Parenting Tips: జాగ్రత్త! ఈ ఐదు సందర్భాల్లో ఫోన్ పట్టుకుని కనిపించారంటే మీకూ మీ పిల్లలకూ మధ్య దూరం పెరుగిపోతుంది!

Best Web Hosting Provider In India 2024

Parenting Tips: జాగ్రత్త! ఈ ఐదు సందర్భాల్లో ఫోన్ పట్టుకుని కనిపించారంటే మీకూ మీ పిల్లలకూ మధ్య దూరం పెరుగిపోతుంది!

Ramya Sri Marka HT Telugu
Jan 21, 2025 07:30 PM IST

Parenting Tips: బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా మీ దినచర్యలో మీరు త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని సందర్బాల్లో చేతిలో ఫోన్‌తో మీరు మీ పిల్లలకు కనిపించారంటే వారికీ మీకూ మధ్య ఉన్న సంబంధం చెడిపోతుంది. పిల్లల ముందు ఫోన్‌ని ఉపయోగించకూడని కొన్ని సందర్భాల గురించి తెలుసుకుందాం.

ఈ ఐదు సందర్భాల్లో ఫోన్ పట్టుకుని కనిపించారంటే మీకూ మీ పిల్లలకూ మధ్య దూరం పెరుగిపోతుంది!
ఈ ఐదు సందర్భాల్లో ఫోన్ పట్టుకుని కనిపించారంటే మీకూ మీ పిల్లలకూ మధ్య దూరం పెరుగిపోతుంది! (Shutterstock)

స్మార్ట్‌ఫోన్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. కొన్ని రోజులు కాదు కొన్ని గంటలు కూడా ఫోన్ లేకుండా కనీసం కొన్ని క్షణాలు గడపడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కొందరికి. సాధారణంగా పిల్లలే ఎక్కువగా ఫోన్ లేదా టీవీ చూస్తారని తల్లిదండ్రులు ఆరోపించవచ్చు. కానీ నిజం ఏమిటంటే కొంతమంది తల్లిదండ్రులు కూడా ఫోన్‌లో బిజీగా ఉంటూ పిల్లలను పట్టించుకోవడం మానేస్తున్నారు. పెంపకంలో వెనుకబడిపోతోతున్నారు. పని కోసం లేదా వినోదం కోసం ఫోన్‌ని ఉపయోగించడంలో తప్పు లేదు, కానీ దానిని అతిగా టైం పాస్ కోసం ఎల్లప్పుడూ ఫోన్ పట్టుకుని కూర్చోవడం మంచిది కాదు.

yearly horoscope entry point

ముఖ్యంగా మీ పిల్లలు చాలా చిన్నవారైతే వారికి మీ శ్రద్ధ ఎక్కువగా అవసరం. ఈ సమయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో మీకు, మీ బిడ్డకు మధ్య దూరం పెరుగుతుంది. నిపుణులు, అధ్యయనాల ప్రకారం.. పిల్లల ముందు తల్లిదండ్రుల ఫోన్ పట్టుకోకూడని కొన్ని సమయాల గురించి తెలుసుకోండి.

1. ఉదయం నిద్రలేచినప్పుడు..

చాలా మంది తల్లిదండ్రులకు ఉదయం లేవగానే ఫోన్‌లో బిజీ అవ్వడం అలవాటు. వారు వర్కింగ్ మెయిల్‌ని చెక్ చేయడం లేదా సోషల్ మీడియాను స్క్రోల్ చేయడం చేస్తారు. కానీ మీకు, మీ బిడ్డకు మధ్య బంధం విషయానికొస్తే ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇదే సమయంలో మీ బిడ్డ కూడా నిద్రలేస్తుంది. ఈ సమయంలో పిల్లలకు మీ ప్రేమ, కంటి చూపు చాలా అవసరం. కాబట్టి ఫోన్‌ని పక్కన పెట్టి, మీ బిడ్డను మీ దగ్గర కూర్చోబెట్టుకుని, వారిని కౌగిలించుకుని, మంచి మాటలు చెప్పి రోజును ప్రారంభించండి. ఇది మీ ఇద్దరి మధ్య ప్రేమ, బంధాన్ని మరింత బలపరుస్తుంది.

2. పిల్లలు స్కూల్‌కి వెళ్లే ముందు

ఉదయాన్నే పిల్లలు స్కూల్‌కి వెళ్లేటప్పుడు మీరు ఫోన్‌లో బిజీగా ఉండకుండా మీ బిడ్డపై దృష్టి పెట్టాలి. వారితో మాట్లాడండి, వారిని ప్రోత్సహించండి. మీరు వారి కోసం ఏమి చేయబోతున్నారో చెప్పండి. ఇది వారికి ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. మీతో వారి సంబంధాన్ని బలపరుస్తుంది.

3. స్కూల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు

పిల్లలు అలసిపోయి స్కూల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు కూడా తల్లిదండ్రులు ఫోన్‌లో బిజీగా ఉండకుండా వారిని సంతోషంగా స్వాగతించండి. స్కూల్లో వారి రోజు ఎలా గడిచిందో అడగండి, వారి మాటలు, అభిప్రాయాలను వినండి. వారితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో వారిని నిర్లక్ష్యం చేస్తే వారు ఒంటరిగా భావిస్తారు. భవిష్యత్తులో వారి మీతో విషయాలను పంచుకోకుండా ఆపుతుంది. ఇది మీ సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది.

4. భోజనం చేసేటప్పుడు ఫోన్‌ని ఉపయోగించవద్దు

తల్లిదండ్రులుగా మీరు చేసే పనులన్నీ పిల్లలపై ప్రభావం చూపుతాయని గుర్తంచుకోవడి. చాలా సార్లు మీరు చేసే పనులనూ మీ పిల్లలు కూడా అనుకరిస్తారు. కాబట్టి మీరు భోజనం చేసేటప్పుడు ఫోన్‌లో బిజీగా ఉంటే మీ పిల్లలు కూడా అదే చేస్తారు. ఇది మీ కుటుంబ బంధాన్ని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.

5. పిల్లలు పడుకునే ముందు

రాత్రి పడుకునే ముందు పిల్లలతో గడిపే సమయం వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ సమయంలోనే మీ బిడ్డ మీతో తన మనసులోని మాటలన్నీ పంచుకుంటుంది. మీతో చాలా జ్ఞాపకాలను సృష్టిస్తుంది. మీకు కూడా మీ అమ్మ, అమ్మమ్మ లేదా నానమ్మ చెప్పిన కథలు, పాటలు ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. కాబట్టి మీ పిల్లలకు కూడా ఈ సమయాన్ని ప్రత్యేకంగా మార్చండి. వారికి కూడా ఈ అనుభూతులను పంచండి. రాత్రిపూట ఫోన్‌ని పక్కన పెట్టి వారితో మీ సంబంధాన్ని బలపరచుకోండి.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024