ఇంకెంత‌కాలం వైయ‌స్‌ జగన్‌పై అబద్దపు ప్రచారం

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి పోతినమహేష్‌

చంద్రబాబు హైదరాబాద్‌లో కట్టుకున్న ప్యాలెస్‌లోకి ఒక్క కార్యకర్తనైనా తీసుకుని వెళ్లాడా? 

రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన అమిత్ షాతో చర్చించాల్సింది

30 లక్షల మంది పేదవారికి సొంతింటి కలను నేరవేర్చాడం విధ్వంసకర పాలన అంటారా?

విజయవాడ:  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై కూట‌మి నేత‌లు ఇంకెంత కాలం ప్ర‌చారం చేస్తార‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి పోతిన మ‌హేష్ మండిప‌డ్డారు. అధికార పార్టీకి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల క‌న్నా వైయ‌స్ జ‌గ‌న్‌పై విష ప్ర‌చారం చేయ‌డ‌మే ముఖ్య‌మ‌న్నారు. నిన్న అమిత్‌షా ఆంధ్రప్రదేశ్‌కు వస్తే వరాల జల్లు కురిపిస్తారని అందరూ ఊహించారని, అయితే అది జరగలేదని  విమర్శించారు. మహేష్‌ సోమవారం మీడియాతో మాట్లాడారు.

ఎన్డీఏనే అధికారంలో ఉంది:
కేంద్ర మంత్రి అమిత్ షా రాకను చంద్రబాబు ఏ విధంగా ఉపయోగించుకున్నారో చెప్పాల‌ని పోతిన మ‌హేష్ డిమాండు చేశారు. ఆంధ్రప్రదేశ్,కేంద్రంలో ఎన్‌డీఏ అధికారంలో ఉంది. అమిత్ షాతో రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన చర్చించి ప్రకటన చేయించి ఉంటే బాగుండేది. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు 8వేల కోట్లు ఉన్నాయి. వీటిని తీసుకురావడానికి వైయ‌స్‌ జగన్‌ కృషి చేశారు. కృష్ణా జలాల అంశంపై కనీసం మాట్లాడలేదు. రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై మాట్లాడడంపై మానేసి వైయ‌స్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసే విధంగా మాట్లాడార‌ని మ‌హేష్ మండిప‌డ్డారు.

అమిత్‌షా ప‌ర్య‌ట‌న‌తో ప్ర‌యోజ‌నం ఏంటి?
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్యాకేజీపై కార్మికసంఘాలు,ప్రజలకు అనుమానాలున్నాయ‌ని మ‌హేష్ తెలిపారు.  స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ నిలపివేస్తున్నామని,సెయిల్ లో కలుపుతున్నామని అమిత్‌షాతో ఎందుకు ప్రకటన చేయించలేకపోయారు. అమిత్ షా పర్యటనతో రాష్ట్రానికి ఒరిగింది ఏంటి? చంద్రబాబు నివాసం అక్రమనిర్మాణం కాదా? వరదల్లో మునిగిపోలేదా?ఇటువంటి విషయాలు అమిత్ షాకి చూపించాల్సింద‌ని కూట‌మి నేత‌ల‌కు సూచించారు. వైయ‌స్‌ జగన్‌పై అబద్దపు ప్రచారాం ఎంతకాలం చేస్తారు. ఇది మంచిపద్దతి కాదు. చంద్రబాబు హైదరాబాద్‌లో కట్టుకున్న ప్యాలెస్‌లోకి ఏ కార్యకర్తనైనా తీసుకుని వెళ్లాడా? కనీసం ప్రవేశం ఉందా? వైయ‌స్‌ జగన్‌ తాడేపల్లి ఇంట్లోనే పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు జరుగుతున్నాయి. దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ అంశంపై అమిత్‌ షా స్పందించలేదు. అమరావతిలో 5ఎకరాలు భూమి కొన్నారు. ఈ అంశంపై అమిత్‌ షా మాట్లాడడలేదు.

నాడు సామాజిక న్యాయం..నేడు సామాజిక మోసం
రుషికొండ భవనాలపై విష ప్రచారం చేస్తున్నారు. పవన్‌కి ఒక్కడికే బాబు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. వైయ‌స్ జగన్‌ సామాజిక న్యాయం చేసి బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. చంద్రబాబు  ఇప్పుడు లోకేష్‌కే కాదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. వైయ‌స్‌ జగన్‌ సామాజిక న్యాయం చేస్తే బాబు సామాజిక మోసం చేశార‌ని పోతిన మ‌హేష్ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్‌కు ఉపముఖ్యమంత్రి పదవి అమిత్ షా రెకమెండ్ చేస్తే ఇచ్చారని ట్విటర్‌లో పెట్టారు.  బాబు సామాజిక మోసంపై తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు మాట్లాడాలి. 30 లక్షల మంది పేదవారికి సొంతింటి కలను నేరవేర్చాడం విధ్వంసకర పాలన అంటారా?ప్రజలకు పరిపాలన దగ్గర చేసేందుకు గ్రామవార్డు సచివాలయాలు పెట్టడం విధ్వంసకర పాలన అంటారా? విద్యా, వైద్య రంగాలను అభివృద్ది చేస్తే విధ్వంసకర పాలన అంటారా?హర్బర్లు, పోర్టులు, మెడికల్ కాలేజీలు పెట్టి అభివృద్ది చేయడం విధ్వంసకర పాలన అంటారా’అని మహేష్‌ ప్రశ్నించారు.

Best Web Hosting Provider In India 2024