Best Web Hosting Provider In India 2024
Chilli Paneer Paratha: మీకు పరోటాలంటే అంటే ఇష్టమా..? అయితే కొత్తగా ఇలా చీల్లీ పనీర్‌తో తయారు చేసుకుని తినండి!
Chilli Paneer Paratha: చలికాలంలో వేడివేడి పరాఠాలు తినడం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ ఆనందాన్ని రెట్టింపు చేయడానికి, మేము మీ కోసం చిల్లీ పనీర్ పరాఠా రెసిపీని తీసుకువచ్చాము, ఇది రుచి మరియు ఆరోగ్యానికి అద్భుతమైన కలయిక.
चिली पनीर पराठा (Shutterstock)
వేడివేడి పరోటాలు తినడం ఎవరికి ఇష్టం ఉండదు. ముఖ్యంగా చలికాలంలో వీటి రుచి మరింత పెరుగుతుంది. రకరకాల స్టఫ్ఫింగ్‌తో రుచికరమైన, ఆరోగ్యకరమైన పరోటాలు తయారు చేయచ్చు. ఇప్పటివరకు మీరు బంగాళాదుంప, క్యాబేజీ, పనీర్ లేదా ముల్లంగి వంటి సాధారణ ఫిల్లింగ్‌లతో పరోటాలు తిని ఉంటారు. కానీ ఎప్పుడైనా చిల్లీ పనీర్ పరోటాలు ప్రయత్నించారా? లేకపోతే ఇప్పుడు ప్రయత్నించి చూడండి. రుచికరమైన, ఆరోగ్యకరమైన చీల్లీ పనీర్ పరోటాలు తయారు చేయడం కూడా చాలా సులభం. ఇంటిలోని ప్రతి ఒక్కరికీ వీటి రుచి చాలా నచ్చుతుంది. ఇదిగో రెసిపీ..
చిల్లీ పనీర్ పరాఠా తయారీకి కావలసినవి:
- గోధుమ పిండి (ఒక కప్పు),
- వెల్లుల్లి (6-7 రెబ్బలు),
- పచ్చిమిర్చి (5-6),
- వేరుశనగ పప్పు (రెండు టీస్పూన్లు),
- జీలకర్ర (రెండు టీస్పూన్లు),
- పనీర్ (సుమారు 100 గ్రాములు),
- రుచికి సరిపడా ఉప్పు,
- కొత్తిమీర తరుగు,
- నెయ్యి
చిల్లీ పనీర్ పరాఠా తయారీ విధానం
- రుచికరమైన ఆరోగ్యకరమైన చిల్లీ పనీర్ పరాఠా తయారు చేయడానికి ముందుగా ఒక పాన్‌ను స్టవ్ మీద ఉంచండి.
- పాన్‌లో ఒక టీస్పూన్ నెయ్యి లేదా ఏదైనా ఇతర నూనె వేసి వేడి చేయండి.
- అది వేడెక్కిన తర్వాత, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, వేరుశనగ పప్పు వేసి వేయించండి.
- మీడియం మంట మీద వీటిని మూడు నుండి నాలుగు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేయండి.
- ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీలో వేసి పొడి చేయండి.
- ఇప్పుడు పిండి కలపడం.
- ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండిని తీసుకోండి. దానిలో ఈ పొడి చేసిన మిశ్రమాన్ని వేయండి. తురిమిన పనీర్, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీస్పూన్ నెయ్యి కూడా వేయండి.
- ఇప్పుడు దీంట్లో కొద్దికొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోస్తూ పిండిని బాగా కలపండి.
- పిండిని మరీ మెత్తగా అవకుండా మీర గట్టిగా అవకుండా చూడండి.
- కలిపిన ఈ పిండిని ఐదు నుండి పది నిమిషాలు వరకూ మూతపెట్టి కప్పి ఉంచండి.
- తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేయండి. తర్వాత పరోటాల్లా తయారు చేసుకోండి.
- ఇప్పుడు ఈ పరాఠాలను నెయ్యిలో వేయించి వేడివేడిగా సర్వ్ చేసుకుని తినేయండి.
- స్పైసీ అండ్ టేస్టీ చిల్లీ పనీర్ పరాఠా తయారయైటనట్టే. దీన్ని పప్పు లేదా మీకు నచ్చిన ఇతర కూరలతో ఉదయం లేదా సాయంత్రం తినచ్చు.
సంబంధిత కథనం