Best Web Hosting Provider In India 2024
Situationship: ఇప్పుడు యూత్‌లో లేటెస్ట్ ట్రెండ్ సిచ్యువేషన్ షిప్, కేవలం ఆ పని కోసమే కలిసుండే జంటలు
Situationship: ఇండియాలో కూడా పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతోంది. ఇప్పుడు బంధాలే కాదు వాటి అర్థాలు కూడా మారిపోతున్నాయి. మరొక కొత్త ట్రెండ్ వచ్చేసింది. అదే సిచ్యువేషన్ షిప్ ట్రెండ్. దీని గురించి తెలిస్తే మతిపోతుంది.
పాశ్చాత్య సంస్కృతులను మన దేశంలోని యువత త్వరగానే ఒంట పట్టించుకుంటోంది. అలా వచ్చిన వాటిలోనే సిచ్యువేషన్ షిప్ కూడా ఒకటి. మెట్రో నగరాల్లో అధికంగా విస్తరిస్తున్న పద్ధతుల్లో ఇది ఒకటి. అసలు ఏమిటీ సిచ్యువేషన్ షిప్? ఇది ఎలాంటి బంధం?
సిచ్యువేషన్ షిప్ అంటే ఏమిటి
రిలేషన్‌షిప్ ఒకటే అందరికీ తెలిసింది. ఇప్పుడు పరిస్థితులను బట్టి కొత్త కొత్త బంధాలు పుట్టుకొస్తున్నాయి. అలాంటి వాటిల్లో సిచ్యువేషన్ షిప్ కూడా ఒకటి. దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది, వివరించాల్సింది ఏమీ లేదు. ఇది ఒక బంధం అని కూడా చెప్పుకోలేము. దీనిలో ఎలాంటి మానసిక అనుబంధము ఉండదు. కేవలం ఆ క్షణం లేదా ఆ గంట పాటు దొరికే సుఖానికే విలువిస్తారు. ఇదొక రొమాంటిక్ రిలేషన్‌షిప్ అని చెప్పుకోవచ్చు. ఎలాంటి కమిట్మెంట్స్, ఎమోషనల్ బాండింగ్సు వంటివి ఈ సిచ్యువేషన్ షిప్ లో కనిపించవు. తమ కోరికలను తీర్చుకోవడానికి మాత్రమే ఈ ఈ బంధంలోకి వస్తారు. కోరికలు తీరిపోయాక ఎవరి దారిన వారు వెళ్లిపోతారు. ఒకరి నుంచి ఒకరు డిమాండ్ చేయడానికి కూడా ఎలాంటి హక్కులు ఉండవు.
ఈ సిచ్యువేషన్ షిప్‌లో ఉన్న వారిని భాగస్వాములు అని చెప్పుకోవడానికి లేదు. అలాగే లవర్స్ అని కూడా చెప్పుకోకూడదు. ఎందుకంటే వారికి ఎలాంటి ఎమోషనల్ ఫీలింగ్స్ ఉండవు. కేవలం శారీరక కోరికల పైనే ఏర్పడే బంధం ఇది. అలాగే ఎవరి వ్యక్తిగత జీవితాలు వారివే. ఒకరిని ఒకరు ప్రశ్నించుకోకూడదు. వ్యక్తిగత సరిహద్దులను కూడా గీసుకొనే ఈ బంధంలోకి వస్తారు. కేవలం ఎదుటి వ్యక్తి శారీరక అవసరాలు తీర్చడమే భాగస్వామి పనిగా ఉంటుంది. ఒకవేళ ఇద్దరిలో ఎవరికి నచ్చకపోయినా తెగదెంపులు చేసుకొని ఆ క్షణమే వెళ్ళిపోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ షిప్‌లు ఒక రాత్రితో ముగిసిపోయినవి కూడా ఎన్నో ఉన్నాయి. ఎలాంటి ఒప్పందాలు, ఎమోషనల్ బాండింగ్సు లేని ఇలాంటి సిచ్యువేషన్ షిప్‌లు నిలబడవు. కొన్ని ఒకరోజే ఉంటే మరికొన్ని వారంలోనే తెగిపోతున్నాయి. ఇంకొన్ని నెల రోజులకు ముగిసిపోతున్నాయి.
నో పెళ్లి నో ప్రేమ
సిచ్యువేషన్ షిప్‌లోకి వెళ్ళేటప్పుడే పెళ్లి, ప్రేమ వంటి పదాలు ఉండవని ఇద్దరూ ఒకరికొకరు క్లారిటీ ఇచ్చుకున్నాకే ముందుకు వెళతారు. కాబట్టి వదిలేసేటప్పుడు నువ్వు మోసం చేసావు అని అడిగే హక్కు ఎదుటివారికి ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్ షిప్ లోకి వెళ్లేవారు కూడా బంధాలపైన, విలువల పైన, కుటుంబ వ్యవస్థ పైనా ఎలాంటి గౌరవం లేనివారే. ఎక్కువగా అమెరికా, లండన్ వంటి దేశాల్లో ఈ సిచ్యువేషన్ షిప్ ట్రెండ్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో కూడా ఇది అడుగు పెట్టింది.
జనరేషన్ Z వారే ఎక్కువగా ఈ సిచ్యువేషన్ షిప్ ను ఇష్టపడుతున్నారు. వారికి ఎలాంటి అనుబంధాలు, బాధ్యతలు వంటివి పెట్టుకోవడం నచ్చదు. పరిస్థితులకు తగ్గట్టు జీవించడమే వారికి ముఖ్యం. వారే ఈ ఆధునిక డేటింగ్ పద్ధతిని పాటిస్తున్నారు.
సంబంధిత కథనం