Best Web Hosting Provider In India 2024
Successful People Habits: లైఫ్‌లో సక్సెస్ అయిన వారు తప్పకుండా పాటించే 21 అలవాట్లు మీకు తెలుసా!
Successful People Habits: పుస్తకాల్లో, పెద్దల మాటల్లో చాలా వరకూ మనం వినే మాటల్లో ఉండేది సక్సెస్ అయిన వారి అలవాట్లే. తరచూ ఈ విషయాలను మన ముందు ప్రస్తావించేది వాటిని మనం ప్రేరణగా తీసుకుని, అదే విధంగా కెరీర్‌లో సక్సెస్ దిశగా సాగుతామని కావొచ్చు. ఒకవేళ మీకు అలా చెప్పేవాళ్లు లేకపోతే ఇక్కడ చదవండి.
చతికిలబడి కూర్చుంటే, కాలం ఆగదు. మన ఎదుగుదలే ఆగిపోతుంది. ఏదో ఒక పని చేసుకుంటూ పోతేనే మనుగడ సాధ్యమవుతుంది. ఆ చేసే పనే కాస్త అర్థవంతంగా ఉంటే, ఆ పని చేయడానికి మనం పాటించే అలవాట్లు ఉత్తమమైనవే అయితే అవే మనల్ని పైకి తీసుకొస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ అలవాట్లేంటో తెలుసుకోవాలి. ఎక్కడ తెలుస్తాయని అనుకుంటున్నారా.. రండి కెరీర్లో సక్సెస్ సాధించిన వారు డైలీ లైఫ్ లో ఏయే విధంగా వ్యవహరించి అలా విజయం సాధించారో ఇక్కడ తెలుసుకుందాం.
1. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్లండి.
మీకు వచ్చే అవకాశాలను దాటుకొని, ఛాలెంజెస్ ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండండి. మీకు తెలియని కొత్త వాతావరణమైనా సరే, కంఫర్ట్ లేకపోయినా సరే సక్సెస్ సాధించడమే లక్ష్యంగా శ్రమించండి.
2. అత్యుత్తమంగా చేయడమే లక్ష్యంగా పెట్టుకోండి
మీ హద్దులను చెరిపేసి మీరు అనుకున్న పనిని అత్యుత్తమంగా సాధించగలిగేంత వరకూ, అత్యుత్తమ ఫలితాలు రాబట్టేంత వరకూ శ్రమించండి.
3. తప్పుల నుంచి నేర్చుకోండి
తప్పులు చేయడం సహజమే. కానీ, వాటి నుంచి నేర్చుకోవడం మంచిది, గతాన్ని పట్టుకుని వేలాడకుండా కొత్తది నేర్చుకునేందుకు కెరీర్లో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించండి.
4. సంతృప్తిగా ఉండండి
బాహ్య ప్రశంసలు, సమాజంలో ఖ్యాతి వంటి భ్రమలకు లోనుకాకుండా, ఆంతరంగిక ఆనందం, స్వయంవికాసంపై ఎక్కువ దృష్టి పెట్టండి. ఈ విధంగా, మీరు చేయగలిగితే ప్రాధాన్యత మరింత పెరుగుతూ ఉంటుంది.
5. ఆశావాదిగా ఉండండి
పనిలో, జీవితంలో కష్టాలు వస్తాయని, సమస్యలు ఉంటాయని అర్థం చేసుకోండి. ఈ విధంగా ఆలోచిస్తూ నిర్ణయాత్మకంగా, దీర్ఘకాలికంగా ఆశావాదిగా ఉండండి.
6. లోతైన పనికి ప్రాధాన్యం ఇవ్వండి
సమస్యలను ఒక్కొక్కటిగా చేసి పరిశీలించండి. అన్ని పనులను ఒకేసారి చేయాలని ప్రయత్నించి ఒత్తిడిగా ఫీల్ అవకండి. ఈ విధంగా చేయడం వల్ల ఉత్పాదకతను పెరుగుతాయి.
7. సంబంధాలు, అనుబంధాలకు విలువ ఇవ్వండి
మీ సంబంధాలకు, అనుబంధాలకు మీరు ఇస్తున్న ప్రాధాన్యతను పెంచండి. మీ వెంట ఎంత మంది ఎక్కువగా ఉంటే, మీరు మరింత ప్రభావవంతంగా ఉంటారు.
