Best Web Hosting Provider In India 2024
Chicken Sweetcorn Soup: చల్లటి వాతావరణంలో వేడివేడి సూప్ తాగడం అంటే మీకుఇష్టమా? చికెన్ స్వీట్ కార్న్ సూప్ ట్రై చేయండి
Chicken Sweetcorn Soup: చల్లటి వాతావరణానికి వేడివేడిగా ఏమైనా తాగే అలవాటు మీకు ఉందా. టీ కాకుండా సూప్స్ అయితే బాగుండు అనుకుంటున్నారా? అయితే చికెన్ స్వీట్ కార్న్ సూప్ ట్రై చేయండి. రుచికరమైన ఈ రెసిపీ తయారు చేయడం కూడా చాలా ఈజీ.
చికెన్ స్వీట్ కార్న్ సూప్ ట్రై చేయండి
మీరు సూప్ ప్రియులైతే, శీతాకాలం మీకు పండుగే. ఈ సీజన్‌లో చాలా రకాల కూరకాయలు లభిస్తాయి, కాబట్టి మీరు సూప్‌లతో చాలా ప్రయోగాలు చేయవచ్చు. చల్లటి వాతావరణంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో, నైట్ డిన్నర్ టైంలో ఆహరా పదార్థాల కన్నా సూప్ తాగడానికే ఇష్టపడే వారి కోసమే ఈ చికెన్ స్వీట్ కార్న్ సూప్. ఎంతో రుచికరమైన ఈ సూప్ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఆలస్యం చేయకుండా చికెన్ స్వీట్ కార్న్ సూప్ తయారీ విధానం గురించి తెలుసుకుందామా.
చికెన్ స్వీట్ కార్న్ సూప్
కావలసిన పదార్థాలు:
- చికెన్ బ్రెస్ట్స్: 100 గ్రాములు
- వెల్లుల్లి: 4 రెబ్బలు
- అల్లం: 1 ముక్క
- కొత్తమీర: 4 స్పూన్లు
- మిరియాల పొడి: 1 స్పూన్
- కార్న్ ఫ్లోర్: 2 స్పూన్లు
- గుడ్డు: 1
- స్వీట్ కార్న్: 1/2 కప్
- సన్నగా తరిగిన ఉల్లిపాయలు: 2 స్పూన్లు
- ఉప్పు: రుచికి సరిపడా
చికెన్ స్వీట్ కార్న్ సూప్ తయారీ విధానం:
- ఒక పాన్‌లో రెండు కప్పుల నీరు తీసుకుని వేడి చేయండి.
- నీరు వేడెక్కిన తర్వాత అందులో శుభ్రంగా కడిగిపెట్టకున్న చికెన్ వేసి ఉడికించండి.
- చికెన్ ఉడుకుతుండగానే సన్నగా తరిగిన అల్లం-వెల్లుల్లి, తరమిన కొత్తమీర వేసి బాగా మరిగించండి.
- దాదాపు 15 నిమిషాలు చికెన్ ఉడకించిన తర్వాత నీటిలో ఏర్పడే నురుగును తీసివేయండి.
- ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, చికెన్ ముక్కలు, చికెన్ ఉడికించిన నీటిని వేరు చేయండి.
- చికెన్ స్టాక్ అంటే చికెన్ ఉడికించిన నీటిని మరొక పాన్‌లో పోసి తక్కువ వేడి మీద ఉడకబెట్టండి.
- దీంట్లో ఉడికించిన చికెన్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి.
- తరువాత దీంట్లోనే స్వీట్ కార్న్, ఉల్లిపాయలు, కార్న్ ఫ్లోర్‌ను వేసి బాగా కలపండి.
- ఇదిలా ఉడుకుతుందడగానే ఒక గిన్నెలో గుడ్డును పగలగొట్టి బాగా కలపండి.
- సూప్ చిక్కబడటం ప్రారంభించినప్పుడు, గుడ్డు మిశ్రమాన్ని దాంట్లో వేసి, కలుపుతూ ఉడికించండి.
- చివర్లో ఉప్పు, మిరియాల పొడి వేసి కలపండి.
అంతే చికెన్ స్వీట్ కార్న్ సూప్ రెడి అయినట్టే.
చలికాలం, వర్షాకాలాల్లో వేడి వేడిగాఈ సూప్ తయారు చేసి పెట్టారంటే వావ్ అనుకుంటూ తాగేస్తారు. దీన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలోనూ, రాాత్రి డిన్నర్ సమయంలోనూ తాగచ్చు.