Best Web Hosting Provider In India 2024
వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి
దావోస్ పర్యటనంతా భజన. అబద్దాల ప్రచారం
నాడు 2014–19 మధ్య జరిగిందంతా అదే
ఆర్భాట ప్రకటనలు తప్ప, పెట్టుబడులు లేవు
ఇప్పటి దావోస్ పర్యటనలోనూ జరగబోయేది అదే: పుత్తా శివశంకర్‌రెడ్డి స్పష్టీకరణ
ఒట్టి ప్రచారాలతో పారిశ్రామికవేత్తలు ముందుకురారు
గతంలోనూ ఎల్లో మీడియాలో విస్తృతంగా ప్రచారం
అయినా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు శూన్యం
చంద్రబాబు భజన మీడియాకు కోట్లు ధారబోస్తున్నారు
అయినా ఒరిగేది శూన్యం. అదే వాస్తవం
ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన శివశంకర్‌రెడ్డి
తాడేపల్లి: చంద్రబాబు దావోస్ పర్యటనంతా భజన, అబద్ధాలేనని, అనవసర ఖర్చు తప్ప రాష్ట్రానికి ఏ మేలూ జరగదని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలో 2014–19 మధ్య ఇదే జరిగిందన్న ఆయన, చంద్రబాబు ఎన్నిసార్లు పర్యటించినా, రాష్ట్రానికి పెట్టుబడులు ఏవీ రాలేదని గుర్తు చేశారు. మీడియాకు డబ్బులిచ్చి భారీగా ప్రచారం చేసుకున్నంత మాత్రాన పారిశ్రామికవేత్తలు పెట్టుబడులకు ముందుకొచ్చే అవకాశం ఉండదని తేల్చి చెప్పారు. కమిషన్ల కోసం పారిశ్రామికవేత్తలను వేధించకుండా, పారదర్శకంగా వ్యవహరించి వేగంగా అనుమతులు ఇస్తేనే ఏదైనా సాధ్యమని వెల్లడించారు. అందుకే ఈసారి దావోస్ పర్యటనలో కూడా చంద్రబాబు సాధించేది ఏదీ లేదని తెలిపారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శివశంకర్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు.
ఉత్తుత్తి ప్రచారం. అంతా శూన్యం:
– పెట్టుబడులు ఆకర్షించడం కోసం ఏ ప్రభుత్వమైనా ఇన్వెస్టర్ల సమ్మిట్‌కి వెళ్లడమనేది అతి సహజం. కానీ అతి సాధారణంగా జరిగే ఈ కార్యక్రమానికి చంద్రబాబు ఎప్పుడు హాజరైనా, ఆయన అనుకూల ఎల్లో మీడియా చేసే ప్రచారానికి అవధులే ఉండవు. పచ్చ పత్రికల హడావుడి చూస్తే బాహుబలి, పుష్ప సినిమాలను మించిన ఎలివేషన్లు కనిపిస్తాయి.
– టికెట్లు కొని వెళ్లిరావడమే తరువాయి.. రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు, లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసినట్లు పచ్చ మీడియా ప్రచారం చేస్తోంది.
– దావోస్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం 2014–19 మధ్య చంద్రబాబు నాలుగుసార్లు, లోకేశ్ ఒకసారి వెళ్లి వచ్చారు. ఆ సమయంలో ఎల్లో మీడియా ఇచ్చిన ఎలివేషన్లకి, వాస్తవంగా వచ్చిన పెట్టుబడులకు అసలు పొంతనే లేదు.
ఇవన్నీ వచ్చాయా? ఏర్పాటయ్యాయా?:
– విశాఖలో మైక్రోసాఫ్ట్, విప్రో డేటా సెంటర్, భారీ హార్డ్‌వేర్ పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. ఆంధ్రాకు అలీబాబా, గోల్డ్ రిఫైనరీ పరిశ్రమలు, హైస్పీడ్ రైళ్ల కర్మాగారం, ఏపీకి ఎయిర్ బస్.. సీ 295 విమానాల ఉత్పత్తి కేంద్రం అని హోరెత్తించారు.
– ఇంకా రాష్ట్రంలో చైనా సంస్థ కుమియుమి 15 నుంచి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఆసక్తి చూపుతోందని చెప్పారు. మచిలీపట్నం, కాకినాడలో సౌదీ ఆరంకో రిఫైనరీ అన్నారు.
– దావోస్‌లో అడుగు పెట్టీపెట్టగానే పయనీర్ సంస్థ రూ.5 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినట్టు చెప్పుకొచ్చారు. నవ్యాంధ్రకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ హైబ్రిడ్ క్లౌడ్ టెక్నాలజీతో ముందుకొచ్చిందని ఊదరగొట్టారు.
