Best Web Hosting Provider In India 2024
RG Kar rape and murder case: కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సంజయ్ రాయ్ ని దోషిగా తేల్చిన కోర్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో కోల్ కతా లోని సీల్దా కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. నిందితుడు సంజయ్ రాయ్ ను దోషిగా నిర్ధారించింది. మహిళా డాక్టర్ రేప్, మర్డర్ ఘటన దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది.
పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలోని సీల్దా కోర్టు ఆగస్టు 9 న ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసులో జనవరి 18 శనివారం తీర్పు వెలువరించింది.
దోషిగా నిర్ధారణ
ఈ కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ ను కోర్టు దోషిగా నిర్ధారించింది. శిక్షను సోమవారం వెల్లడించనుంది. తీర్పు వెలువరించడానికి ముందు పోలీసులు నిందితుడు సంజయ్ రాయ్ ను కోర్టు హాళ్లోకి తీసుకువచ్చారు. నిందితుడిపై బీఎన్ఎస్ 103, బీఎన్ఎస్ 64, బీఎన్ఎస్ 66 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల ప్రకారం గరిష్టంగా మరణ శిక్ష విధించే అవకాశం ఉంది. ‘నిందితుడుఈ ఘోరమైన నేరం చేసినట్లు రుజువైంది’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అనంతరం సంజయ్ రాయ్ ను జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు.
నేను అమాయకుడిని..
అయితే, ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ తాను నిర్దోషినని మరోసారి కోర్టుకు విన్నవించారు. తాను ఆ సమయంలో రుద్రాక్ష మాల ధరించి ఉన్నానని, అలాంటి సమయంలో తాను ఆ దారుణం ఎలా చేస్తానని ప్రశ్నించారు. గతంలో కూడా సంజయ్ రాయ్ తాను నిర్దోషినని పలుమార్లు మీడియా సమక్షంలో కూడా తెలిపారు. ఈ సంచలన కేసులో తీర్పు రానుండడంతో కోర్టు వద్దకు భారీగా మీడియా, ప్రజలు చేరుకున్నారు. విచారణ ప్రారంభమైన 57 రోజుల తర్వాత అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి జస్టిస్ అనిర్బన్ దాస్ తీర్పు వెలువరించారు. నవంబర్ 12న ప్రారంభమైన ఇన్ కెమెరా విచారణ 50 మంది సాక్షులను విచారించింది. ఈ కేసు విచారణ జనవరి 9న ముగిసింది. విచారణలో నిందితుడు నేరం చేశాడని రుజువైనందున, అతడికి మరణ శిక్ష విధించాలని సీబీఐ కోర్టును కోరింది.
ఆసుపత్రిలోని సెమినార్ రూమ్ లో..
ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ రూమ్ లో ట్రైనీ డాక్టర్ మృతదేహం లభించిన మరుసటి రోజు ఆగస్టు 10 న కోల్కతా పోలీసులు సంజయ్ రాయ్ ను అరెస్టు చేశారు. మృతురాలి మృతదేహం వద్ద లభించిన బ్లూటూత్ ఇయర్ ఫోన్ సహాయంతో నిందితుడిని గుర్తించారు. మెడలో బ్లూటూత్ ఇయర్ ఫోన్ తో సెమినార్ హాల్ లోకి సంజయ్ రాయ్ ప్రవేశించడం సీసీటీవీ కెమెరా ఫుటేజీలో కనిపించింది.
తల్లిదండ్రుల అసంతృప్తి
కాగా, తన కూతురి దారుణ హత్యాచారం కేసును సీబీఐ దర్యాప్తు చేసిన తీరుపై బాధితురాలి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఏమీ చేయలేదని ఆరోపించారు. అయితే ఏ శిక్ష వేయాలో కోర్టు నిర్ణయిస్తుందని ఆ తండ్రి చెప్పారు. నేరం జరిగిన వెంటనే వ్యవహరించిన పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై ఆర్జీ కార్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ అధికారి అభిజిత్ మొండల్ ను కూడా సిబిఐ అరెస్టు చేసింది. సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఘోష్ తన పదవీకాలంలో ఆర్థిక అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ జరుపుతోంది. 90 రోజుల ముందు వారిపై చార్జిషీట్ నమోదు చేయడంలో ఏజెన్సీ విఫలం కావడంతో ఘోష్, మొండల్ బెయిల్ పై విడుదలయ్యారు.
దేశ వ్యాప్త ఆందోళనలు
కోల్ కతా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ నేరంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోల్ కతా వీధుల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కోల్కతాకు చెందిన ప్రముఖ క్లబ్ లు ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్, మహమ్మదన్ స్పోర్టింగ్ కూడా వీధుల్లోకి వచ్చాయి.
Best Web Hosting Provider In India 2024
Source link