Ram Gopal Varma: ఓ కొత్త రామ్‌గోపాల్ వర్మను చూస్తావ్.. సత్య సక్సెస్ నన్నో అహంకారిగా మార్చేసింది: ఆర్జీవీ పోస్ట్ వైరల్

Best Web Hosting Provider In India 2024

Ram Gopal Varma: ఓ కొత్త రామ్‌గోపాల్ వర్మను చూస్తావ్.. సత్య సక్సెస్ నన్నో అహంకారిగా మార్చేసింది: ఆర్జీవీ పోస్ట్ వైరల్

Hari Prasad S HT Telugu
Jan 20, 2025 03:11 PM IST

Ram Gopal Varma: సత్య మూవీ సక్సెస్ తననో అహంకారిగా మార్చేసిందని, తర్వలోనే ఓ కొత్త రామ్ గోపాల్ వర్మను చూస్తారని సోమవారం (జనవరి 20) ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సత్యపై ఒట్టేసి చెబుతున్నా.. అలాంటి మరో సినిమా తీస్తాననీ అతడు స్పష్టం చేశాడు.

ఓ కొత్త రామ్‌గోపాల్ వర్మను చూస్తావ్.. సత్య సక్సెస్ నన్నో అహంకారిగా మార్చేసింది: ఆర్జీవీ పోస్ట్ వైరల్
ఓ కొత్త రామ్‌గోపాల్ వర్మను చూస్తావ్.. సత్య సక్సెస్ నన్నో అహంకారిగా మార్చేసింది: ఆర్జీవీ పోస్ట్ వైరల్

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ గ్రేటెస్ట్ హిట్ సత్య.. గత శుక్రవారం (జనవరి 17) థియేటర్లలో రీరిలీజ్ అయిన విషయం తెలుసు కదా. ఈ మూవీ 27 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమా విజయం తనను అహంకారిగా ఎలా మార్చేసిందో చెబుతూ సోమవారం (జనవరి 20) ఆర్జీవీ ఓ ట్వీట్ చేశాడు. ఇప్పుడు తాను పూర్తిగా మారిపోయానని, మరోసారి సత్యలాంటి సినిమా తీస్తాననీ హామీ ఇవ్వడం విశేషం.

yearly horoscope entry point

సత్య మూవీపై ఆర్జీవీ ఏమన్నాడంటే?

సత్య కన్ఫెషన్ పేరుతో ఆర్జీవీ ఓ సుదీర్ఘ పోస్ట్ చేశాడు. ఈ సినిమా తనను ఎలా మార్చేసిందో అందులో చెప్పుకొచ్చాడు. “27 ఏళ్ల తర్వాత సత్యను మరోసారి చూస్తున్నప్పుడు ఆ మూవీ చివరికి వచ్చేసరికి నాకు కన్నీళ్లు ఆగలేదు. ఎవరైనా చూస్తారని కూడా నేను ఆలోచించలేదు. ఆ కన్నీళ్లు సినిమా కోసమే కాదు.. ఆ తర్వాత జరిగిన పరిణామాల కోసం కూడా” అని ఆర్జీవీ ఈ ట్వీట్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత సత్య మూవీ సక్సెస్ తనను ఎలా మార్చేసిందో అతడు చెప్పుకొచ్చాడు.

సత్య మూవీతో తాను సృష్టించిన అద్భుతాన్ని తాను పూర్తిగా ఆస్వాదించలేదని, దీనిని కోసం కేవలం మరో సినిమాగానే చూశానని అన్నాడు. అయితే ఈ మూవీ సక్సెస్ తనను అహంకారిగా మార్చేసిందని అతడు చెప్పాడు. “సత్య చూసి హోటల్ కు తిరిగి వచ్చిన తర్వాత చీకట్లో కూర్చొన్నాను. నాకున్న తెలివి తేటలతో నేను సత్యలాంటి సినిమాను నా భవిష్యత్తు సినిమాల కోసం ఎందుకు ఓ బెంచ్‌మార్క్ చేసుకోలేదో నాకు అర్థం కాలేదు.

ఆ సినిమాలోని విషాదం వల్లే కాదు.. అప్పటి నన్ను చూసుకొని కూడా నేను ఏడ్చాను. సత్య వల్ల నన్ను నమ్మిన వారిని మోసం చేశానని కూడా నేను ఏడ్చాను. నేను ఆల్కహాల్ వల్ల తాగుబోతును కాలేదు. నా సక్సెస్, అహంకారంతో అలా అయ్యాను. ఇది నాకు రెండు రోజుల కిందటి వరకు కూడా తెలియదు” అని ఆర్జీవీ అన్నాడు.

నాలాగా కావద్దు: ఆర్జీవీ

సత్య మూవీ తర్వాత తాను తీసిన సినిమాల్లో ఆ నిజాయతీ, చిత్తశుద్ధి లేవని కూడా ఆర్జీవీ స్పష్టం చేశాడు. ఈ తరం ఫిల్మ్ మేకర్స్ తనలాగా కావద్దని, తాము సృష్టించుకున్న అత్యుత్తమ ప్రమాణాలకు అనుగుణంగా ముందడుగు వేయాలని సూచించాడు. “కాలంలో వెనక్కి వెళ్లి ఓ విషయం మాత్రం అనుకోవాలని ఉంది. ఏ సినిమా తీసే ముందు సత్యను మళ్లీ చూడాలి అని. ఒకవేళ నేను ఆ రూల్ ఫాలో అయి ఉంటే.. అప్పటి నుంచి నేను తీసిన సినిమాల్లో 90 శాతం తీయకపోయేవాడిని” అని ఆర్జీవీ అన్నాడు.

అయితే సత్యలాంటి మూవీ మరోసారి తీస్తానని మాత్రం స్పష్టం చేశాడు. “మిగిలిన నా కొద్దిపాటి జీవితంలో నిజాయతీగా ఉంటూ సత్యలాంటి సినిమాను మళ్లీ తీయాలని అనుకుంటున్నాను. సత్య మీద ఒట్టేసి ఈ మాట చెబుతున్నాను” అని ఆర్జీవీ ముగించాడు.

కొత్త ఆర్జీవీని చూస్తావ్

ఈ ట్వీట్ పై సత్య మూవీలో భీకూ మాత్రే పాత్ర పోషించిన మనోజ్ బాజ్‌పాయీ స్పందించాడు. అందరూ ఆర్జీవీలు కాలేరని, నువ్వో ప్రత్యేకమైన మనిషివి అని అందులో మనోజ్ అన్నాడు. దీనికి ఆర్జీవీ కూడా రిప్లై ఇస్తూ.. తాను మాట ఇచ్చినట్లుగానే కొత్త ఆర్జీవీని చూస్తావని అన్నాడు. “భీకూ భాయ్ థ్యాంక్స్.. నేను ఇంతకుముందే మాట ఇచ్చినట్లుగా.. ఓ కొత్త నేనును నీకు చూపిస్తా.. ఒకవేళ అలా చేయకపోతే.. నువ్వు నా తలలో కాల్చి చంపెయ్” అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024