వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తపై దాడి

Best Web Hosting Provider In India 2024

చిత్తూరు జిల్లా:   వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్యకర్తపై సర్పంచ్‌, టీడీపీ నాయకులు దాడి చేసిన సంఘటన చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వడమాలపేట మండలం, బట్టికండ్రిగ గ్రామానికి చెందిన సుధాకర్‌ కుమారుడు పవన్‌కుమార్‌ శుక్రవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై వెళుతుండగా స్థానిక సర్పంచ్‌, టీడీపీ నాయకులు అడ్డుపడి బైక్‌ తాళం లాక్కొని, బీరు బాటిల్‌తో దాడి చేశారు. అంతలో ఆ యువకుడు తప్పించుకున్నాడు. భయంతో ద్విచక్రవాహనాన్ని విడిచి పెట్టి అక్కడి నుంచి ఇంటికి పరుగులు తీశాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసి రెండు రోజులవుతున్నా, పోలీసులు ఇంత వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, కనీసం తమకు జరిగిన అన్యాయంపై విచారణ కూడా చేయలేదని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Best Web Hosting Provider In India 2024