Best Web Hosting Provider In India 2024
Amaran TV Premier Date: బ్లాక్‌బస్టర్ అమరన్ టీవీలోకి వచ్చేస్తోంది.. ప్రీమియర్ డేట్, టైమ్ ఇదే
Amaran TV Premier Date: బ్లాక్‌బస్టర్ మూవీ అమరన్ టీవీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన సుమారు మూడు నెలల తర్వాత ఈ సినిమా టీవీ ప్రీమియర్ కు సిద్ధమైంది. స్టార్ మా ఛానెల్ రిపబ్లిక్ డే సందర్భంగా మూవీని టెలికాస్ట్ చేయనుంది.
Amaran TV Premier Date: సాయి పల్లవి, శివకార్తికేయన్ నటించిన మూవీ అమరన్. గతేడాది అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా టీవీలోకి వస్తోంది. తాజాగా స్టార్ మా ఛానెల్ ప్రీమియర్ తేదీని అనౌన్స్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్లకుపైగా వసూలు చేసి సంచలనం సృష్టించిన ఈ మూవీ.. తర్వాత ఓటీటీలోనూ దూసుకెళ్లింది.
అమరన్ టీవీ ప్రీమియర్ డేట్ ఇదే
ఇండియన్ ఆర్మీ రాజ్‌పుత్ రెజిమెంట్ లో సేవలందించి అమరుడైన ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ అమరన్. ఇందులో ముకుంద్ పాత్రలో శివకార్తికేయన్ నటించగా.. అతని భార్య రెబెకా పాత్రలో సాయిపల్లవి నటించింది. ఇప్పుడీ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా వచ్చే ఆదివారం (జనవరి 26) సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మా ఛానెల్లో టెలికాస్ట్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఛానెల్ ఈ మధ్య అనౌన్స్ చేసింది.
నిజానికి ఈ మూవీ తమిళ, కన్నడ వెర్షన్లు గత ఆదివారమే (జనవరి 19) టెలికాస్ట్ అయ్యాయి. తెలుగు వెర్షన్ ను మాత్రం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
అమరన్ మూవీ ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అందులోనూ ఈ మూవీ సత్తా చాటుతోంది. రికార్డు స్ట్రీమింగ్ మినట్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.60 కోట్లకు దక్కించుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. గతేడాది డిసెంబర్ 5 నుంచి ఆ ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
అమరన్ మూవీ గురించి..
అమరన్ మూవీ ముకుంద్ వరదరాజన్ అనే ఓ ఆర్మీ మేజర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా. ఇందులో మేజర్ ముకుంద్ పాత్రలో శివకార్తికేయన్ నటించగా.. అతని భార్య రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి కనిపించింది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లో కమల్ హాసన్ మూవీని నిర్మించగా.. రాజ్ కుమార్ పెరియసామి డైరెక్ట్ చేశాడు.
సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. బాక్సాఫీస్ దగ్గర అంతకు సుమారు మూడు రెట్లు ఎక్కువ వసూలు చేసింది. గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఓవరాల్ గా కూడా అత్యధిక వసూళ్ల తమిళ సినిమాల జాబితాలో 8వ స్థానంలో ఉంది.