NNS 21st January Episode: అమర్ గొంతు పట్టుకున్న రాథోడ్.. షాకైన అమర్​ కుటుంబం.. ఘోరాతో ఆరుకి పొంచి ఉన్న ప్రమాదం​!

Best Web Hosting Provider In India 2024

NNS 21st January Episode: అమర్ గొంతు పట్టుకున్న రాథోడ్.. షాకైన అమర్​ కుటుంబం.. ఘోరాతో ఆరుకి పొంచి ఉన్న ప్రమాదం​!

Hari Prasad S HT Telugu
Jan 21, 2025 06:00 AM IST

NNS 21st January Episode: నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (జనవరి 21) ఎపిసోడ్లో అమర్ గొంతు పట్టుకుంటాడు రాథోడ్. అది చూసి అమర్ కుటుంబం మొత్తం షాక్ తింటుంది. ఇంతలో ఘోర సీన్లో ఎంటరవుతాడు. తర్వాత ఏం జరిగిందంటే..

అమర్ గొంతు పట్టుకున్న రాథోడ్.. షాకైన అమర్​ కుటుంబం.. ఘోరాతో ఆరుకి పొంచి ఉన్న ప్రమాదం​!
అమర్ గొంతు పట్టుకున్న రాథోడ్.. షాకైన అమర్​ కుటుంబం.. ఘోరాతో ఆరుకి పొంచి ఉన్న ప్రమాదం​!

NNS 21st January Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (జనవరి 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఆరు, గుప్త మాట్లాడుకుంటుంటే రాథోడ్​ విచిత్రంగా నవ్వుతూ ఇంట్లోకి వెళ్తూ వారివైపు చూస్తూ నవ్వుతాడు. గుప్త, ఆరు రాథోడ్​కి ఏదో అయ్యిందని అనుమానిస్తారు. ఎప్పుడు లేనిది ఇవాళేంటి ఇలా ఉన్నాడు అనుకుంటారు. మనం కనిపిస్తున్నట్టు మనల్ని చూసి నవ్వుతున్నాడు అనుకుంటారు.

yearly horoscope entry point

మనోహరిలో ఆందోళన

లోపలికి వెళ్లిన రాథోడ్‌.. అమర్‌ ను చూసి గుడ్‌ మార్నింగ్ సార్‌ వెహికిల్స్‌ ఆల్‌ రెడీ అంటాడు. ఇంతలో మిస్సమ్మ లగేజీ తీసుకుని వచ్చి రాథోడ్ ఈ బ్యాగులు అన్ని కార్లలో పెట్టు అని ఇస్తుంది. రాథోడ్ బ్యాగులు తీసుకుని బయటకు వెళ్తాడు. మనోహరి టెన్షన్‌ పడుతుంది. అమర్‌ ప్రాణాలకు తెగించి అయినా ఆరు అస్థికలను కాపాడతాడు. కానీ ఘోర కసితో ఉన్నాడు.

ఎలాగైనా అమర్‌ కు విషయం చెప్పాలి అని మనసులో అనుకుంటుంది. ఇంతలో అమర్‌ అస్థికలు తీసుకుంటుంటే ఏవండి అస్థికలు నేను తీసుకొస్తాను మీరు వెళ్లండి అని మిస్సమ్మ చెప్పగానే.. అలాగే అమ్మా నాన్నలను త్వరగా రమ్మని చెప్పు అని వెళ్లిపోతాడు అమర్​.

మనోహరిని నిలదీసిన రాథోడ్

అమర్‌ వెనకాలే మనోహరి బయటకు వెళ్తుంది. అమర్‌ నాకెందుకో ఆ ఘోర మనల్ని అడ్డుకోవడానికి ఏదైనా చేస్తాడేమో అనిపిస్తుంది అంటుంది. ఏమైనా అంటే అని అమర్‌ అడగ్గానే.. మనల్ని ఆపడానికి పూజలు చేయడం.. తంత్రాలు చేయడం.. మనుషుల్ని తీసుకొచ్చి అటాక్‌ చేయడం లాంటివి చేయొచ్చు అంటుంది. వాడు ఇప్పటి వరకు నాకు ఎదురుపడలేదు కాబట్టి వాడి ఆటలు సాగుతున్నాయి. నువ్వు అన్నట్టు వాడు ఈసారి ఎదురుపడితే వాడి ఆటలు సాగనివ్వను అంటాడు.

నాకు తెలుసు అమర్‌ కానీ ఎందుకైనా మంచిది ఎవరైనా సెక్యూరిటీని తీసుకుందామని చెప్తుంది. పక్కనే వింటున్న రాథోడ్‌ మీకంత ప్రాణభయంగా ఉంటే ఇంట్లోనే ఉండిపోండి అంటాడు. నువ్వేంటి అలా మాట్లాడావు అని మను అడగ్గానే.. ఎలా మాట్లాడాను మనోహరి గారు. ఘోరాకు మీరు భయపడి మా సారును కూడా భయపెడుతున్నారా.. అంటాడు.

