Best Web Hosting Provider In India 2024
నోటి దుర్వాసన, నల్లటి మచ్చలు ఆ ప్రాణాంతక రోగానికి సంకేతాలు, నిర్లక్ష్యం చేయకండి
కాలేయంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు కొన్ని రకాల లక్షణాల ద్వారా ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు. రోజువారీ సాధారణ పనులు చేసేందుకు కాలేయం పనితీరు తగ్గిపోతాయి. ఫ్యాటీ లివర్ వల్ల అనేక సమస్యలు వస్తాయి.
మనశరీరంలో ప్రధానమైన అవయవం కాలేయం. ఇది ఆరోగ్యంగా ఉంటేనే మనం సాధారణంగా జీవించగలం. లేకుంటే ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. ఎక్కువ మంది ఇప్పుడు వేధిస్తున్న సమస్యల్లో ఫ్యాటీ లివర్ డిసీజ్ ఒకటి. ఇది ఆల్కహాల్ తాగే వారికే కాదు, తాగని వారికి కూడా వచ్చేస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫ్యాటీ లివర్ లక్షణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాలేయంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు కనిపించే సంకేతాల గురించి ఇచ్చాము.
కాలేయం బరువు కంటే 5 శాతం ఎక్కువ కొవ్వు శరీరంలో పేరుకుపోయినప్పుడు ఫ్యాటీ లివర్ సమస్య వచ్చిందని చెబుతారు. ఇది చాలా తీవ్రమైన సమస్యగానే చెప్పుకోవాలి. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం అనేది ఒకేసారి అకస్మాత్తుగా జరిగేది కాదు, క్రమంగా కొన్నేళ్ల పాటూ సాగుతుంది. అదనపు కొవ్వు చేరడం వల్ల కాలేయం ఉబ్బుతుంది. దీని వల్ల లివర్ క్యాన్సర్, లివర్ సిర్రోసిస్ సమస్య వస్తుంది. అయితే కాలేయానికి సంబంధించిన సమస్యలను సకాలంలో గుర్తిస్తే సరైన ఆహారం, మందులతో వ్యాయామం చేయడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించుకోవచ్చు. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ శరీరంలో కొన్ని లక్షణాలను ప్రదర్శిస్తుంది. అవసరమైన వారిని గుర్తించి చికిత్స అందించాలి.
ఫ్యాటీ లివర్ సంకేతాలు
ఆహారం తిన్న తర్వాత పొట్ట ఉబ్బరం సమస్య కొన్ని రోజులు లేదా నెలల పాటూ కొనసాగితే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అది కాలేయం సరిగా పనిచేయట్లేదని సూచిస్తుంది. మీ కాలేయం కొవ్వును ప్రాసెస్ చేయడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. శరీరంలోని విషాలను కూడా తొలగించలేకపోతుంది. వాస్తవానికి, కాలేయం పని రక్తం నుండి విషాన్ని ఫిల్టర్ చేయడం. రక్తంలోకి వెళ్లే విషాన్ని కాలేయం వేరు చేయలేనప్పుడు, ఉబ్బరం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.
వింత వాసన
కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు, అది మందకొడిగా పనిచేయడం మొదలవుతుంది. సరిగా పనిచేయని కాలేయం చర్మం ద్వారా విషాన్ని తొలగించడానికి పదే పదే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. దీనివల్ల చర్మం వింత వాసన రావడం మొదలవుతుంది. ఇది కాలేయసమస్య వచ్చిందని చెప్పే సంకేతం.
నోటి దుర్వాసన
కొందరు మాట్లాడుతుంటే నోటి నుంచి దుర్వాసన వస్తుంది. నోటి వాసన మీ పొట్టతో అనుబంధాన్ని కలిగి ఉంటుంది. కడుపులోని ఆహారం సరిగా జీర్ణం కానప్పుడు, కాలేయం పనితీరు సరిగా లేకపోతే ఇలా నోటి నుంచి దుర్వాసన వచ్చే సమస్య ఉంటుంది. కాబట్టి మీకు నోటి దుర్వాసన ఎందుకు వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
చర్మంపై నల్లటి మచ్చలు
చర్మం నల్లటి మచ్చలు ఏర్పడుతాయి. అండర్ ఆర్మ్స్‌లో, మెడ ప్రాంతంలో నల్ల మచ్చలు వస్తాయి. కాలేయంలో కొవ్వు అధికంగా ఉండటం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అందువల్ల బ్లడ్ షుగర్ నార్మల్ గా ఉండి డార్క్ స్కిన్ ప్యాచెస్ ఏర్పడుతుంటే కాలేయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతోందని అర్థం.
కాలేయంలో కొవ్వు ఎక్కువగా ఉన్నప్పుడు, అది సరిగా పనిచేయదు. రక్తం నుండి విషాన్ని తొలగించలేదు. దీనివల్ల చర్మం దగ్గర రక్తప్రవాహంలో టాక్సిన్స్ ఏర్పడటం ప్రారంభమవుతుంది. చర్మం దురదగా మారుతుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్