Pani Review: ఓ రేంజ్‌లో వ‌య‌లెన్స్ – లేటెస్ట్ మ‌ల‌యాళం యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Best Web Hosting Provider In India 2024

Pani Review: ఓ రేంజ్‌లో వ‌య‌లెన్స్ – లేటెస్ట్ మ‌ల‌యాళం యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Nelki Naresh Kumar HT Telugu
Jan 21, 2025 02:55 PM IST

Pani Review: మ‌ల‌యాళ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ప‌ని ఇటీవ‌లే సోనీలివ్ ఓటీటీలో రిలీజైంది. జోజు జార్జ్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

పని మూవీ రివ్యూ
పని మూవీ రివ్యూ

Pani Review: మ‌ల‌యాళ వెర్స‌టైల్ యాక్ట‌ర్ జోజు జార్జ్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప‌ని మూవీ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో బిగ్‌బాస్ కంటెస్టెట్లు సాగ‌ర్ సూర్య‌, జునైద్ విల‌న్లుగా న‌టించారు. అభిన‌య కీల‌క పాత్ర పోషించింది. తెలుగులో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?

yearly horoscope entry point

డాన్‌పై రివేంజ్‌…

త్రిసూర్‌కు చెందిన గిరి ( జోజు జార్జ్‌) త‌న బంధువులైన సాజీ, డేవీ, కురువిల్లాల‌లో క‌లిసి రియ‌ల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్లు, దందాలు చేస్తుంటాడు. రౌడీ జీవితానికి స్వ‌స్తి చెప్పి కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి సంతోషంగా జీవితాన్ని సాగిస్తుంటాడు. డాన్ సెబాస్టియ‌న్ (సాగ‌ర్ సూర్య‌), సిజు(జునైద్‌) బైక్ మెకానిక్‌లుగా ప‌నిచేస్తుంటారు. డ‌బ్బు బాగా సంపాదించాల‌నే అడ్డ దారుల్లో అడుగులు వేస్తారు.

ఓ వ్య‌క్తిని హ‌త్య చేస్తారు. షాపింగ్ మాల్‌లో గిరి భార్య గౌరితో (అభిన‌య‌) అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తాడు డాన్‌. అత‌డితో పాటు సిజును గిరి కొడ‌తాడు. గౌరిపై ప‌గ‌ను పెంచుకున్న డాన్‌, సిజు ఏం చేశారు? గిరి బంధువుల‌ను ఒక్కొక్క‌రిగా ఎలా చంపేశారు? డాన్‌, సిజుల‌ను ప‌ట్టుకోవ‌డానికి గిరి ఏం చేశాడు? త‌న‌వారి చావుకు కార‌ణ‌మైన డాన్, సిజుల‌పై గిరి ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? అన్న‌దే ప‌ని మూవీ క‌థ‌.

ట్రెండ్ మారింది…

ప్ర‌స్తుతం యాక్ష‌న్ సినిమాల ట్రెండ్‌ మారింది. మితిమీరిన హింస‌, ర‌క్త‌పాతంతో యాక్ష‌న్ క‌థ‌ల‌ను చెప్ప‌డం స్టైల్‌గా మారిపోయింది. యానిమ‌ల్ నుంచి ఇటీవ‌ల వ‌చ్చిన మార్కో వ‌ర‌కు చాలా సినిమాలు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతూ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. ప‌ని కూడా ఆ కోవ‌కు చెందిన సినిమానే. ఓ గ్యాంగ్‌స్ట‌ర్‌కు, ఇద్ద‌రు సాధార‌ణ యువ‌కుల‌కు మ‌ధ్య జ‌రిగే పోరాటం నేప‌థ్యంలో రివేంజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా హీరో క‌మ్ డైరెక్ట‌ర్ జోజు జార్జ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