– త్వరలో హీరో హోండాకి శంకుస్థాపన అని 2016లో ఈనాడు పత్రిక ప్రచురించింది. ప్రకాశం జిల్లాకు జిందాల్.. జేఎస్‌డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్‌తో మంత్రి లోకేశ్ చర్చలు జరిపినట్టు రాసుకొచ్చారు.
– అంతటితో ఆపకుండా ఉక్కు కర్మాగారంతోపాటు అపెరల్ పార్కు, విద్యుత్ కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నారని ఒప్పందం చేసుకున్న ఫొటోలతో పత్రికల్లో సగం పేజీ వార్తలు అచ్చేశారు.
– కానీ, వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పుడు మన కళ్ల ముందు కనపించదు. ఎందుకంటే, ఏ ఒక్కటీ అమలు కాలేదు కాబట్టి.
– అంటే, ఎల్లో పత్రికలు రాసినట్టు ఏ కంపెనీలూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన దాఖలాలు లేవు. కానీ ప్రజల్ని, నిరుద్యోగుల్ని అబద్ధాలతో నమ్మించాలని చూశారు.
– పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలంటే ప్రభుత్వం వద్ద చిత్తశుద్ధి కనిపించాలి. శరవేగంగా అనుమతులు, అవకాశాలు కల్పించాలి. కమీషన్ల కోసం వేధిస్తే ఎవరూ ముందుకు రారు.
ప్రచారం కోసం కోట్లు ఖర్చు:
– జిందాల్ పరిశ్రమ నాటి సీఎం వైఎస్ జగన్ చొరవతో కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొస్తే సినిమా హీరోయిన్‌ని అడ్డం పెట్టుకుని ఆయన్ని బెదిరించి వెనక్కి పోయేలా చేసింది చంద్రబాబు ప్రభుత్వం.
– ఈసారి భజన చేయడానికి చంద్రబాబు ఎల్లో మీడియాతోపాటు నేషనల్ మీడియా కూడా కావాలనుకుంటున్నారు. జీవోలు ఇచ్చి మరీ ఇంగ్లిష్ మీడియా ఛానెళ్లకి కోట్లాది రూపాయలు ముట్టజెప్పి ప్రచారం కోసం భజన కోసం రంగంలోకి దించాడు.
ఆ డబ్బంతా ఏమైంది?:
– రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్లు సాయం చేశానని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెబుతున్నారు.
– మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో రూ.1.19 లక్షల కోట్లు అప్పులు చేసింది. సూపర్ సిక్స్‌లో ప్రజలకిచ్చిన ఒక్క హామీని నెరవేర్చిందీ లేదు.
– మరి ఈ రూ.4 లక్షల కోట్లు ఏమైనట్లు?.
జగన్ హయాంలో కార్యరూపంలోకి:
– అదే గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు కార్యరూపం దాల్చాయి.
– 2022లో నాటి సీఎం వైఎస్ జగన్ ఏ హంగామా లేకుండా దావోస్ పర్యటనకు వెళ్లి వచ్చారు. రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏపీ ప్రభుత్వంతో దావోస్‌లో ఒప్పందం చేసుకున్న కంపెనీలు ఆ తర్వాత రాష్ట్రంలో ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి.
– టెక్ మహేంద్ర సీఈవో సీపీ గుర్నానితో వైయస్ జగన్ భేటీ కావడం, ఆయనతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం.. రాజమండ్రిలో స్థలం కేటాయిస్తే రూ.200 కోట్ల పెట్టుబడులతో ఇథనాల్ ప్లాంట్ పెట్టి ఉత్పత్తిని కూడా ప్రారంభించింది.
– అదానీ గ్రూప్ రూ.60 వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొస్తే ప్రభుత్వం భూములు కేటాయించడం వల్ల, అప్పుడు పనులు శరవేగంగా జరిగాయి.
– రూ.37వేల కోట్లతో గ్రీన్ కో సంస్థతో ఒప్పందం చేసుకుంటే ఓర్వకల్లులో భూములు కేటాయించడం, ఉత్పత్తి కూడా ప్రారంభం కావడం చకచకా జరిగిపోయాయి.
– ఇదే ప్లాంట్‌ను ఇటీవల డిప్యూటీ సీఎం సందర్శించి, ప్రాజెక్టు ఒక అద్భుతమని పొగిడారు.
– ఇవే కాకుండా రూ.28వేల కోట్లతో అరబిందో సంస్థ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌కు ఒప్పందం చేసుకుంటే ఆ పనులు కూడా కొనసాగుతున్నాయి.
– అలా ఆయా కంపెనీల ద్వారా వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. స్థానికంగా లక్షల మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని పుత్తా శివశంకర్‌రెడ్డి వివరించారు.