్శకత్వం వహిస్తోన్నారు.
క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్‌గా…
సమకాలీన సమస్యతో క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్‌గా పుష్కర్, గాయత్రి సీజన్ 2 కథ రాసినట్లు సమాచారం. సీజన్‌కు వన్‌కు మించి ట్విస్ట్‌లు, టర్న్‌లతో సీక్వెల్ సాగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.సుడన్ సీజన్ 2 తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకే సారి స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు.
రాజమౌళి ప్రశసంలు…
2022లో రిలీజైన సుడల్ సీజన్ వన్ విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను అందుకున్నది.రాజమౌళి సహా పలు దిగ్గజ దర్శకుల మెప్పును ఈ వెబ్‌సిరీస్ పొందింది. చైల్డ్ అబ్యూసింగ్ సమస్యను చర్చిస్తూ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా సీజన్ వన్ రూపొందింది.
మర్డర్ మిస్టరీతో…
సుడన్ సీజన్ వన్‌లో ఐశ్వర్య రాజేష్, కాథిర్తో పాటు పార్తిబన్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు.సంబలూరు సిమెంట్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంలో కాలిపోతుంది.ఫ్యాక్టరీ ఓనర్ త్రిలోక్ పై కక్షతో వర్కర్ యూనియన్ ప్రెసిడెంట్ షణ్ముగం ఫ్యాక్టరీని తగులబెట్టాడని పోలీస్ ఆఫీసర్లు రెజీనా(శ్రియారెడ్డి) చక్రవర్తి(కథిర్) అనుమానిస్తారు. అదే టైమ్‌లో షణ్ముగం చిన్న కూతురు నీలా కనిపించకుండాపోతుంది.
చక్రవర్తి ఇన్వేస్టిగేషన్‌లో రెజీనా కొడుకు అతిశయం, నీలా ప్రేమించుకున్నారనే నిజం బయపడుతుంది.పెద్దలు తమ ప్రేమకు అంగీకరించరనే భయంతో ముంబై నీలా, అతిశయం ముంబై పారిపోయారని అందరూ అనుకుంటారు. అనూహ్యంగాఅదే ఊరిలో ఉన్న చెరువులో నీలా, అతిశయం శవాలు బయటపడతాయి.
వారు హత్యకు గురైనట్లు పోస్ట్ మార్టర్ రిపోర్ట్‌లో బయపడుతుంది. ఈ ప్రేమ జంటను హత్య చేసింది ఎవరు? నీలా గురించి ఆమె అక్క నందిని (ఐశ్వర్య రాజేష్) తెలుగుసుకున్న నిజాలేమిటి?హంతకుడు దొరికాడా? లేదా? అన్నదే సుడల్ సీజన్ వన్‌లో మేకర్స్ చూపించారు.
131 కోట్ల కలెక్షన్స్…
వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటించింది. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ ఐదు రోజుల్లోనే 131 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.