విల‌న్ పాత్ర ఎంత వయలెంట్ గా ఉంటే…

యాక్ష‌న్ సినిమాల్లో విల‌న్ పాత్ర ఎంత వయలెంట్ గా, ప‌వ‌ర్‌ఫుల్‌గా రాసుకుంటే హీరోయిజం అంత‌గా ఎలివేట్ అవుతుంది. ఈ క‌మ‌ర్షియ‌ల్ సూత్రాన్ని న‌మ్మే జోజు జార్జ్ ప‌ని సినిమాను తెర‌కెక్కించారు. భ‌యానికే మీనింగ్ తెలియ‌ని వారిగా డాన్‌, సిజు పాత్ర‌ల్ని మ‌లిచారు. గిరి అన్న అంటూ గౌర‌వంగా పిలుస్తూనే వీరిద్వారా విల‌నిజాన్ని పండించ‌డం డిఫ‌రెంట్‌గా ఉంది. గిరికి డాన్, సిజుకు మ‌ధ్య వ‌చ్చే ఛేంజింగ్ ఎపిసోడ్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్ యాక్ష‌న్ ఎపిసోడ్‌లో ర‌క్త‌పాతాన్ని పీక్స్‌లో చూపించేశాడు.

నా పేరు శివ‌తో పాటు…

ప‌ని మూవీ కాన్సెప్ట్ కొత్త‌దేమీ కాదు. కార్తి నా పేరు శివ‌తో పాటు ఈ పాయింట్‌తో ద‌క్షిణాదిలో చాలా సినిమాలొచ్చాయి. టేకింగ్‌, స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తోనే ఫ్రెష్‌ఫీల్‌ను ఆడియెన్స్‌లో క‌లిగించే ప్ర‌య‌త్నం చేశాడు జోజు జార్జ్‌. ఈ ప్ర‌య‌త్నంలో కొంత వ‌ర‌కే స‌క్సెస్ అయ్యారు.

క్లైమాక్స్ సింపుల్‌…

విల‌న్ గ్యాంగ్ వేసే ఎత్తుల‌ను హీరో తిప్పికొట్టే సీన్స్‌లో థ్రిల్ అనుకున్న స్థాయిలో పండ‌లేదు. హీరో ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఒక్క‌క్క‌రిని విల‌న్స్ టార్గెట్ చేసుకుంటూ వెళ్లిపోయిన‌ట్లుగా చివ‌రి వ‌ర‌కు చూపించారు.చివ‌ర‌లో పోలీసుల‌ ద‌గ్గ‌ర నుంచి విల‌న్స్‌ను హీరో కిడ్నాప్ చేసే స‌న్నివేశంలో లాజిక్ మిస్స‌యింది.

కిక్కు ఉండ‌దు…

ఇలాంటి రివేంజ్ థ్రిల్ల‌ర్ సినిమాల్లో విల‌న్లు హీరోగా ఈజీగా దొరికిపోతే సినిమా చూసే ఆడియెన్స్‌కు కిక్కు ఉండ‌దు. ఆడియెన్స్ బ్రెయిన్‌కు ప‌దునుపెట్టే ట్విస్ట్‌లు ఉండాలి. అప్పుడే ఎగ్జైటింగ్‌గా ఫీల‌వుతారు. అలాంటి మెరుపులు ఈ సినిమాలో లేవు. చాలా వ‌ర‌కు ప‌ని మూవీ క‌థ ప్రెడిక్ట‌బుల్‌గా ఉంటుంది.

బిగ్‌బాస్ కంటెస్టెంట్‌…

గిరి పాత్ర‌లో జోజు జార్జ్ వైవిధ్య‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. త‌క్కువ డైలాగ్స్‌తో హీరోయిజం చూపించ‌డం బాగుంది. జోజు జార్జ్ త‌ర్వాత డాన్ సెబాస్టియ‌న్ పాత్ర‌లో న‌టించిన బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ సాగ‌ర్ సూర్య‌యాక్టింగ్ ప‌రంగా మెప్పించాడు. అత‌డి స్నేహితుడిగా జునైజ్ యాక్టింగ్ ఓకే. జోజు జార్జ్ వైఫ్ పాత్ర‌లో అభిన‌య త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. సామ్ సీఎస్‌, సంతోష్ నారాయ‌ణ‌న్ బీజీఎమ్ అంత ఎఫెక్టివ్‌గా లేదు.

రొటీన్ రివేంజ్ థ్రిల్ల‌ర్‌…

ప‌ని రొటీన్ రివేంజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ. న‌టుడిగా త‌న పాత్ర‌కు న్యాయం చేసిన జోజు జార్జ్ డైరెక్ట‌ర్‌గా మాత్రం ప‌ని మూవీతో మెప్పించ‌లేక‌పోయాడు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024