Best Web Hosting Provider In India 2024
Brahmamudi: బ్రహ్మముడి- రుద్రాణికి అసలు నిజం చెప్పిన అనామిక- ఇంట్లో అల్లర్లు, రాక్షస ఆనందం- కావ్యకు నగలు ఇచ్చిన అమ్మమ్మ
Brahmamudi Serial Latest Episode: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్‌లో కావ్యకు తన నగలు మొత్తం ఇస్తుంది ఇందిరాదేవి. నా దగ్గర ఇంకా దాయాలని చూడకు. ఈ అమ్మమ్మ నీకెప్పుడు తోడుగా ఉంటుందని ఇస్తుంది ఇందిరాదేవి. మరోవైపు రుద్రాణికి దుగ్గిరాల ఇంటి అప్పులు, షూరిటీ గురించి మొత్తం నిజం చెప్పేస్తుంది అనామిక.
Brahma Mudi Serial Latest Episode: బ్రహ్మముడి సీరియల్ తాజా ఎపిసోడ్‌లో నగలు తాకట్టు పెట్టే అంత వచ్చిన దుస్థితి గురించి కావ్యను అపర్ణ అడుగుతుంది. అయినా కావ్య నిజం చెప్పదు. దాటేస్తుంది. దాంతో అపర్ణకు మరింత కోపం వస్తుంది. నా మాటకు విలువ ఇవ్వలేని వాళ్లతో మాట్లాడలేను, నాతో మాట్లాడే ప్రయత్నం చేయకు అని గట్టిగా చెప్పేసి వెళ్లిపోతుంది అపర్ణ.
కళ్లకు కట్టినట్లు చూపించిన కావ్య
అదంతా చూసిన ఇందిరాదేవి అపర్ణ ఇంత గట్టిగా అడిగిన కావ్య చెప్పడంలేదంటే పెద్ద సమస్యే వచ్చి ఉంటుంది. అదేంటో ఇంటి పెద్దగా తెలుసోకపోతే నాదే తప్పు అవుతుందని ఇందిరాదేవి అనుకుంటుంది. తర్వాత సీతారామయ్య షూరిటీ గురించి కావ్య రాజ్ ఆలోచిస్తారు. జరిగింది రాజ్ చెప్పేద్దామని, ఇదే పరిష్కారమని అంటాడు. దాంతో అలా చెబితే ఇంట్లో జరిగిదేంటో, రుద్రాణి, ధాన్యలక్ష్మీ ఏం వాగుతారో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది కావ్య.
నగలు ఇచ్చిన ఇందిరాదేవి
అదంతా విన్న రాజ్ తర్వాత నానమ్మకు హార్ట్ ఎటాక్ వస్తుందని భయపడిపోతాడు. ఇదివరకు కూడా అలాగే భయపడిపోయానని చెబుతాడు. దీని గురించి ఏం చేద్దామా అని రాజ్, కావ్య ఆలోచిస్తూ ఉంటారు. ఆ నందగోపాల్ గాడిని పట్టుకోవడమే సరైన మార్గం అని రాజ్ అనుకుంటాడు. మరుసటి రోజు కావ్యతో ఇందిరాదేవి మాట్లాడుతుంది. ఇదిగో తీసుకో అని తన దగ్గర ఉన్న నగలు అన్ని ఇస్తుంది. ఏంటీ అమ్మమ్మ గారు ఇది అని కావ్య అడుగుతుంది.
అప్పులు చేస్తున్నారని
నా దగ్గర ఇంకా దాచాలాని చూడకు అని ఇందిరాదేవి అంటే.. కావ్య షాక్ అవుతుంది. అమ్మమ్మగా నేను నీకు తోడుగా ఉంటాను. తీసుకో అమ్మా అని కావ్యకు నగలు ఇస్తుంది ఇందిరాదేవి. దీన్ని బట్టి సీతారామయ్య వంద కోట్ల షూరిటీ, బ్యాంక్ వాళ్ల జప్తు గురించిన నిజం ఇందిరాదేవికి తెలిసిపోయినట్లు అర్థం అవుతోంది. మరోవైపు సామంత్, అనామిక మాట్లాడుకుంటారు. వాళ్లు ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నారన్న విషయం కూడా లీక్ చేసేసి ఆ రచ్చని లైవ్ చూసేద్దాం అని అనామిక రాక్షస ఆనందంతో అంటుంది.
పోయినసారిలా బెడిసికొట్టదుగా
ఎలా చేద్దాం అని సామంత్ అడిగితే.. దానికి నా దగ్గర ప్లాన్ ఉందని చెబుతుంది అనామిక. ఏముందని సామంత్ అడిగితే.. ఆ ఇంట్లో మన మనిషి రుద్రాణి ఆంటీ ఉందిగా. తనకు జరిగింది చెబితే చాలు మిగతాదంతా తనే చూసుకుంటుంది. రచ్చ రచ్చ చేసేసి తనే దుగ్గిరాల ఇంటి పరువు రోడ్డున పడేస్తుందని అనామిక అంటుంది. దాంతో పోయినా సారిలా ఇది కూడా బెడిసికొట్టదుగా. అనుకున్నట్లే జరుగుతుంది కదా అని సామంత్ డౌట్ పడతాడు.
అల్లర్లు సృష్టిస్తారో
అలా ప్రతిసారి జరగదు. ఈసారి మాత్రం మనమే గెలుస్తాం అని అనామిక నమ్మకంగా చెబుతుంది. తర్వాత రుద్రాణికి కాల్ చేస్తుంది అనామిక. రుద్రాణి లిఫ్ట్ చేస్తుంది. ఆ ఇంటిని షేక్ చేసే ఒక బిగ్ న్యూస్ నా దగ్గర ఉంది. దాన్ని మీకు పంపిస్తాను. మీరు దాన్ని ఆయుధంలా వాడుకుని ఇంట్లో అల్లర్లు సృష్టిస్తారో.. ఆస్తే దక్కించుకుంటారో, ఇంకేం చేసుకుంటారో అది మీ ఇష్టం అని సంతోషంగా చెబుతుంది అనామిక. దాంతో తెగ సంబరపడిపోతుంది రుద్రాణి.
రుద్రాణి మాటలు విన్న రాజ్, కావ్య
దీంతో ఈ ఇంటికి నేనేంటో చూపిస్తాను అని అనామికతో రుద్రాణి చెబుతుంది. కాల్ కట్ చేసి సంతోషంగా వెనక్కి తిరిగి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆలోచనలో పడిపోతుంది రుద్రాణి. తర్వాత కావ్య, రాజ్‌ను చూపిస్తారు. రుద్రాణి మాట్లాడిన మాటలను రాజ్, కావ్య విన్నట్లుగా చూపిస్తారు. అలా బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.