Anantapur DRO : కలెక్టరేట్ లో కీలక సమావేశం, ఆన్లైన్ లో రమ్మీ ఆడుకుంటున్న అధికారి-వీడియో వైరల్

Best Web Hosting Provider In India 2024

Anantapur DRO : కలెక్టరేట్ లో కీలక సమావేశం, ఆన్లైన్ లో రమ్మీ ఆడుకుంటున్న అధికారి-వీడియో వైరల్

Bandaru Satyaprasad HT Telugu Jan 21, 2025 03:53 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Jan 21, 2025 03:53 PM IST

Anantapur DRO : ఒకవైపు ఎస్సీ వర్గీకరణపై కీలక సమావేశం జరుగుతున్న సమయంలో…ఓ రెవెన్యూ అధికారి సెల్ ఫోన్ లో పేకాట అడుతూ మీడియా కెమెరాకు చిక్కారు. అధికారి నిర్వాకం వైరల్ కావడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

కలెక్టరేట్ లో కీలక సమావేశం, ఆన్లైన్ లో రమ్మీ ఆడుకుంటున్న అధికారి-వీడియో వైరల్
కలెక్టరేట్ లో కీలక సమావేశం, ఆన్లైన్ లో రమ్మీ ఆడుకుంటున్న అధికారి-వీడియో వైరల్
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

Anantapur DRO : అనంతపురం కలెక్టరేట్ లో ఓ రెవెన్యూ అధికారి నిర్వాకం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఓ కీలక సమావేశంలో పాల్గొన్న అధికారి…ఫోన్ లో రమ్మీ ఆడుతూ కనిపించారు. సమావేశాన్ని వీడియో తీస్తున్న క్రమంలో అధికారి నిర్వాకం కెమెరాకు చిక్కింది. అనంతపురం కలెక్టరేట్‌లోనే ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్లు వినోద్ కుమార్, చేతన్, ఎస్పీ జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న డీఆర్వో మలోల…కలెక్టర్లు ఉన్న సభావేదికపై కూర్చొన్నారు.

yearly horoscope entry point

ఒకవైపు కలెక్టర్, అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ… వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఇంకోవైపు డీఆర్వో మలోల తాపీగా తనకేం పట్టనట్లుగా సెల్ ఫోన్ లో రమ్మీ ఆడుతూ కనిపించారు. సమావేశం జరుగుతున్న హాల్ లో వందల మంది ప్రజలు, కలెక్టర్లు, ఎస్పీ, అధికారులు, మీడియా ప్రతినిధులు అందరూ ఉన్నా…డీఆర్వో తనపనిలో తాను మునిగిపోయారు. డీఆర్వో రమ్మీ ఆడుతున్న దృశ్యాలు మీడియా కంటికి చిక్కడంతో…వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌ వరకు వెళ్లింది. ఈ ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని డీఆర్వో మలోలకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు.

Whats_app_banner

టాపిక్

AnantapurViral VideosAndhra Pradesh NewsTrending ApTelugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024