Best Web Hosting Provider In India 2024
Ravi Teja: ఎన్టీఆర్ టెంపర్ మూవీ రవితేజ చేయాల్సింది- మెహర్ రమేష్ డైరెక్టర్ – టైటిల్ ఫిక్సయిన తర్వాత ఎందుకు ఆగిందంటే
Ravi Teja: ఎన్టీఆర్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన టెంపర్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్‌కు కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. ఎన్టీఆర్ కంటే ముందు టెంపర్ కథతో మెహర్ రమేష్ దర్శకత్వంలో రవితేజ సినిమా చేయాలని అనుకున్నాడు.
Ravi Teja:జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో టెంపర్ ఒకటి. శక్తి, దమ్ము, రామయ్య వస్తావయ్యా, రభస వంటి బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్‌తో ఎన్టీఆర్ కెరీర్ డౌన్ అవుతోన్న టైమ్‌లో వచ్చిన మూవీ ఇది. టెంపర్ మూవీతో ఎన్టీఆర్‌ను తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కించాడు పూరి జగన్నాథ్. 35 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ అప్పట్లోనే 75 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
నాలుగు వందల కోట్ల కలెక్షన్స్…
అవినీతి పరుడైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎన్టీఆర్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. టెంపర్ మూవీ బాలీవుడ్, తమిళ భాషల్లో రీమేకైంది. బాలీవుడ్‌లో ఏకంగా ఈ మూవీ నాలుగు వందల కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
రవితేజ చేయాల్సింది…
ఎన్టీఆర్‌పు ఫ్లాపుల నుంచి గట్టెక్కించిన టెంపర్ మూవీ కథతో రవితేజ సినిమా చేయాల్సింది. టైటిల్, డైరెక్టర్ ఫిక్సయిన ఆ తర్వాత ఈ సినిమా ఆగిపోవడంతో ఎన్టీఆర్ దగ్గరకు ఈ కథ చేరింది. 2014 టైమ్‌లో రవితేజతో మంచి మాస్, యాక్షన్ సినిమా చేయాలని డైరెక్టర్ మెహర్ రమేష్ ప్లాన్ చేశారు.
ఆ టైమ్‌లోనే వక్కంతం వంశీ చెప్పిన టెంపర్ కథ నచ్చడంతో అదే స్క్రిప్ట్‌ను తమ సినిమా కోసం లాక్ చేశారు. ఈ సినిమాకు పవర్ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. టెంపర్ కథ నచ్చడంతో రవితేజ కూడా మెహర్ రమేష్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కొన్నాళ్ల పాటు జరిగాయి. షూటింగ్ మొదలు పెట్టే టైమ్‌లోనే బడ్జెట్‌తో పాటు ఇతర కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది.
పవర్ టైటిల్…
రవితేజ, మెహర్ రమేష్ కాంబో వర్కవుట్ కాలేదు. ఈ పవర్ టైటిల్‌ను రవితేజ, బాబీ కలయికలో వచ్చిన సినిమా కోసం వాడారు. ఆ తర్వాత ఈ టెంపర్ కథ పూరి జగన్నాథ్ కంపౌడ్‌కు చేరడం, ఎన్టీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సినిమాగా సిల్వర్ స్క్రీన్‌పైకి వచ్చింది.
పటాస్ కూడా…
మెహర్ రమేష్ సినిమా కోసం రవితేజ పటాస్ సినిమాను వదులుకున్నాట. దర్శకుడిగా మారే ప్రయత్నాల్లో ఉన్న అనిల్ రావిపూడి…తాను సిద్ధం చేసుకున్న పటాస్ కథను రవితేజకు వినిపించాడట. అప్పటికే మెహర్ రమేష్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, రెండు కథలు ఒకే పాయింట్‌తో సాగడంతో పటాస్‌ను చేయనని అనిల్ రావిపూడితో రవితేజ చెప్పాడట.
నందమూరి బ్రదర్స్‌కు హిట్లు…
రవితేజ మిస్ చేసుకున్న టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించగా…పటాస్ సినిమాలో కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా కనిపించారు. ఈ రెండు సినిమాలు నందమూరి బ్రదర్స్‌ను ఫ్లాపుల నుంచి గట్టెక్కించడమే కాకుండా బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి.