Pressure cooker: ఈ పదార్థాలను ప్రెషర్ కుక్కర్లో వండకూడదు, కానీ ప్రతిరోజూ వండేస్తున్నాము

Best Web Hosting Provider In India 2024

Pressure cooker: ఈ పదార్థాలను ప్రెషర్ కుక్కర్లో వండకూడదు, కానీ ప్రతిరోజూ వండేస్తున్నాము

Haritha Chappa HT Telugu
Jan 20, 2025 04:30 PM IST

Pressure cooker: రోజువారీ ఆహారం వండడంలో ప్రెషర్ కుక్కర్ ప్రధానంగా మారింది. ఇందులో అనేక రకాలైన వంటలు వండుకోవచ్చు. అయితే వీటిలో వండకూడని పదార్థాలు కూడా ఉన్నాయి. కానీ ఆ విషయం తెలియక ఎంతో మంది వాటిని ప్రతిరోజూ వండేస్తున్నారు.

ప్రెషర్ కుక్కర్ లో వండకూడని పదార్థాలు
ప్రెషర్ కుక్కర్ లో వండకూడని పదార్థాలు

ప్రెషర్ కుక్కర్ వంట గదిలో భాగం అయిపోయింది. రోజువారీ భోజనం తయారీలో ప్రెషర్ కుక్కర్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. కుక్కర్ లో వంట సులువుగా, త్వరగా అయిపోతుంది. కాబట్టి వీటిని వాడే వారి సంఖ్య అధికంగా ఉంది. అయితే కుక్కర్ లో అన్ని రకాల వంటలు వండేస్తూ ఉంటార ఎంతోమంది. అది ఏమాత్రం మంచి పద్దతి కాదు. మాంసం నుంచి సాంబార్ వరకు అన్నింటినీ వండేస్తారు. కుక్కర్ బిర్యానీ, కుక్కర్లో కేక్…. ఇలా స్పెషల్ వంటకాలు కూడా ఉన్నాయి.

yearly horoscope entry point

ప్రెషర్ కుక్కర్ లో వండకూడని ఆహార పదార్థాలు ఉన్నాయి. కుక్కర్ లో వండడం వల్ల ప్రయోజనం తగ్గడమే కాకుండా కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు కూడా విషపూరితం అయ్యే ప్రమాదం ఉంది.

పాల ఉత్పత్తులు

ప్రెషర్ కుక్కర్ లో కొంతమంది పాలు మరగబెట్టేస్తారు. జున్ను వంటివి కూడా వండుతూ ఉంటారు. కుక్కర్లో వీటిని చేయడం వల్ల వాటి నాణ్యత, రుచి కోల్పోతాయి. కుక్కర్ లో పాలను మరిగించడం వల్ల పాలు చిక్కగా మారుతాయి.

పప్పులు

ప్రెషర్ కుక్కర్ లో పప్పు దినుసులను ఉడికించడం సర్వసాధారణం. నిజానికి పప్పులు కుక్కర్ల్ ఉడికించకూడదు. ఇలా చేయడం వల్ల వాటిలోని పోషక విలువలు తగ్గుతాయి. వీలైనంత వరకు ముందురోజే రాత్రి పప్పులను నీటిలో నానబెట్టి వండితే సులువుగా ఉడికిపోతాయి.

అన్నం

అన్నాన్ని కూడా ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి టీవీ చూసుకుంటూ ప్రశాంతంగా కూర్చునే వారు ఎంతో మంది. కానీ అన్నం వండడానికిప్రెజర్ కుక్కర్ వాడకూడదు. ఇలా వండడం వల్ల బియ్యంలో ఉండే పిండి పదార్థాల నుంచి హానికరమైన సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయి. ముఖ్యంగా రసాయనాలు విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మామూలు గిన్నెల్లోనే అన్నాన్ని వండుకోవాలి. వండి వార్చే పద్దతి అన్నం వండడంలో ఉత్తమం.

చేపలు

చేపలను కుక్కర్ లో ఎప్పుడూ వండకూడదు. దీనివల్ల వాటి మాంసం పొడిగా, గట్టిగా తయారవుతుంది. అలాగే అధిక ఉష్ణోగ్రత వద్ద చేపలను ఉడికించడం వల్ల కుక్కర్ లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ నశించి విష పదార్థాలుగా మారతాయి.

వంట విధానం

ప్రెషర్ కుక్కర్ ఉపయోగించేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ప్రెజర్ కుక్కర్ లో ఆహారాన్ని వండేటప్పుడు నీటిని పెంచడం లేదా తగ్గించడం చేయవద్దు. ప్రెజర్ కుక్కర్ ఆవిరిపై ఆధారపడి ఒత్తిడిని సృష్టించి ఆహారాన్ని వండుతుంది. కాబట్టి తగినంత నీరు, నూనె మొదలైనవి వేయడం మంచిది.

కుక్కర్ లో ఆవిరిని ఉత్పత్తి చేయడానికి తగినంత స్థలం ఉండాలి. కాబట్టి కుక్కర్ లో నాలుగింట మూడొంతులు మాత్రమే నింపండి. వండిన ఆహార రకాన్ని బట్టి వంట సమయం మరియు పీడనం మారవచ్చు. కాబట్టి ప్రతి వంటకానికి తగిన వంట సమయం మరియు ప్రెజర్ సెట్టింగ్ తెలుసుకోవడానికి మాన్యువల్ ఉపయోగించండి. వంట చేసిన తరువాత, కాలిపోకుండా ఉండటానికి ప్రెజర్ కుక్కర్ నుండి ఒత్తిడిని జాగ్రత్తగా తొలగించండి. సకాలంలో కుక్కర్ యొక్క సేఫ్టీ వాల్వ్ ను మార్చండి, లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024