8. ఆటంకాలను దాటండి
మీకు ఉత్తమమైన నేర్చుకునే అవకాశం ఉండే మార్గాన్ని ఎంపిక చేసుకోండి. అది కష్టంగా ఉన్నా. మీరు దాని ఫలితంగా ఎదిగే అవకాశం ఉంటుంది.
9. నిజాయితీగా ఉండండి
అత్యంత విజయవంతమైన వ్యక్తులు నిజాయితీగా ఉంటారు. వారు ఏమి చేస్తారో, ఏం అనుకుంటున్నారో అనే విషయాలను నిజంగా చేస్తున్నట్లుగా ప్రదర్శిస్తారు.
10. ఆరోగ్యాన్ని చూసుకోండి
నిరంతరంగా విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించండి, తద్వారా మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. అత్యుత్తమ సామర్థ్యంతో పనిచేయగలుగుతారు.
11. తాత్కాలిక నిర్ణయాలు తీసుకోకండి
సున్నితమైన పరిస్థితులలో కూడా వెంటనే నిర్ణయాలు తీసుకోవడాన్ని మానుకోండి.
12. కృతజ్ఞత, దాతృత్వం సాధించండి
మీ విజయానికి కృతజ్ఞత చెప్పండి. ఇతరులకు సహాయం చేసే అవకాశం వస్తే ఎప్పుడూ వెనకాడకండి.
13. పట్టుదల చూపండి
మీరు విఫలమైపోయినప్పటికీ విజయాన్ని సాధించేందుకు ప్రయత్నాన్ని కొనసాగించండి. ఎందుకంటే ధైర్యం, పట్టుదల అనేవి దీర్ఘకాలిక విజయానికి కీలకాలు.
14. అందరినీ గౌరవించండి
మీ పనిలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ప్రతి ఒక్కరు గౌరవానికి హక్కుదారులు. మీరు కూడా గౌరవానికి అర్హులు. ఇతరులను గౌరవించండి. వారు కూడా మీకు గౌరవం చూపిస్తారు.
15. పని పూర్తి చేసే పద్దతిపై దృష్టి పెట్టండి
మీరు మీ లక్ష్యాన్ని సాధించడం కంటే, మీ కార్యాలను సాధించే విధానం పట్ల శ్రద్ధ పెట్టండి. ఇలా చేయడం వల్ల మీరు మరింత ఆనందంగా, సంతృప్తిగా ఉంటారు.
16. వివిధ కోణాలను వెతకండి
మీ అభిప్రాయాలకు మించి భిన్నమైన దృష్టికోణాలను ఎప్పుడూ అన్వేషించండి. మనందరికీ అన్నీ తెలిసినట్లుగా భావించకూడదు. అలాంటి ప్రయత్నం కూడా చేయకూడదు.
17. సృజనాత్మకంగా ఉండండి
ఎప్పుడూ కొత్త విషయాలను అన్వేషించడానికి, ప్రయత్నించడానికి సరికొత్త మార్గాలను చూడండి. సాధారణంగా ఉండటానికి ఒప్పుకోకండి.
18. బాధ్యత తీసుకోండి
ఎక్కువసేపు ఎదురుచూడకుండా మీరు చేసిన పనులకు, మంచి లేదా చెడు, బాధ్యత తీసుకోండి.
19. ఇతరుల ప్రయాణంలో మద్దతు ఇవ్వండి
జీవితంలో, వ్యాపారంలో ప్రయాణం ఎప్పుడూ సులభం కాదు, కాబట్టి ఇతరులకు మద్దతు ఇచ్చే అలవాటును పెంచండి. మీరు ఈ ప్రక్రియలో నమ్మకాన్ని, గాఢమైన సంబంధాలను నిర్మించుకోగలుగుతారు.
20. జీవితకాల అభ్యాసకుడిగా ఉండండి
నిత్యం నేర్చుకోవడానికి, అభివృద్ధి కనబరచడానికి ఆసక్తి కనబరచండి.
21. జ్ఞానంతో, ఆత్మవిశ్వాసంతో జీవించండి
మీరు ఎంచుకున్న పనిని పూర్తి మనస్సుతో, అంకితభావంతో చేయండి. పూర్తిగా మీ మనస్సు పెట్టి పని చేయడం అలవాటు చేసుకోండి.