Crime Thriller Movie: తెలుగులోకి వ‌స్తోన్న త్రిష మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ – ట్రైల‌ర్ రిలీజ్‌

Best Web Hosting Provider In India 2024

Crime Thriller Movie: తెలుగులోకి వ‌స్తోన్న త్రిష మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ – ట్రైల‌ర్ రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 21, 2025 06:07 AM IST

Crime Thriller Movie: టోవినో థామ‌స్‌, త్రిష హీరోహీరోయిన్లుగా న‌టించిన మ‌ల‌యాళం యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఐడెంటిటీ తెలుగులోకి వ‌స్తోంది. జ‌న‌వ‌రి 24న థియేట‌ర్ల‌లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్ సోమ‌వారం రిలీజైంది. ఈ థ్రిల్ల‌ర్ మూవీలో విన‌య్ రాయ్‌, మందిరాబేడి కీల‌క పాత్ర‌లు పోషించారు.

క్రైమ్ థ్రిల్లర్ మూవీ
క్రైమ్ థ్రిల్లర్ మూవీ

టోవినో థామ‌స్‌, త్రిష హీరోహీరోయిన్లుగా న‌టించిన మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఐడెంటిటీ అదే పేరుతో తెలుగులో డ‌బ్ అవుతోంది. జ‌న‌వ‌రి 24న ఈ మూవీ థియేట‌ర్ల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. ఈ థ్రిల్ల‌ర్ మూవీలో విన‌య్ రాయ్‌, మందిరాబేడి కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాకు అఖిల్ పాల్‌, అనాస్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు.

yearly horoscope entry point

స్కెచ్ ఆర్టిస్ట్‌గా…

యాక్ష‌న్ అంశాల‌తో ఉత్కంఠ‌భ‌రితంగా ట్రైల‌ర్ సాగింది. విజువ‌ల్స్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ ట్రైల‌ర్‌లో హైలైట్‌గా నిలుస్తోన్నాయి. ఐడెంటిటీ మూవీలో టోవినో థామ‌స్ స్కెచ్ ఆర్టిస్ట్‌గా క‌నిపించ‌బోతున్నాడు. సంచ‌ల‌నం సృష్టించిన ఓ మ‌ర్డ‌ర్ కేసును ఓ పోలీస్ ఆఫీస‌ర్‌, స్కెచ్ ఆర్టిస్ట్ క‌లిసి ఎలా సాల్వ్ చేశారు అనే క‌థ‌తో ఐడెంటిటీ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు ట్రైల‌ర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ సినిమాలో త్రిష ఓ పెద్ద క్రైమ్‌కు ప్ర‌త్య‌క్ష సాక్షిగా నిలిచిన యువ‌తిగా క‌నిపించ‌బోతున్న‌ది.

న‌ల‌భై కోట్ల క‌లెక్ష‌న్స్‌…

మ‌ల‌యాళంలో జ‌న‌వ‌రి 2న థియేట‌ర్ల‌లో రిలీజైన ఐడెంటిటీ రెండు వారాల్లోనే న‌ల‌భై కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. కాన్సెప్ట్‌తో పాటు ఈ సినిమాలోని ట్విస్ట్‌లు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

సంక్రాంతికే అనుకున్నాం కానీ…

తెలుగు ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రొడ్యూస‌ర్ చింత‌ప‌ల్లి రామారావు మాట్లాడుతూ…”సంక్రాంతికి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాల‌ని అనుకున్నాం. కానీ ఆ టైమ్‌లో ఇక్కడ సినిమాలు ఎక్కువ‌గా ఉండటంవల్ల కుద‌ర‌లేదు. అందుకే ఈనెల 24వ తేదీన విడుదల చేస్తున్నాము. ఈ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌కు టోవినో థామ‌స్‌, త్రిష హాజ‌రుకావాల్సింది.

కానీ అనివార్య‌ కారణాల వ‌ల్ల కుద‌ర‌లేదు అని అన్నారు. ఐడెంటిటీ మలయాళ సినిమా అయినప్పటికీ ఇందులో న‌టించిన న‌టీన‌టులు, ప‌నిచేసిన సాంకేతిక నిపుణులు అంద‌రూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుపరిచితులు కావడం విశేషం. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ల‌వ‌ర్స్ ఇష్ట‌ప‌డే అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగులు ఈ సినిమాలో ఉంటాయ ” అన్నారు.

సూప‌ర్ హిట్ టాక్‌…

అఖిల్ పాల్ మాట్లాడుతూ… “ఈ సినిమా కోసం టోవినో థామ‌స్‌, త్రిష‌తో పాటు ప్ర‌తి ఒక్క‌రు రెండేళ్ల‌కుపైగా క‌ష్ట‌ప‌డ్డారు. టోవినో థామ‌స్ లేక‌పోతే ఈ సినిమా లేదు. నిర్మాతలతో కలిసి ఆయన కూడా ఈ సినిమా కోసం నిలబడ్డారు. మ‌ల‌యాళంలోనే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ మూవీస్‌లో ఒక‌టిగా ఐడెంటిటీ సినిమాను రూపొందించాం. .స్క్రిప్ట్ నుండి యాక్షన్ సీన్స్ వరకు ప్ర‌తి ఒక్క‌టి కొత్త‌గా ఉంటుంది. మ‌ల‌యాళంలో మాదిరిగానే తెలుగులోనూ ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటుంద‌నే న‌మ్మ‌క‌ముంది” అని తెలిపారు.

హ‌నుమాన్ త‌ర‌హాలోనే..

“తెలుగులో ప్రశాంత్ వర్మ హ‌నుమాన్ స్థాయిలోనే మ‌ల‌యాళంలో ఐడెంటిటీ న‌టుడిగా నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్ల‌ర్ హంగుల‌తో తెలుగు ఆడియెన్స్‌కు స‌రికొత్త విజువ‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను ఈ మూవీ అందిస్తుంది” అని న‌టుడు విన‌య్ రాయ్ చెప్పాడు.

ఐడెంటిటీ మూవీకి జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందించగా అఖిల్ జార్జ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. శ్రీనివాస్ మామిడాల సమర్పణలోచింతపల్లి రామారావు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోన్నారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024