Best Web Hosting Provider In India 2024
Cabbage Soup: రక్తాన్ని శుద్ది చేసి, గుండె సమస్యలను దూరం చేసే క్యాబేజితో సూప్ ఎప్పుడైనా ట్రై చేశారా?
చలికాలం బ్రేక్ ఫాస్ట్ లోనైనా, స్నాక్స్ టైంలోనైనా వేడివేడి సూప్ తాగితే ఎలా ఉంటుంది. మనస్సుకు ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంటుంది కదా. మరి ఏ సూప్ తాగాలా అని ఆలోచిస్తున్నారా.. అత్యంత పోషక విలువలున్న క్యాబేజీనే మీ బెటర్ ఆప్షన్ ఎందుకు కాకూడదు. రండి ట్రై చేద్దాం.
డైటింగ్ చేసే వాళ్లకు కూడా ఇది బెటర్ ఆప్షన్. పోషకాలతో కడుపు నిండినట్లుగా ఉండి, అధిక కేలరీల ఆహారం తీసుకునే అవకాశం రానివ్వదు. ఫలితంగా ఎక్కువగా తినేసి ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు. మరి, రుచితో పాటు ఆరోగ్యకరమైన క్యాబేజి సూప్ ఎలా తయారుచేసుకోవాలో చూసేద్దామా..
కావాల్సిన పదార్థాలు:
- – క్యాబేజి – 1 కప్పు (సన్నగా తరిగిన ముక్కలు)
- – ఉల్లిపాయలు – 1 (సన్నగా తరిగినవి)
- – టమాటోలు – 2 (తరిగినవి)
- – వెల్లుల్లి రెబ్బలు – 2-3 (విడదీసినవి)
- – అల్లం – 1 అంగుళం (తరిగిన ముక్కలు)
- – మిరియాల పొడి – 1/2 టీస్పూన్
- – ఉప్పు – రుచికి సరిపడ
- – కొత్తిమీర – (అలంకరించడానికి)
- – వెన్న – 1 టేబుల్ స్పూన్
- – పచ్చి మిరపకాయలు – 1-2 (అవసరాన్ని బట్టి)
- – నీరు – 4 కప్పులు
తయారీ విధానం:
1. క్యాబేజి సన్నగా కోయడం: మొదట క్యాబేజిని సన్నగా తరగాలి. కావాలనుకుంటే, క్యాబేజిని చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు.
2. వెన్న వేసి వేయించడం: ఆ తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో బటర్ వేసుకుని వేడి చేయాలి. వేడెక్కిన పాన్‌లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి సువాసన వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి.
3. టమాటోలను వేయించడం: వేగిన తర్వాత అందులో టమాటా ముక్కలు వేసి, పచ్చిదనం పోయేంత వరకూ ఉడికించండి.
4. క్యాబేజి ముక్కలు కలపడం: ఇప్పుడు క్యాబేజి ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు వేసి 2-3 నిమిషాల పాటు మూత తీసి వేయించుకుంటూ ఉండండి.
5. నీరు వేసి ఉడికించడం: ఉడికిన ఆహారంలో కాస్త నీరు పోసి దానికి ఉప్పు, పచ్చి మిరపకాయలు జతచేయండి. అలాగే మూత పెట్టి మరో 10-15 నిమిషాల పాటు ఉడికించండి. అంతే మీరు కావాలనుకున్న క్యాబేజి సూప్ రెడీ అయిపోయినట్లే.
6. అలంకరించడం: చివరిగా సూప్ ఉడికిందనుకున్న తర్వాత, కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా సర్వ్ చేసుకోండి.
ఈ సూప్ ఆరోగ్యకరంగానే కాదు, తేలికైనదిగా, రుచికరమైనదిగా ఉండే ఆహారం.
క్యాబేజి సూప్ సులువుగా తయారుచేసుకోగల ఆహారం మాత్రమే కాదు. ఇది బహుళ ప్రయోజనకారి కూడా. మచ్చుకు టాప్ 3 ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..
జీర్ణ వ్యవస్థకు ఉపశమనం
-క్యాబేజి డైటరీ ఫైబర్ తో నిండి ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను సమర్ధంగా పని చేయించడంలో సహాయపడుతుంది. ఫైబర్ రాయితీగా ఉండటం వలన మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
హృదయ ఆరోగ్యం
– క్యాబేజిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఇతర పోషకాలు రక్త సరఫరా వ్యవస్థకు మేలు చేస్తాయి. ఇంకా హృదయ ఆరోగ్యం మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. అలాగే బ్లడ్ ప్రెషర్‌ను నియంత్రించడంలో సహాయం చేస్తాయి.
రక్తశుద్ధి, డిటాక్సిఫికేషన్
– క్యాబేజిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ C శరీరంలోని విషాల నుండి శుద్ధి చేసేందుకు, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి. ఇది శరీరంలోని టాక్సిన్లను తొలగించి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. ఈ మూడు ప్రయోజనాలు క్యాబేజి సూప్‌ను ఆరోగ్యకరమైన ఆహారంగా మార్చుతాయి.
సంబంధిత కథనం