Razakar OTT: ఓటీటీలో వారికి రెండు రోజుల ముందుగా అందుబాటులోకి అనసూయ, బాబీ సింహా హిస్టారికల్ మూవీ.. స్ట్రీమింగ్ వివరాలివే

Best Web Hosting Provider In India 2024

Razakar OTT: ఓటీటీలో వారికి రెండు రోజుల ముందుగా అందుబాటులోకి అనసూయ, బాబీ సింహా హిస్టారికల్ మూవీ.. స్ట్రీమింగ్ వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 20, 2025 09:38 AM IST

Razakar OTT: రజాకార్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు రెడీ అవుతోంది. థియేటర్లలో రిలీజైన సుమారు 10 నెలల తర్వాత స్ట్రీమింగ్‍కు వస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్‍పై మరో అప్‍డేట్ ఇచ్చింది ఓటీటీ ప్లాట్‍ఫామ్.

Razakar OTT: ఓటీటీలో వారికి రెండు రోజుల ముందుగా అందుబాటులోకి అనసూయ, బాబీ సింహా హిస్టారికల్ మూవీ.. స్ట్రీమింగ్ వివరాలివే
Razakar OTT: ఓటీటీలో వారికి రెండు రోజుల ముందుగా అందుబాటులోకి అనసూయ, బాబీ సింహా హిస్టారికల్ మూవీ.. స్ట్రీమింగ్ వివరాలివే

రజాకార్ చిత్రం రిలీజ్‍కు ముందే ఆసక్తిని పెంచింది. నిజాం పాలకుల దురాగతాలు, తెలంగాణ ప్రజల తిరుగుబాటు ఉద్యమం, ఆపరేషన్ పోలో అంశాలతో ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీ తెరకెక్కింది. హైదరాబాద్ సంస్థానలో రజాకార్ల దారుణాలకు వ్యతిరేకంగా జరిపిన పోరాటం ప్రధాన అంశంగా వచ్చింది. యాటా నారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది మార్చి 15వ తేదీన థియేటర్లలో రిలీజైంది. అయితే, ఓటీటీలోకి వచ్చేందుకు ఆలస్యం అయింది. సుమారు పది నెలల తర్వాత ఇప్పుడు స్ట్రీమింగ్‍కు సిద్ధమైంది. తాజాగా ఓటీటీ ట్రైలర్ సహా ఓ అప్‍డేట్‍ను ప్లాట్‍ఫామ్ ఇచ్చింది.

yearly horoscope entry point

స్ట్రీమింగ్ డేట్.. వారికి ముందుగానే..

రజాకార్ సినిమాను ఈ వారంలోనే జనవరి 24వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు ఆహా వెల్లడించింది. అయితే, ఆహా గోల్డ్ ప్లాన్ యూజర్లకు 48 గంటల ముందుగానే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంటుందని తెలిపింది. అంటే ఆహా గోల్డ్ ప్లాన్ ఉన్న వారు జనవరి 22వ తేదీ నుంచే ఈ చిత్రాన్ని చూడొచ్చు. సాధారణ ప్లాన్ సబ్‍స్క్రైబర్లకు జనవరి 24న రజాకార్ మూవీ ఆహాలో స్ట్రీమింగ్‍కు వస్తుంది. ఈ విషయాన్ని తాజాగా ఆహా వెల్లడించింది.

రజాకార్ చిత్రంలో బాబీ సింహా, తేజ్ సర్పు, మకరంద్ దేశ్‍పాండే, అనసూయ భరద్వాజ్, వేదిక, ఇంద్రజ, రాజ్‍ అర్జున్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీని యథార్థ ఘటనల ఆధారంగా ఇంటెన్స్ హిస్టారికల్ మూవీగా సత్యనారాయణ తెరకెక్కించారు. ఓ వర్గాన్ని తప్పుగా చూపించేలా ఈ చిత్రం ఉందని కాస్త వివాదం కూడా అయింది.

పది నెలల తర్వాత ఓటీటీలోకి..

రజాకార్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు చాలా ఆలస్యమైంది. ఈ సినిమాకు ఓటీటీ డీల్ తొలుత జరగలేదు. దీంతో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టలేదు. ఎట్టకేలకు ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. జనవరి 24న స్ట్రీమింగ్‍కు తెచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన సుమారు 10 నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది.

రజాకార్ మూవీని సమర్‌వీర్ క్రియేషన్స్ బ్యానర్‌పై గూడుర్ సత్యనారాయణ రెడ్డి ప్రొడ్యూజ్ చేశారు. భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు. కమర్షియల్‍గా ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. నటీనటుల పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిజాం నాటి పరిస్థితులను హార్డ్ హిట్టింగ్‍గా డైరెక్టర్ చూపించారనే టాక్ వచ్చింది. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. ఆశించిన స్థాయిలో ఈ మూవీకి కలెక్షన్లు దక్కలేదు. కమర్షియల్‍గా సక్సెస్ కాలేకపోయింది. పెద్దగా థియేట్రికల్ రన్ సాగించలేకపోయింది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024