Best Web Hosting Provider In India 2024
కొంతమంది ఆడవారిలో గోధుమరంగులో డిశ్చార్చి ఎందుకవుతుంది? కారణాలేంటి?
ఆడపిల్లల్లో పదేళ్ల వయసు నుంచే యోని నుంచి స్రావాలు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. ఆ స్రావాలు తెలుపు, గోధుమ రంగులో ఉంటాయి. తెలుపు రంగు నుంచి గోధుమరంగులోకి మారినటప్పుడు కాస్త చెందాల్సిన అవసరం ఉంది. ఎవరికీ ఇలా గోధుమరంగు డిశ్చార్జి అవుతుందో తెలుసుకోండి.
ఆడవారిలో యోని ఉత్సర్గాలు చిన్న వయసు నుంచే మొదలవుతాయి. మొదట తెలుపు రంగులోనే డిశ్చార్జి మొదలవుతుంది. కానీ కొందరిలో గోధుమరంగులోకి మారుతుంది. ఈ సమస్య సర్వసాధారణమే అయినప్పటికీ నిర్లక్ష్యం చేస్తే తీవ్ర సమస్యగా మారుతుంది. కొందరి మహిళల్లో అండోత్సర్గము సమయంలో వైట్ డిశ్చార్జ్ అధికంగా అయ్యే అవకాశం ఉంది. తెల్ల డిశ్చార్జ్ అవ్వడమ సహజమే కానీ దాని రంగు గోధుమలోకి లేదా బ్రౌన్ రంగులోకి మారితే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇలా బ్రౌన్ రంగులో ఉత్సర్గం జరుగుతుందంటే దాని వెనుక కొన్ని కారణాలు ఉండవచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా యూటీఐ సమస్యల వల్ల ఇలా జరగవచ్చు. తెలుపుతో పాటు బ్రౌన్ కలర్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుందో తెలుసుకోండి.
గోధుమ రంగు ఉత్సర్గ ఎందుకు జరుగుతుంది?
- పిసిఒఎస్ సమస్య ఉన్న మహిళల్లో క్రమరహిత పీరియడ్స్ సమస్య ఉంటుంది. ఈ సందర్భంలో గోధుమ రంగు ఉత్సర్గం జరిగే అవకాశం ఉంది.
2. పీరియడ్స్ ప్రారంభంలో లేదా చివర్లో బ్రౌన్ రంగు స్రావం సంభవించవచ్చు. అయితే, ఇది సాధారణంగా కూడా కావచ్చు.
3. బాక్టీరియల్ వాగినోసిస్, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, ట్రైకోమోనియాసిస్ లేదా గోనేరియా వంటి లైంగిక సంక్రమణ అంటువ్యాధులు కూడా గోధుమ రంగు ఉత్సర్గానికి కారణమవ్వచ్చు.
4. కొంతమంది మహిళల్లో అండోత్సర్గం జరిగే సమయంలో గోధుమ రంగు డిశ్చార్జి జరిగే అవకాశం ఎక్కువ ఉంది.
5. హార్మోన్లలో మార్పులు సంభవించినా కూడా గర్భాశయం పొర క్రమరహితంగా పొడిపొడిలా రాలిపోతూ ఉంటుంది. ఇది కొన్నిసార్లు గోధుమ రంగు ఉత్సర్గానికి కారణమవుతుంది.
6. గర్భాశయ పొరకు అండం అతుక్కుంటే తేలికపాటి రక్తస్రావం కొందరిలో కలుగుతుంది. ఇది గోధుమ రంగు ఉత్సర్గానికి కారణం కావచ్చు. ఇది సాధారణంగా ఫలదీకరణం తర్వాత ఒకటి నుంచి రెండు వారాల తర్వాత సంభవిస్తుంది.
7. గర్భాశయ పాలిప్స్ లేదా ఫైబ్రాయిడ్లు కూడా గోధుమ ఉత్సర్గానికి కారణమవుతాయి.
8. బ్రౌన్ రంగు ఉత్సర్గం ఒక్కోసారి గర్భం ధరించారని చెప్పే ప్రారంభ లక్షణం కావచ్చు. ఇది ఎక్టోపిక్ గర్భం లేదా గర్భస్రావాన్ని సూచిస్తుంది.
9. ప్రీమెనోపాజ్ సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు గోధుమ రంగు ఉత్సర్గానికి కారణమవుతుంది. అయితే, ఇది అధికంగా నలభై వయసులో జరుగుతుంది. కానీ కొంతమందిలో ఇది ముందే ప్రారంభమవుతుంది.
10. గోధుమ రంగులో యోని ఉత్సర్గం జరుగుతున్నప్పుడు గర్భాశయ క్యాన్సర్ వంటి తీవ్రమైన పరిస్థితులకు కూడా సంకేతం కావచ్చు. సెక్స్ సమయంలో నొప్పి పెట్టడం, అసాధారణంగా బరువు తగ్గిపోవడం వంటి ఇతర లక్షణాలు కూడా ఇందులో కనిపిస్తాయి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్