Natural Hair Colour: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ గింజలే మీకు పరిష్కారం!

Best Web Hosting Provider In India 2024

Natural Hair Colour: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ గింజలే మీకు పరిష్కారం!

Ramya Sri Marka HT Telugu
Jan 20, 2025 10:30 AM IST

Natural Hair Colour: తెల్ల జుట్టు సమస్యతో నలుగురిలో నామూషీగా ఫీలవుతున్నారా? ఎన్నిరకాల షాంపూలు, నూనెలు వాడిన పరిష్కారం లభించడం లేదా. అయితే ఈ చిట్కా మీ కోసమే. ఈ గింజలతో నూనె తయారు చేసుకుని క్రమం తప్పకుండా వాడారంటే కొద్ది రోజుల్లోనే మీ జుట్టు నల్లగా మారుతుంది. వివరాల్లోకి వెళదాం రండి.

తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ గింజలే మీకు పరిష్కారం!
తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ గింజలే మీకు పరిష్కారం! (shutterstock)

తెల్లజుట్టు సమస్య చాలా మందిని వేధిస్తుంది. నలుగురిలో చాలా నామూషీగా అనిపిస్తుంది. అలా అని చిన్న వయసు నుంచే జుట్టుకు రంగు వేసుకోవడం వల్ల జుట్టు సహజ నలుపు రంగును కోల్పోతుంది. రంగులో కలిపే రసాయనాలు వెంట్రుకల ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయి. పైగా వేసుకున్న రంగు పోయాక జుట్టు చూడటానికి మరింత అందవిహీనంగా ఉంటుంది. మీరు కూడా తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నట్లయితే కలోంజి గింజలు మీకు చక్కటి పరిష్కారమవుతాయి. వీటిలో ఇంట్లో సహజమైన హెయిర్ ఆయిల్‌ను తయారుచేసుకుని వాడండి. ఇది జుట్టును క్రమంగా నల్లగా మారుస్తుంది, సహజమైన రంగును తిరిగి పొందేలా చేస్తుంది. అంతేకాదు వెంట్రుకలు కుదుళ్ల నుంచి బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. కలోంజి గింజలతో నూనె తయారు చేయడం ఎలాగో ఇక్కడ ఉంది.

yearly horoscope entry point

జుట్టును నల్లగా మార్చే హెయిర్ ఆయిల్ తయారు చేయడం ఎలాగో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

  1. ఒక కప్పు కలౌంజి
  2. ఒక కప్పు ఆవ నూనె
  3. నీరు

తయారీ విధానం:

-ముందుగా ఒక కప్పు కలౌంజి గింజలను తీసుకుని ఒక గాజు పాత్రలో వేసి దాంట్లో నీరు పోసి రాత్రంతా నానబెట్టండి.

-మరుసటి రోజు ఉదయం నీటితో కలిపి కలోంజి గింజలను మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా తయారు చేసుకోండి.

-ఇప్పుడు ఒక ఇనుప కడాయిలో కలోంజి గింజల పేస్ట్, రెండు కప్పుల ఆవ నూనె వేసి వేడి చేయండి. ఇది అంతా మరిగి సగం అయ్యే వరకు వేడి చేయండి.

-తరువాత గ్యాస్ ఆఫ్ చేసి నూనెను చల్లారనివ్వండి.

-చల్లారిన తర్వాత వస్త్రం సహాయంతో నూనెనె వడకట్టి ఒక గాజు సీసాలో నింపండి.

ఈ హెయిర్ ఆయిల్‌ను ఎలా ఉపయోగించాలి:

జుట్టును నల్లగా మార్చే ఈ హెయిర్ ఆయిల్‌ను రాత్రిపూట జుట్టు కుదుళ్లకు, తెల్లజుట్టు ఉన్న ప్రదేశాలకు రాసుకోండి. రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు ఉదయం షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోండి.

వారానికి కనీసం రెండు సార్లైనా క్రమం తప్పకుండా ఈ నూనెను తలకు రాసుకున్నరాంటే కొద్ది రోజుల్లోనే తెల్ల జుట్టు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కొత్తగా తెల్ల జుట్టు రాకుండా ఉండేందుకు ఈ నూనె సహాయపడుతంది. వరుసగా చాలా వారాల పాటు ఈ నూనెను రాసుకోవడం వల్ల జుట్టు సహజ రంగు తిరిగి వస్తుంది.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024