వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తపై దాడి 

Best Web Hosting Provider In India 2024

శ్రీకాకుళం జిల్లా: వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తపై దుండగులు కత్తితో దాడి చేశారు. పాతపట్నంలోని దువ్వార వీధిలో ఘటన చోటుచేసుకుంది. దాడిలో పెద్దింటి తిరుపతిరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన మెడ, చేతిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తెల్లవారు జామున మూడు గంటల సమయంలో ఇంట్లో చొరబడి దాడికి పాల్పడ్డారు. రాజకీయ కక్షతోనే తనపై దాడి చేశారని బాధితుడు తిరుపతిరావు తెలిపారు. తిరుపతిరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Best Web Hosting Provider In India 2024