ఇంతలో ఇంట్లోంచి అందరూ వస్తారు. మిస్సమ్మ వచ్చి ఏవండి ఇక మనం బయలుదేరుదామా అనగానే.. అందరూ వెళ్లి కార్లు ఎక్కుతుంటే.. మిస్సమ్మ వెంటనే ఆరు అక్కా ఫోటో మర్చిపోయాను.. తీసుకొస్తాను అంటూ ఇంట్లోకి వెళ్లబోతుంది. కానీ మనోహరి ఆపడానికి ప్రయత్నిస్తుంది. అయినా మిస్సమ్మ లోపలికి వెళ్తుంది. మనోహరి టెన్సన్‌ పడుతుంది. ఇంతలో బ్యాగ్‌ తీసుకుని మిస్సమ్మ రావడంతో మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది.

రూటు మార్చిన రాథోడ్

చెట్టు చాటు నుంచి జరుగుతున్నదంతా గమనిస్తుంది ఆరు. అందరూ బయలుదేరుతారు. కారులో వెళ్తుంటే మనోహరి టెన్షన్‌ పడుతుంది. ఆ ఘోర ఎటువైపు నుంచి వస్తాడో అని భయపడుతుంది. అనవసరంగా వాడిని నమ్ముకుని తప్పు చేశాను అనుకుంటుంది. ఏంటి మనోహరి అంతలా టెన్షన్‌ పడుతున్నావు అంటూ శివరాం అడుగుతాడు. కారు ఎక్కిన్నప్పటి నుంచి భయపడుతున్నావేంటి అంటుంది నిర్మల. ఏం లేదని చెప్తుంది మనోహరి.

వెనక కారులో ఉన్న మిస్సమ్మ అదేంటండి రాథోడ్ అంత ర్యాష్‌ గా డ్రైవ్‌ చేస్తున్నాడేంటి అంటుంది. ఏమో నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటాడు అమర్‌. ఇంతలో రాథోడ్‌ రూట్‌ మారుస్తాడు. ఏవండి ఎయిర్‌ ఫోర్ట్‌ కు వెళ్లేది ఇటు కదా రాథోడ్‌ అటు వెళ్తున్నాడేంటి అంటుంది మిస్సమ్మ.. ఏమైనా షార్ట్‌ కట్‌లో వెళ్తున్నాడా..? అనగానే ఏమో నాకు చెప్పకుండా రూట్‌ మార్చడు అంటాడు అమర్‌.

కారులో ఉన్న మనోహరి కూడా రాథోడ్‌ ఎయిర్ పోర్టుకు అటు కదా వెళ్లేది ఇటు వెళ్తున్నావేంటి అనగానే.. రామ్మూర్తి కూడా ఎక్కడికి వెళ్తున్నావు రాథోడ్‌ అంటాడు. అయినా వినకుండా.. పలకకుండా డ్రైవ్‌ చేస్తుంటాడు. వెనకాలే వస్తున్న ఆరు, గుప్త కూడా ఆశ్యర్యపోతారు. ఇంతలో మిస్సమ్మ రాథోడ్‌కు ఫోన్‌ చేస్తుంది. రాథోడ్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేయడు. కారులో ఉన్నవాళ్లంతా కంగారుపడుతుంటారు.

అమర్ గొంతు పట్టుకున్న రాథోడ్

వెంటనే మిస్సమ్మ మనోహరి కాల్ చేసి రాథోడ్‌ కారు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని అడగ్గానే.. ఏమో అర్థం కావడం లేదు. రాథోడ్‌ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్తుంది మనోహరి. అమర్‌ కారు స్పీడు పెంచి రాథోడ్‌ ను ఓవర్‌ టేక్‌ చేస్తాడు. కారు ఆపి వెళ్లి రాథోడ్‌ను పట్టుకోగానే రాథోడ్‌ అమర్‌ గొంతు పట్టుకుని పైకి ఎత్తి చెట్టుకు వేలాడదీస్తాడు. అందరూ భయంతో వణుకుతుంటారు. ఆరు భయంతో ఏమైంది గుప్త గారు రాథోడ్‌ కు ఏమైంది అని అడుగుతుంది.

ఆ ఘోర విధ్వంసం మొదలైందని చెప్తాడు గుప్త. ఇంతలో అక్కడికి ఘోర వస్తాడు. నీ ఇంటి మనిషి రాథోడ్‌ ఇలా అయ్యాడేంటని ఆందోళన పడుతున్నావా..? దానికి కారణం నేనే అంటాడు ఘోర. ఇంతలో రాథోడ్‌ కిందపడిపోతాడు. నాకు కావాల్సింది ఒక్కటి మీ దగ్గర ఉంది. నాకు కావాల్సింది నాకు ఇస్తే నేను వెళ్లిపోతా, నేను చెప్పింది మీకు అర్థం కాలేదనుకుంటా. నాకు కావాల్సింది ఆ అస్థికలు అంటాడు.

దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఆరు భయంతో ఘోర ఏమైనా చేస్తాడేమో మీరే ఏదైనా చేయండి అని గుప్తను అడుగుతుంది. ఘోరా అస్థికల్ని దక్కించుకుంటాడా? అమర్​ ఆరు అస్థికల్ని ఎలా కాపాడతాడు? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు జనవరి​ 21న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024