Best Web Hosting Provider In India 2024
OTT Movie: పెళ్లి రోజు రాత్రి వరుడికి షాక్.. ఆకట్టుకునేలా టీజర్.. నేరుగా ఓటీటీలోకే చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Dhoom Dhaam OTT Release Date: ధూమ్ ధామ్ సినిమా టీజర్ వచ్చేసింది. కామెడీ, యాక్షన్‍తో ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. డేట్ కూడా ఖరారైంది.
బాలీవుడ్ సినిమా ధూమ్ ధామ్ నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ కామెడీ యాక్షన్ మూవీలో ప్రతీక్ గాంధీ, యామీ గౌతమ్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తోనే ఇంట్రెస్ట్ పెంచింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రిషబ్ సేథ్ తెరకెక్కిస్తున్నారు. ధూమ్ ధామ్ సినిమా టీజర్ నేడు (జనవరి 20) వచ్చేసింది. దీంతోపాటు స్ట్రీమింగ్ డేట్ కూడా రివీల్ అయింది.
టీజర్ ఇలా..
ధూమ్ ధామ్ టీజర్లో.. వీర్ (ప్రతీక్ గాంధీ), కోయల్ చద్దా (యామీ గౌతమ్) పెళ్లి రోజు రాత్రి ఫస్ట్ నైట్ కోసం మంచంపై కూర్చొని ఉంటారు. ఇద్దరూ సిగ్గు పడుతుంటారు. ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఇంతలో కోయల్ చున్నీ పట్టుకుంటాడు వీర్. ఇంతలోనే కథ అడ్డం తిరుగుతుంది. అక్కడికి రౌడీ గ్యాంగ్ వస్తుంది. చార్లీ ఎవరు అని ఆ రౌడీలు.. వీర్‌ను బెదిరిస్తారు. ఆ సమయంలో కోయల్.. గన్‍ను సునాయాసంగా కాలుస్తుంది. దీంతో వీర్ షాక్ అవుతాడు. బుల్లెట్ ఎలా కాల్చావని ఆశ్చర్యపోతాడు.
ఆ కోయల్ ఫైట్ చేసినట్టుగా షాట్ ఉంది. రౌడీల నుంచి తప్పించుకొని కోయల్, వీర్ పరుగెడుతుంటారు. నన్ను నమ్ము అని వీర్‌తో కోయల్ చెప్పే డైలాగ్‍తో ఈ టీజర్ ముగిసింది. కామెడీ, సస్పెన్స్, యాక్షన్‍తో ఈ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. అసలు ఆ రౌడీలు ఎవరు.. వీర్ కోసం ఎందుకొచ్చారు.. కోయల్ ఫ్లాష్‍బ్యాక్ ఏంటి.. వీరి పెళ్లి ఎలా జరిగిందనే విషయాల చుట్టూ ధూమ్ ధామ్ సినిమా తిరిగేలా కనిపిస్తోంది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
ధూమ్ ధామ్ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఆ విషయాన్ని టీజర్ ద్వారా రివీల్ చేసింది నెట్‍ఫ్లిక్స్. “ఈ వాలెంటైన్స్ డే రోజున వీర్, కోయల్ పెళ్లి.. ధూమ్‍ధామ్‍తో.. పూర్తి ధమాకాతో జరగనుంది. ధూమ్ ధామ్ సినిమాన ఫిబ్రవరి 14వ తేదీన నెట్‍ఫ్లిక్స్‌లో చూడండి” అని ఆ ప్లాట్‍ఫామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ధూమ్ ధామ్ సినిమా నుంచి వచ్చిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ కూడా క్యూరియాసిటీని పెంచింది. ఇప్పడు వచ్చిన టీజర్ కూడా అదిరిపోయింది. దీంతో ఈ చిత్రంపై మంచి బజ్ ఏర్పడే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని రిషబ్ సేథ్ తెరకెక్కిస్తున్నారు.
ధూమ్ ధామ్ మూవీని బీ62 స్టూడియోస్, జియో స్టూడియోస్ పతాకాలపై ఆదిత్య ధార్, లోకేశ్ ధార్, జ్యోతి దేశ్‍పాండే ప్రొడ్యూజ్ చేస్తున్నారు. రొమాన్స్, కామెడీ, ఎనర్జీ, ప్రత్యేకమైన స్టోరీ ఈ చిత్రంలో ఉంటాయని నిర్మాత ఆదిత్య ధార్ పేర్కొన్నారు. యామీ గౌతమ్ భర్తే ఈ ఆదిత్య. ఈ చిత్రంలో సర్‌ప్రైజ్‍లు, ట్విస్టులు, హృదయాన్ని తాకే మూవ్‍మెంట్స్ ఉంటాయని జ్యోతి దేశ్‍పాండే అన్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.
నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో గత వారం జనవరి 16వ తేదీన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రైఫిల్ క్లబ్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ప్రస్తుతం టాప్-3లో ట్రెండ్ అవుతోంది. దిలీశ్ పోతన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ గత డిసెంబర్‌లో రిలీజై మంచి హిట్ అయింది. ఇప్పుడు నెట్‍ఫ్లిక్స్‌లోనూ మంచి వ్యూస్ సాధిస్తోంది.
సంబంధిత కథనం