Best Web Hosting Provider In India 2024
కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం కేసు.. సంజయ్ రాయ్‌కి జీవిత ఖైదు
Kolkata Rape and Murder Case Verdict : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కి జీవిత ఖైదు పడింది.
కోల్‌కతా వైద్యురాలి రేప్, హత్య కేసు దోషి..
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీల్దా కోర్టు తీర్పు వెలువరించింది. ఆర్జీ కర్ అత్యాచారం-హత్య కేసులో జనవరి 18న సంజయ్ రాయ్‌ని దోషిగా నిర్ధారించిన కోర్టు సోమవారం అతడికి శిక్షను వేసింది. దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కి కోర్టు జీవిత ఖైదు విధించింది. దర్యాప్తు సంస్థ సీబీఐ న్యాయవాది ఉరిశిక్ష విధించాలని కోర్టును కోరారు.
సీల్దా కోర్టు న్యాయమూర్తి దోషి సంజయ్ రాయ్‌తో మాట్లాడుతూ మీపై ఏం ఆరోపణలు వచ్చాయో, మీపై ఎలాంటి ఆరోపణలు రుజువు అయ్యాయో గత రోజు చెప్పానని చెప్పారు. అయితే దీనిపై నిందితుడు సంజయ్ న్యాయమూర్తితో మాట్లాడుతూ.. నేనేమీ అత్యాచారం, హత్య చేయలేదు. నన్ను తప్పుగా ఇరికిస్తున్నారని చెప్పాడు. ‘నేను నిర్దోషిని. నన్ను చిత్రహింసలకు గురిచేశారు. వారు కోరుకున్నదానిపై నాతో సంతకం చేయించారు.’ అని సంజయ్ అన్నాడు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.
Best Web Hosting Provider In India 2024
Source link