Best Web Hosting Provider In India 2024
Men Expectations in Wife: పురుషులు ఎలాంటి భార్య కావాలని కోరుకుంటారో తెలుసా?సైకాలజీ చెబుతున్న విషయాలివే!
Men Expectations in Wife: అమ్మాయిలంతా అబ్బాయిల కళ్లకు చూడటానికి బాగానే అనిపిస్తారు. కానీ, వారిలో కొద్దిమంది మాత్రమే పెళ్లి చేసేసుకోవాలని అనుకుంటారు. ఇందుకు కారణమేంటో తెలుసా? తాము పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిల్లో ఎలాంటి లక్షణాలు ఉండాలని అబ్బాయిలు కోరుకుంటారో తెలుసా?
వాస్తవానికి అందం అంటే కేవలం చూడటానికి చక్కగా అనిపించడం మాత్రమే కాదు. పెళ్లి చేసుకోవాలని అనుకునే మగాళ్లు మహిళల్లో కొన్ని ప్రవర్తనల ఆధారంగా తమకు సూట్ అవుతారో లేదా అని అంచనా వేసుకుంటారు. ‘ఆడదాన్ని అర్థం చేసుకోవడం దేవుడి తరం కూడా కాదు’ అనేది కేవలం సామెత వరకూ మాత్రమే. మగవాళ్లు మహిళలను అర్థం చేసుకునే తమకు అర్థాంగిగా సూట్ అవుతుందా లేదా అని ఆలోచించుకుంటారట. ఆ లక్షణాలేంటో చూసేద్దామా..
తెలివితేటలు:
ఎక్కువ టాలెంట్, ఉన్నత వ్యక్తిత్వంతో ఉన్న మహిళలే త్వరగా ఆకర్షణకు గురవుతారు. చాలా వరకూ సాధారణ మహిళ స్థాయి నుంచి ప్రయోజకురాలిగా మారిన తర్వాత వారిలో ప్రత్యేక ఆకర్షణ కనపడుతుంది. దానిని మగాళ్లు ఇష్టపడతారు.
దయ:
చాలా మంది పురుషులు ఎప్పటికీ శ్రద్ధగా, దయతో వ్యవహరించే మహిళలను ఇష్టపడతారు. ఇది సహజంగా ఉంటూ, కేవలం మనశ్శాంతిని పెంచేది మాత్రమే కాదు. బంధాలపై నమ్మకాన్ని కూడా పెంచుతుంది. సానుభూతి, దయతో వ్యవహరించే వ్యక్తులు పురుషులను త్వరగా ఆకర్షిస్తారు.
నిజాయితీ:
ఇది చాలా ముఖ్యమైన లక్షణం. చాలా అధ్యయనాల్లో తెలిపినట్లుగా, నిజాయితీతో వ్యవహరించే మహిళలు, పురుషులలో నమ్మకం, ధైర్యంతో కూడిన భావనను కలుగజేస్తారు. అది సంబంధాలను అద్భుతంగా పెంచగలిగే మూలస్థంభంగా భావించాలి.
ఆత్మాభిమానం:
మహిళలను తమతో సమానంగా చూసుకునేందుకు, తమ పక్కన ఉండేందుకు సరైన అర్హత ఉండాలని భావిస్తారు. అలా ఉండేందుకు ప్రధాన లక్షణం ఏంటంటే, ఆత్మాభిమానం. ఆత్మాభిమానంతో వ్యవహరించే మహిళలను అనేక మంది ఉన్నత స్థాయి పురుషులు కోరుకుంటారు. అటువంటి మహిళలు ఉన్నత లక్ష్యాలు సాధించేందుకు ప్రయత్నిస్తూ, జీవితం పట్ల అంకితభావంతో ఉంటారని భావిస్తారు.
హాస్యం:
మహిళల్లో హాస్యం, చతురత లక్షణాలను పురుషులు బాగా ఇష్టపడతారు. ఎటువంటి ఒత్తిడిలో ఉన్నా కాసేపు మాట్లాడటం వల్ల ఉపశమనం కలుగుతుందనే నమ్మకంతో అభిమానం చూపిస్తారు. నవ్వించే, లేదా మంచి జోక్ చెప్పగల వ్యక్తులకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు.
స్నేహభావం:
స్నేహభావంతోనూ, సజావుగా ఉండే లక్షణాన్ని పురుషులు బాగా ఇష్టపడతారు. స్నేహపూర్వకంగా ఉంటే, అది కొత్త బంధాలను తెచ్చిపెడుతుంది. పురుషులు సున్నితమైన, మంచి వ్యక్తిత్వంతో ఉన్న మహిళలను ఎక్కువగా ఇష్టపడతారు.
ఆశాభావం:
పురుషులు గమనించే ప్రధాన లక్షణం ఆశాభావం. ఒక మహిళ మానసికంగా, ధైర్యంగా పోరాడగలిగే లక్షణం ఉన్న వారంటే పురుషులు అభిమానం చూపిస్తారు. ఎప్పటికీ ఓటమి ఒప్పుకోని మహిళలంటే వారిని తమ జీవితంలోకి భాగస్వామిగా ఆహ్వానించేందుకు సుముఖత చూపిస్తారు.
ప్రశాంతత:
పురుషులు ఒక మహిళలో ప్రశాంతతను గుర్తిస్తారు. అది అనేక సందర్భాలలో శాంతియుతమైన ధోరణిని కలిగి ఉండటం, స్థిరమైన భావాన్ని వ్యక్తీకరించడానికి కారణమవుతుంది. చాలా మంది పురుషులు ఆందోళన లేదా అనిశ్చితిని అసహ్యిస్తారు. ప్రశాంతంగా ఉండే వైఖరిపై ఆసక్తిగా కనబరుస్తారు.
మెచ్యురిటీ:
పురుషులు హృదయపూర్వకంగా మెలిగే స్వభావానికి దాసులవుతారు. అంతేకాకుండా అమ్మాయిలో మెచ్యూర్డ్ బిహేవియర్ కు ప్రాధాన్యత ఇస్తారు. ఓదార్పు మాటలు, ధైర్యం చెప్పే స్వభావం ఉన్న వారిని ఇష్టపడటమే కాదు గౌరవిస్తారు కూడా.
ప్రత్యేకత:
అందరిలా కాకుండా కాస్త ప్రత్యేకంగా కనిపించే మహిళలకు పురుషులు త్వరగా ఆకర్షితమవుతారు. తన అభిరుచుల పరంగానో, లక్షణాలతోనో, వ్యక్తిత్వం వల్లనో ప్రత్యేకంగా కనిపిస్తే అటువంటి వారిని మర్చిపోలేరు. పురుషులు ఎప్పటికీ ఆ మహిళను ప్రేమిస్తూనే ఉంటారు.
సంబంధిత కథనం