Best Web Hosting Provider In India 2024
Sonakshi’s Beauty Secret: తన బ్యూటీ సీక్రెట్స్ బయటపెట్టిన సోనాక్షి సిన్హా.. వారానికి మూడుసార్లు కొబ్బరినూనె వాడుతుందట!
Sonakshi’s Beauty Secret: ఫేస్ ఆయిల్స్ నుంచి ఆర్గానిక్ బ్యూటీ టిప్స్ వరకు తన స్కిన్ కేర్ సీక్రెట్స్‌ని షేర్ చేసింది ప్రముఖ నటి సోనాక్షి సిన్హా. నలభైల్లోనూ ఇరవై ఏళ్లలా కనిపించాలంటే ఈ సరళమైన, ప్రభావవంతమైన బ్యూటీ టిప్స్‌ను మీరూ పాటించేయండి.
నలభైల్లోనూ ఇరవై ఏళ్ల వయసు వారిలా కనిపించడం అంత సులువుగా జరిగేది మాత్రం కాదు. ఇది సెలబ్రిటీలకే సాధ్యం అవుతుందని కూడా చెప్పచ్చు. అయితే చాలా మంది సెలబ్రిటీలు వాళ్ల స్కిన్ కేర్ రొటిన్ గురించి, బ్యూటీ సీక్రెట్స్ గురించి బయట పెట్టరు. కానీ హీరామండి బ్యూటీ బాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ సొనాక్షీ సిన్హా తన బ్యూటీ సీక్రెట్లన్నింటినీ బయట పెట్టేసింది. తన ముప్పై ఐదేళ్లు దాటినా కూడా యవ్వనంగా, మెరిసే చర్మం వెనకున్న తన దినచర్యను ఓ వీడియోలో చెబుతూ యూట్యూబ్ లో పోస్ట్ చేసింది.
అందరు హీరోయిన్లలాగే సోనాక్షి సిన్హా కూడా బలమైన చర్మ సంరక్షణ దినచర్యను గట్టిగా నమ్ముతుంది. షూటింగ్ విరామాల్లో, తన భర్త జహీర్ ఇక్బాల్‌తో కలిసి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఈ నటి తన నియమావళికి కట్టుబడి ఉండటానికి సమయం కేటాయిస్తుంది. తాజాగా ఈ 37 ఏళ్ల నటి యూట్యూబ్లో ఓ చిన్న వీడియోను షేర్ చేసి తన స్కిన్ కేర్ రొటీన్ గురించి చెబుతూ అభిమానులను ఉర్రూతలూగించింది. అందులోని కొన్ని బ్యూటీ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సోనాక్షి తన స్కిన్ కేర్ రొటీన్ లో కొబ్బరి నూనెకే ప్రాధాన్యత..
సోనాక్షి ఆ వీడియోలో చెప్పిన దాని ప్రకారం.. చర్మానికి పోషణ ఇవ్వడానికి ఆమె ఎక్కువగా ఫేస్ ఆయిల్ అప్లై చేస్తుందట. ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హ్యాక్ సూపర్ డ్రై స్కిన్ ఉన్నవారికి గేమ్ ఛేంజర్. “ప్రతి ఒక్కరూ నా చర్మ సంరక్షణ దినచర్య గురించి అడుగుతున్నారు కాబట్టి, ఏదైనా ఫేస్ ఆయిల్తో వారానికి మూడుసార్లు ప్రయత్నించండి. స్వచ్ఛమైన కొబ్బరినూనె కూడా చక్కగా చేస్తుంది’ అని ఆమె వీడియోలో పేర్కొన్నారు.
“నాకు సూపర్ డ్రై స్కిన్ ఉంది, కాబట్టి ఇది నాకు పనిచేస్తుంది. మీకు జిడ్డుగల లేదా కలగలినిన చర్మం ఉంటే, ఇది ఉత్తమ విధానం కాకపోవచ్చు. మీరు ఎల్లప్పుడూ మీ చర్మ రకానికి సరిపోయే క్రీములు, నూనెలను ఎంచుకుని మీరు ఉపయోగించాలి”అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
ఫేస్ ఆయిల్ ఉపయోగాలు:
ముఖ నూనెలు చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేయడానికి, చర్మాకృతిని పెంచడానికి సహాయపడతాయి. సోనాక్షీ పోస్ట్ చేసిన వీడియోలో.. ఫేస్ ఆయిల్‌ను ముఖం, మెడ రెండింటినీ లక్ష్యంగా చేసుకుని మసాజ్ టెక్నిక్స్ ఫాలో అవుతోంది. ఆమె ఫేస్ యోగా కదలికలను ఉపయోగిస్తుంది.
ఇవి చర్మానికి సున్నితమైన, దృఢమైన ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ విధానం రక్త ప్రసరణను మెరుగుపరుస్తూ, విశ్రాంతిని ప్రోత్సహిస్తూ ముఖాన్ని మెరిసేలా, ఆరోగ్యంగా తయారుచేయడానికి సహాయపడుతుంది. చర్మానికి పునరుత్తేజం అనుభూతిని కలిగిస్తుంది.
సోనాక్షి సిన్హా ఇతర బ్యూటీ సీక్రెట్స్..
గతంలో ట్వీక్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనాక్షి తన స్కిన్ కేర్ రొటీన్‌ను పంచుకుంది,
- “నేను అలోవెరా జెల్‌ను జోజోబా, బాదం నూనెతో కలిపి మాయిశ్చరైజ్ చేసి ఉపయోగిస్తాను. ఇది చర్మానికి చక్కటి ఓదార్పును ఇచ్చి ఆరోగ్యవంతంగా తయారు చేస్తుంది. యవ్వనంగా కనిపించేందుకు దీనిని నేను క్రమం తప్పకుండా ముఖానికి అప్లై చేస్తుంటాను.
సోనాక్షీ తన తల్లి చెప్పిన బ్యూటీ సీక్రెట్స్ గురించి మాట్లాడుతూ.. ‘మా అమ్మ నాకు చాలా ఆర్గానిక్ బ్యూటీ మాస్క్‌లు, పేస్ట్‌లను పరిచయం చేసింది.
- చర్మం చాలా పొడిగా అనిపించినప్పుడు నెయ్యి లేదా కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చని మా అమ్మ ఎల్లప్పుడూ నాకు చెబుతూ ఉండేది.
- ముల్తానీ మిట్టితో కూడా మా అమ్మ అద్భుతమైన పేస్ట్‌ను కూడా తయారు చేస్తుంది. దీన్ని తరచూ నేను ఉపయోగిస్తుంటాను.
- తాజా కలబంద ఆకును తీసుకుని నేరుగా ముఖంపై రుద్దడం మా అమ్మకు తనకు ఇష్టమైన ట్రిక్స్ లో ఒకటని” కూడా సోనాక్షి తెలిపింది.